Home Invasion Thriller OTT : భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లల బాధ్యత మొత్తం తల్లిపైనే పడింది. వాళ్లను కాపాడుకోవడమే తన ప్రపంచంగా బతుకుతున్న ఆమెకు ఒక్క రాత్రిలోనే ఊహించని ప్రమాదం ఎదురైతే ? అత్యాధునిక సెక్యూరిటీ ఉన్న ఇంట్లో పిల్లలు బందీలుగా చిక్కుకుపోతే ? బయట ఉన్న తల్లి లోపలికి వెళ్లలేక, లోపల ఉన్న పిల్లలు బయటకు రాలేకపోతే ? పైగా ఇంట్లోకి చొరబడిన క్రిమినల్స్ వెతుకుతున్నది కోట్ల విలువైన డబ్బు అయితే ? గాబ్రియెల్ యూనియన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘Breaking In’ ఇలాంటి హై టెన్షన్ కథతో సాగుతుంది. 2018లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ఓ తల్లి ఎంత దూరమైనా వెళ్లగలదనే పాయింట్‌ను యాక్షన్, సస్పెన్స్‌తో చూపించారు. మరి ఆ ఇంట్లో ఉన్న డబ్బు ఎవరిది ? పిల్లలను బందీలుగా చేసుకున్న వాళ్లు ఎవరు ? తల్లి వాళ్ల ఆటను ఎలా తిప్పికొట్టింది ? అనే వివరాలు తెలియాలంటే స్టోరీపై ఒక లుక్కేద్దాం పదండి.
షాన్ రస్సెల్ ఇందులో హీరోయిన్. తన ఇద్దరు పిల్లలు జాస్మిన్, గ్లోవర్‌తో కలిసి ఇటీవల మరణించిన తన తండ్రి ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటిని అమ్మే ముందు కొన్ని పనులు పూర్తి చేయాలనేది ఆమె ప్లాన్. ఆ ఇల్లు బయటకు సాధారణ ఇల్లులా కనిపించినా, లోపల మాత్రం అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. కానీ వాళ్లు అక్కడికి చేరుకునే సమయానికే నలుగురు క్రిమినల్స్ ఇంట్లోకి చొరబడతారు. ఇంట్లో దాచిన నాలుగు మిలియన్ డాలర్ల నగదును దొంగిలించడమే వాళ్ల టార్గెట్. పిల్లలను బందీలుగా పట్టుకుని, షాన్‌ను ఇంటి బయటే ఉంచేస్తారు. అక్కడి నుంచే అసలు మైండ్ గేమ్ మొదలవుతుంది.
పోలీసుల కోసం ఎదురుచూస్తే పిల్లల ప్రాణాలకు ప్రమాదమని అర్థం చేసుకున్న షాన్ స్వయంగా రంగంలోకి దిగుతుంది. ఇంటి సెక్యూరిటీ వ్యవస్థనే తనకు అనుకూలంగా మార్చుకుంటూ, ఒక్కో క్రిమినల్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్లలో కొందరు అత్యంత క్రూరంగా వ్యవహరించడంతో ప్రతి నిర్ణయం ప్రాణాంతకంగా మారుతుంది. ఆ నాలుగు మిలియన్ డాలర్లు ఇంట్లో ఎందుకు ఉన్నాయి ? షాన్ తండ్రికి వాటితో సంబంధం ఏంటి ? పిల్లలను ప్రాణాలతో విడిచి పెట్టాలని క్రిమినల్స్ నిజంగానే అనుకుంటున్నారా ? చివరికి ఒంటరిగా ఉన్న షాన్ తన ఇద్దరు పిల్లలను ఎలా కాపాడుకుంటుంది ? అనేదే సినిమాలో చూడాల్సిన ఉత్కంఠభరితమైన కథ.
Also Read : యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్
జేమ్స్ మెక్‌టైగ్ దర్శకత్వం వహించిన ‘బ్రేకింగ్ ఇన్’లో గాబ్రియెల్ యూనియన్, బిల్లీ బర్క్, రిచర్డ్ కాబ్రల్, అజియోనా అలెక్సస్, లెవీ మీడెన్, సేత్ కార్ తదితరులు నటించారు. సుమారు 88 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2018 మే 11న థియేటర్లలో విడుదలైంది. దాదాపు 6 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 51 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. అయితే తెలుగు డబ్బింగ్ లేదు. కావాలంటే హిందీలో చూడవచ్చు. హోమ్ ఇన్వేషన్, కిడ్నాప్, తల్లి పిల్లల ఎమోషన్, ఫాస్ట్ యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్స్ అంశాలతో ఇది సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది.