E-Paper
Advertisement

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ
Advertisement

Music Documentary OTT : ఒక్క పాటతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మ్యూజిక్ లెజెండ్ జీవితంలో… స్టేజ్‌ పై కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో ప్రేమలు, గుండె పగిలే సంఘటనలు, విషాదాలు, వైఫల్యాలు, విజయాలు దాగి ఉంటే ? ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఓ కళాకారుడి జీవితాన్ని కెమెరా ఏడాది పాటు వెంటాడితే ? రికార్డింగ్ స్టూడియో నుంచి రిహార్సల్స్ వరకు, టూర్ల నుంచి లైవ్ పెర్ఫార్మెన్స్‌ల వరకు ప్రతి క్షణాన్ని దగ్గరగా చూపిస్తే ? అర్జెంటీనా రాక్ స్టార్ ఫిటో పాయెజ్ జీవితాన్ని ఇంత సన్నిహితంగా ఆవిష్కరించే డాక్యుమెంటరీనే ‘Fito Páez The World Within a Song’. సెప్టెంబర్ 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మ్యూజిక్ డాక్యుమెంటరీలో అతని సంగీత ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితంలోని ప్రేమలు, బ్రేకప్‌లు, పిల్లలు, స్నేహాలు, విషాదాలు, కష్టాలు, విజయాలను కూడా చూపించారు. మరి నాలుగు దశాబ్దాలకు పైగా సంగీత ప్రపంచంలో కొనసాగుతున్న ఫిటో జీవిత కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇది సాధారణ బయోపిక్ కాదు. ఫిటో పాయెజ్‌ ను కెమెరా ఒక సంవత్సరం పాటు దగ్గరగా ఫాలో అవుతుంది. రికార్డింగ్ సెషన్లు, రిహార్సల్స్, టూర్లు, లైవ్ షోలు ఇలా అతని సంగీత ప్రపంచంలోకి ప్రేక్షకులను నేరుగా తీసుకెళ్తుంది. కెమెరా ఎక్కువగా కనిపించకుండా అతని రోజువారీ జీవితాన్ని గమనిస్తూ, ఒక కళాకారుడి వెనుక ఉన్న మనిషిని పరిచయం చేస్తుంది.

Advertisement

ఫిటో పాయెజ్ స్పానిష్ భాషా సంగీత ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన కళాకారుల్లో ఒకరు. అందుకే ఈ డాక్యుమెంటరీలో కేవలం పాటలు, కచేరీలే కాదు, అతని జీవితంలోని వ్యక్తిగత కోణాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ప్రేమలో ఎదురైన అనుభవాలు, హార్ట్‌బ్రేక్‌లు, పిల్లలతో అనుబంధం, స్నేహాలు, గతంలోని విషాదాలు, జీవితంలో ఎదురైన వైఫల్యాలు, వాటిని దాటి సాధించిన విజయాలు ఇలా ఎన్నో విషయాలు తెరపైకి వస్తాయి.

మ్యూజిక్ లెజెండ్‌గా కనిపించే ఫిటో వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎలా ఉంటాడు ? అతని పాటలకు ప్రేరణగా మారిన అనుభవాలు ఏంటి ? విజయాల మధ్య అతను ఎదుర్కొన్న బాధలు ఎలాంటి ప్రభావం చూపాయి ? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొత్త సంగీతాన్ని సృష్టించే శక్తి ఎక్కడి నుంచి వస్తోంది ? అనేదే ఈ డాక్యుమెంటరీలో ఆసక్తిని పెంచే అంశం.

Advertisement

Also Read : బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

తెలుగులోనూ ఉందా ?

మతియాస్ గుయెల్‌బర్ట్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో స్వయంగా ఫిటో పాయెజ్ కనిపిస్తారు. ఇది అర్జెంటీనాకు చెందిన స్పానిష్ మ్యూజిక్ డాక్యుమెంటరీ. 2026 సెప్టెంబర్ 3న Netflixలో విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ తెలుగు ఆడియో లిస్ట్ కాలేదు. స్పానిష్ ఒరిజినల్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ఇంగ్షీషులో చూడవచ్చు. సంగీతం వెనుక ఉండే మనిషి కథ, ప్రేమలు, విషాదాలు, వైఫల్యాలు, విజయాలను తెలుసుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా ఫిటో అభిమానులకు ఇదొక ఎమోషనల్ మ్యూజికల్ జర్నీ.

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×