E-Paper
Advertisement

Punjab: ఆఫీసులో దారుణం.. మాజీ ప్రియురాల్ని 20 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు, ఆపై తనకు తాను

Punjab: ఆఫీసులో దారుణం.. మాజీ ప్రియురాల్ని 20 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు, ఆపై తనకు తాను
Advertisement

Punjab: వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఆపై విడిపోయారు. కాకపోతే ఇద్దరు ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. సహచరులు రెచ్చగొట్టారా? చెప్పుడు మాటలు ఆగ్రహానికి ఆ వ్యక్తి లోనయ్యాడా? అనేది తెలీదు. తన మాజీ ప్రియురాలిని ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపేశారు. చివరకు మాజీ ప్రియుడు కూడా ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డారు. సంచలనం రేపిన ఈ ఘటన పంజాబ్ లో వెలుగుచూసింది.

పంజాబ్‌లో దారుణం.. ఆఫీసులో మాజీ ప్రియురాల్ని చంపిన ప్రియుడు

Advertisement

పంజాబ్‌లోని మొహాలీలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు 39 ఏళ్ల హర్జిందర్ సింగ్. ఆ ఆఫీసులో పాటియాలాకు చెందిన 30 ఏళ్ల డింపుల్ ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరు మాటా మాటా కలవడం మొదలైంది. ఆ తర్వాత మూడేళ్లుగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఏం జరిగిందో ఇద్దరు కొన్నాళ్లుగా ఎడముఖం పెడముఖంగా వుంటూ వచ్చారు.

దీన్ని తట్టుకోలేకపోయిన హర్జిందర్, మాజీ ప్రియురాల్ని కలిసేందుకు ప్రయత్నాలు చేశాడు. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఆ తర్వాత చాలా ఇబ్బందిపడ్డాడు. చివరకు తట్టుకోలేకపోయిన సదరు వ్యక్తి, గురువారం సాయంత్రం కంపెనీకి వెళ్లిన హర్జిందర్, తనతో తెచ్చుకున్న కత్తితో మాజీ ప్రియురాలిపై దాడి చేశాడు.

Advertisement

20 సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు, ఆపై గొంతు కోసుకున్న ప్రియుడు

ఆ సమయంలో డింపుల్ తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. వెంటాడి మరీ 20 సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపి తన కసి తీర్చుకున్నాడు. తోటి ఉద్యోగులు ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. ఐనప్పటికీ ఫలితం లేకపోయింది. అంతేకాదు హర్జిందర్ తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు ఆఫీసులోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. భయపడిన ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దర్నీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ మహిళ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ALSO READ:  ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి

ఈ నేరం వెనుక ఉన్న అసలు కారణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. హర్జిందర్-డింపుల్‌ల సంబంధంపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. పోలీసులు నిందితుడికి, బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు పాటియాలాకు చెందినవారని తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×