E-Paper
Advertisement

iPhone 18 సిరీస్‌ కోసం క్రిస్మస్ వరకు ఆగాల్సిందేనా? యాపిల్ కొత్త రిలీజ్ క్యాలెండర్‌లో షాకింగ్ అప్డేట్స్!

iPhone 18 సిరీస్‌ కోసం క్రిస్మస్ వరకు ఆగాల్సిందేనా? యాపిల్ కొత్త రిలీజ్ క్యాలెండర్‌లో షాకింగ్ అప్డేట్స్!
Advertisement

iPhone 18 Pro Price Leaks: యాపిల్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iPhone 18 సిరీస్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈసారి యాపిల్ తమ Pro మోడల్స్ ధరలను పెంచడం లేదట. దీంతో iPhone 18 Pro, Pro Max ఫోన్లు గత ఏడాది రేట్లకే లభించే ఛాన్స్ ఉంది. Pro మోడల్ సుమారు రూ.92,000, Pro Max రూ.1,00,000 (అమెరికా ధరల ప్రకారం) వద్ద ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడూ రేట్లు పెరుగుతాయేమో అని టెన్షన్ పడే ఐఫోన్ ప్రియులకు ఇది నిజంగా మంచి విషయమే.

శాంసంగ్ బాటలోనే యాపిల్:

నిజానికి యాపిల్ ప్లాన్ చూస్తుంటే శాంసంగ్ చేసిన పనే మళ్లీ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ మధ్యే శాంసంగ్ కూడా తమ Ultra ఫోన్ ధరను పెంచకుండా, బేస్ మోడల్స్ రేట్లు పెంచేసింది. ఇప్పుడు యాపిల్ కూడా అదే ట్రిక్ వాడుతోంది. ఎక్కువగా అమ్ముడయ్యే ఖరీదైన Pro మోడల్స్ రేట్లు పెంచితే కస్టమర్లు వెనకడుగు వేస్తారని, అందుకే వాటిని అలాగే ఉంచి మిగిలిన తక్కువ ధర ఫోన్ల మీద ఆ భారం వేయాలని చూస్తోంది.

Advertisement

Also Read: ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!

రిలీజ్ డేట్లలో షాకింగ్ మార్పు:

ఐఫోన్ ఎప్పుడూ సెప్టెంబరులోనే అన్ని మోడల్స్ లాంచ్ చేస్తుంది కదా.. కానీ ఈసారి సీన్ మారుతోంది. సెప్టెంబరు నెలలో కేవలం Pro మోడల్స్, ఇంకా కొత్తగా వస్తున్న ఫోల్డబుల్ ఫోన్లను మాత్రమే లాంచ్ చేస్తారట. బడ్జెట్‌లో దొరికే మామూలు iPhone 18 మోడల్స్ కోసం మాత్రం 2027 వరకు ఆగాల్సిందేనట. అంటే.. ఈ ఏడాది పండగ సీజన్‌లో కొత్త ఐఫోన్ కొనాలంటే, మనకు ప్రో మోడల్స్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు.

బడ్జెట్ ఫోన్ల కోసం ఎదురుచూపులు:

Advertisement

తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కొందామనుకునే వారికి ఇది కొంచెం చేదు వార్తే. iPhone 18 బేస్ మోడల్, iPhone Air లాంటివి 2027 వసంత కాలం వచ్చే వరకు మార్కెట్లోకి రాకపోవచ్చు. ఇలా లాంచ్ ఆలస్యం చేయడం వెనుక యాపిల్ తెలివైన ప్లాన్ ఉంది. బడ్జెట్ ఫోన్ల కోసం చూసేవాళ్లు కూడా ఈ గ్యాప్‌లో ఖరీదైన ఫోన్లే కొనేలా చేయాలన్నది వారి ఆలోచన కావచ్చు. పైగా ఆ టైమ్ నాటికి తయారీ ఖర్చులు పెరిగితే, బేస్ మోడల్ ధర కూడా iPhone 17 కంటే ఎక్కువే ఉండొచ్చు.

స్టోరేజ్‌ విషయంలో మెలిక:

ధర పెంచడం లేదని మురిసిపోతున్నా.. లోపల ఇంకో చిన్న మెలిక ఉంది. ఇప్పుడున్న 128GB మోడల్‌ను తీసేసి, డైరెక్టుగా 256GB ఫోన్‌నే బేస్ వేరియంట్‌గా తెచ్చే అవకాశం ఉంది. దీనివల్ల స్టార్టింగ్ రేటు మారకపోయినా, హైఎండ్ స్టోరేజ్ కావాలనుకునే వాళ్లు ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. RAM రేట్లు బాగా పెరిగిపోవడంతో.. ఆ నష్టాన్ని కవర్ చేయడానికి యాపిల్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: Galaxy S26 యూజర్ల కోసం One UI 9 బీటా లాంచ్.. మీ ఫోన్ లుక్ మార్చేసే 5 క్రేజీ ఫీచర్లు ఇవే!

Related News

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

Big Stories

Advertisement
×