E-Paper
Advertisement

S Badrinath: 15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి.. ఫాస్ట్ గా ఆడ‌టం విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి

S Badrinath: 15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి.. ఫాస్ట్ గా ఆడ‌టం విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి
Advertisement

S Badrinath:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ పైన తీవ్రమైన విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఎన్నిసార్లు ఆయన మ్యాచులు ఛేజింగ్ చేసి గెలిపించినా, అర్థ సెంచరీలు, సెంచరీలు నమోదు చేసినా ఆడుకుంటున్నారు. దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. స్లోగా ఆడుతున్నారని విరాట్ కోహ్లీని (Virat Kohli) వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి, నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ పరువు తీసేలా టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ (Subramaniam Badrinath) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి.. ఫాస్ట్ గా ఆడ‌టం విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి

Advertisement

విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడుతున్నాడని చురకలు అంటించారు. వెంటనే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని, అప్పుడే విరాట్ కోహ్లీ (Virat Kohli ) ఫాస్ట్ గా ఆడతాడు అని బాంబు పేల్చారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ మంచి నీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లు అలాగే బౌండరీలు కొడుతున్నాడని, అతన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ పరోక్షంగా మండిపడ్డారు. వైభవ్ సూర్య వంశీ తరహాలో విరాట్ కోహ్లీ ఆడాలని, అప్పుడే అతనికి ఆదరణ మరింత పెరుగుతుందని వెల్లడించారు సుబ్రమణ్యం బద్రీనాథ్. దీంతో సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

వెంటనే రంగంలోకి దిగిన విరాట్ కోహ్లీ అభిమానులు… సోషల్ మీడియాలో సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ను ఉద్దేశించి వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఆడిన విషయాన్ని గుర్తు చేస్తూ… ఇదంతా ధోని ( MS DHONI) గ్యాంగ్ చేస్తున్న కుట్ర అంటూ కౌంటర్లు పేల్చుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్లు అందరూ ఇప్పుడు విరాట్ కోహ్లీ పై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బెంగళూరు అభిమానులు. ఇలాంటి వాళ్లను ఉరితీయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వీళ్లకు ఆడటం చేతకాదు… ఆడే వాడిని కించపరచడం మాత్రమే వచ్చు అంటూ సీరియస్ అవుతున్నారు.

58 బంతుల్లో విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేయ‌డంపై విమ‌ర్శ‌లు

Advertisement

కేకేఆర్ పై 58 బంతుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెంచరీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. 58 బంతులు ఆడితే, డబుల్ సెంచరీలు నమోదు చేసే ఆటగాళ్లు ఉన్నారని ఇంజమామ్ వ్యాఖ్యానించారు. తాను కూడా 58 బంతులు ఎదుర్కొంటే, ఈజీగా 200 కొట్టేవాడినని విరాట్ కోహ్లీ పరుగు తీశారు. టీ20లకు విరాట్ కోహ్లీ పనికిరాడు అని దారుణంగా ట్రోల్ చేశారు.

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×