E-Paper
Advertisement

Puttaparthi: బంగారం ఉత్పత్తికి కేరాఫ్ ఏపీ, పుట్టపర్తి సభలో సీఎంచంద్రబాబు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్

Puttaparthi: బంగారం ఉత్పత్తికి కేరాఫ్ ఏపీ, పుట్టపర్తి సభలో సీఎంచంద్రబాబు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్
Advertisement

Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం గర్వకారణంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ చరిత్రాత్మకమై రోజుగా వర్ణించారు. పుట్టపర్తి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సత్యసాయి బాబా అని అన్నారు సీఎం చంద్రబాబు. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు..ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రమని అన్నారు. పుట్టపర్తి అంటే భక్తికి మాత్రమే కాదు, దేశ భద్రతకు చిరునామాగా నిలుస్తుందన్నారు.

బంగారం ఉత్పత్తికి కేరాఫ్ ఏపీ-సీఎం చంద్రబాబు

Advertisement

పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రలు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు.

ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్ అని, ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అని అన్నారు. ఈ ఏడాదిలో బంగారం ఉత్పత్తి మొదలవుతుందన్నారు. దాదాపు 600 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది 1500 టన్నుల బంగారం వెలికి తీస్తామన్నారు. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారుతోందన్నారు.

Advertisement

చంద్రబాబు వల్ల గూగుల్ లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతోంది- కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఇబ్బందులు వస్తే మంత్రి లోకేష్ పరిష్కరించారని వివరించారు. మళ్లీ ఆర్డీటీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామంగా వర్ణించారు. ఇప్పుడు మనకు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందన్నారు. పొదుపు చర్యలపై ప్రధాని మోడీ ఏడు కీలక సూచనలు చేశారని గుర్తు చేశారు.

మనమంతా బాధ్యతయుతంగా ప్రధాని చెప్పిన సూచనలను పాటించాల్సిన అవసరముందన్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. అనేక దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు చేపట్టాయని వివరించారు. ప్రధానిమంత్రి చెప్పిన పొదుపు ఉద్యమం మన రాష్ట్రం లీడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పుట్టపర్తి నుంచి ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

సీఎం చంద్రబాబు లాంటి దూరదృష్టి కలిగిన నాయకుడ్ని ఎక్కడా చూడలేదన్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు లాంటి నాయకుడు ఉండాలన్నారు. ఆయన వల్లే గూగుల్ లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టబోతోందన్నారు. విద్య, సేవ, ఆధ్యాత్మికతో పుట్టపర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు.

ALSO READ: సీమకు ‘రక్షణ’..డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ వల్లే సాధ్యం-మంత్రి లోకేష్

రక్షణ రంగంలో పబ్లిక్‌-ప్రైవేటు రంగాలు కలిపి నడుస్తున్నాయని తెలిపారు. రక్షణ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీ ఒక గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని, వివిధ కంపెనీలు కర్నూలులో డ్రోన్‌ సిటీ ప్రారంభానికి సిద్ధమయ్యాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ పాత్ర కీలకంగా మారిందని, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ రూ.1294 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు.

ఆయుధాల తయారీ రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని, ఒకప్పుడు యుద్ధం సమయంలో సొంత భద్రత కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చేదన్నారు. కొన్నాళ్లు కిందట రక్షణ రంగంలో ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు.

2004లో కేవలం భారత్‌ రూ.46వేల కోట్ల విలువైన ఆయుధ పరికరాల తయారీ మాత్రమే ఉండేదని, రికార్డు స్థాయిలో అంటే రూ.1.75లక్షల కోట్లకు చేరిందన్నారు. శుక్రవారం పుట్టపర్తిలో డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కేంద్రమంత్రి రాజ్ నాథ్, సీఎం చంద్రబాబు. దాదాపు రూ. 3,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

Related News

జోగి రమేష్ చిలక పలుకులు.. ఫ్యామిలీ మేటర్‌ని రాజకీయం చేయొద్దు, ప్లీజ్ అంటూ

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయాలకు పదును.. వైసీపీని టచ్ చేస్తూ, లవ్ జీహాద్ అంటూ..

ఏపీలో లిక్కర్ కేసు కొత్త మలుపు.. మాజీ మంత్రి కారుమూరు అరెస్ట్, రేసులో మరో నలుగురు నేతలా?

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణలకు భారీ వర్ష సూచన

ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్!

చంద్రయాన్-3 విజయంలో ఏపీ పాత్ర కీలకం: చంద్రబాబు

యూడైస్ ప్లస్ లెక్కలతో బట్టబయలైన డొల్లతనం.. కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ఫైర్!

కాకినాడలో చితక్కొట్టుకున్న ఆంధ్ర, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలు.. ఏపీ సీఎంకు మణిపూర్ సీఎం విజ్ఞప్తి

Big Stories

Advertisement
×