E-Paper
Advertisement

NavIC ISRO GPS: చైనా స్మార్ట్‌ఫోన్‌లో ఇండియన్ టెక్నాలజీ.. అమెరికన్ జిపిఎస్‌ సిస్టమ్‌కు ఛాలెంజ్

NavIC ISRO GPS: చైనా స్మార్ట్‌ఫోన్‌లో ఇండియన్ టెక్నాలజీ.. అమెరికన్ జిపిఎస్‌ సిస్టమ్‌కు ఛాలెంజ్
Advertisement

NavIC ISRO GPS| చైనా మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. హానర్ బ్రాండ్ అద్భుత ఫీచర్లతో హానర్ పవర్ 2 ఫోన్‌ ప్రస్తుతం చైనాలో విడుదల అయింది. ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీతో పాటు భారతదేశం అభివృద్ధి చేసిన నావిక్ నావిగేషన్ టెక్నాలజీ ఉండడం ప్రత్యేకం. అమెరికా జీపీఎస్‌కు పోటీగా ఇస్రో ఈ సాంకేతికత అభివృద్ధి చేసింది. నావిక్ ప్రాంతీయంగా మరింత కచ్చితమైన, నమ్మదగిన సిగ్నల్స్ అందిస్తుంది.

హానర్ పవర్ 2లో భారీ బ్యాటరీ అప్‌గ్రేడ్

Advertisement

హానర్ పవర్ 2లో 10,080mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది ఎక్కువ కాలం ఛార్జ్ లేకుండా పనిచేస్తుంది. గేమింగ్, నావిగేషన్, రోజువారీ భారీ ఉపయోగాలకు అనువైనది. హానర్ ఈ బ్యాటరీని ఫోన్ ప్రధాన బలంగా చూపిస్తోంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

చైనా స్మార్ట్‌ఫోన్‌లో భారత నావిక్ టెక్నాలజీ

హానర్ అధికారిక చైనా వెబ్‌సైట్‌లో నావిక్ సపోర్ట్‌ను నిర్ధారించింది. ఫోన్ L5 ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌తో నావిక్‌ను ఉపయోగిస్తుంది. జీపీఎస్, ఏ-జీఎన్‌ఎస్‌ఎస్, గ్లోనాస్ జీ1 వంటి ఇతర సిస్టమ్‌లతో కలిసి పనిచేస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఉత్తమ నావిగేషన్ సిస్టమ్‌ను ఆటోమాటిక్‌గా ఎంచుకుంటుంది.

నావిక్ అంటే ఏమిటి, ఎందుకు ముఖ్యం?

Advertisement

నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్. ఇస్రో దేశీయంగా రూపొందించి, స్వయంగా నియంత్రించే స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ ఇది. అన్ని భాగాలు భారత్‌లోనే తయారయ్యాయి. ప్రస్తుతం భారతదేశం, సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల వరకు కవర్ చేస్తుంది. భవిష్యత్తులో విస్తరణ ఉంటుంది. భారత ఉపగ్రహాల సహాయంతో కచ్చితమైన లొకేషన్ సమాచారం అందిస్తుంది.

నావిక్ సిస్టమ్ టెక్నికల్ నిర్మాణం?

నావిక్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్, రెస్ట్రిక్టెడ్ సర్వీస్ అందిస్తుంది. L5, S ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లపై పనిచేస్తుంది. భవిష్యత్తులో L1 బ్యాండ్ జోడించి ప్రపంచ డివైస్‌లతో అనుకూలత పెంచనున్నారు. 2018లో అధికారికంగా అభివృద్ధి చేశారు. ప్రాంతీయ కచ్చితత్వంపై దృష్టి పెట్టింది.

స్మార్ట్‌ఫోన్‌లలో నావిక్‌కు ప్రభుత్వ సపోర్ట్?

భారత ప్రభుత్వం నావిక్ టెక్నాలజీ ఉపయోగించాలని సంబంధిత రంగాలకు ప్రోత్సహిస్తోంది. భారత్‌లో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లలో అందుకే నావిక్ సపోర్ట్ తప్పనిసరి చేసింది. ఇది స్వదేశీ సిస్టమ్‌ను బలోపేతం చేస్తుంది. విదేశీ నావిగేషన్ సిస్టమ్‌లపై ఆధారపడటం తగ్గిస్తుంది.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

ప్రపంచ వ్యాప్తంగా జీపీఎస్ సిస్టమ్

జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అమెరికా మిలిటరీ అభివృద్ధి చేసింది. 31 ఉపగ్రహాలతో ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ అందిస్తుంది. చాలా స్మార్ట్‌ఫోన్‌లు లొకేషన్ సర్వీస్ కోసం జీపీఎస్‌పైనే ఆధారపడతాయి.

జీపీఎస్ ప్రత్యామ్నాయంగా నావిక్

నావిక్ ప్రాంతీయంగా ఎక్కువ కచ్చితత్వం ఇస్తుంది. నగరాలు, స్థానిక ప్రాంతాల్లో మెరుగైన పనితీరు. జీపీఎస్‌కు నావిక్ సవాలు విసురుతుందని నిపుణులు అంటున్నారు. భవిష్యత్ అప్‌గ్రేడ్‌లతో ప్రపంచ స్థాయి పోటీ ఉంటుంది. హానర్ పవర్ 2లో నావిక్ వినియోగం భారత టెక్నాలజీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×