E-Paper
Advertisement

iPhone Duoపై 25% డిస్కౌంట్ అంటూ వల.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ ఇదే!

iPhone Duoపై 25% డిస్కౌంట్ అంటూ వల.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ ఇదే!
Advertisement

iPhone Duo Scam: యాపిల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో కోసం ఎదురుచూస్తున్న వారికి సైబర్ నేరగాళ్లు షాక్ ఇస్తున్నారు. ఈ ఫోన్‌ను తక్కువ ధరకు అందిస్తామంటూ కొన్ని నకిలీ వెబ్‌సైట్లు తెరపైకి వచ్చాయి. అచ్చం యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించేలా వీటిని తయారు చేసి, కొనుగోలుదారుల వ్యక్తిగత వివరాలను దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కీ ఈ మోసాలను గుర్తించింది.

25 శాతం డిస్కౌంట్ ఆఫర్:

కాస్పర్‌స్కీ గుర్తించిన ఓ వెబ్‌సైట్ ఐఫోన్ డ్యూయోపై 25 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. ఆఫర్ ముగియడానికి కేవలం 30 నిమిషాలే ఉన్నాయంటూ కౌంట్‌డౌన్ కూడా చూపించింది. ఇలాంటి ట్రిక్స్‌తో కస్టమర్లు తొందరపడి నిర్ణయం తీసుకునేలా చేస్తారు. ఈ సైట్‌లో ఫోన్ కొనుగోలు చేసే సమయంలో కార్డు వివరాలు అడగకపోయినా.. పేరు, ఫోన్ నంబర్, చిరునామా వంటి వివరాలను సేకరిస్తోంది. ఆ తర్వాత మేనేజర్ ఫోన్ చేసి పేమెంట్ గురించి మాట్లాడతారని చెబుతోంది. ఆ కాల్ ద్వారానే డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని కాస్పర్‌స్కీ హెచ్చరిస్తోంది.

Advertisement

Also Read: ఇదేం విడ్డూరం యాపిల్ మామా.. వాడిన కొన్ని గంటల్లోనే iPhone Duo స్క్రీన్ ఢమాల్!

యాపిల్ పేరుతో మరో ట్రిక్:

మరో నకిలీ వెబ్‌సైట్‌లో భాష, కరెన్సీ ఎంచుకునే ఆప్షన్లు, ఫోన్ ఫీచర్ల వివరాలు ఉన్నాయి. ప్రీ-ఆర్డర్ పూర్తి చేయడానికి యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌కు తీసుకెళ్తామని కూడా చెప్పింది. కానీ చివరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇలాంటి సైట్లు నమ్మదగినవిగా కనిపించినా.. వాటి అసలు లక్ష్యం వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కావచ్చు. కొన్ని సందర్భాల్లో వాట్సప్ ద్వారా సంప్రదించి డబ్బులు అడిగే ప్రమాదం కూడా ఉంది.

భారత్‌లోనూ జాగ్రత్త అవసరం:

Advertisement

భారత్‌లో ఐఫోన్ డ్యూయో ప్రీ-ఆర్డర్లు గంటలోపే పూర్తయ్యాయని, కొత్త ఆర్డర్లకు జనవరి డెలివరీ తేదీలు చూపిస్తున్నాయని సమాచారం. స్టాక్ దొరకకపోవడంతో త్వరగా ఫోన్ కొనాలనుకునే వారు ఇలాంటి మోసాలకు సులభంగా చిక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సప్ ఫార్వర్డ్‌లలో వచ్చే లింకులను గుడ్డిగా నమ్మకూడదు.

సురక్షితంగా ఫోన్ కొనాలంటే?

యాపిల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, ముంబైలోని Apple BKC, ఢిల్లీలోని Apple Saket లేదా గుర్తింపు పొందిన విక్రేతల నుంచే ఫోన్ కొనడం మంచిది. వెబ్‌సైట్ అడ్రస్‌ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే వివరాలు నమోదు చేయాలి. భారీ డిస్కౌంట్లు, వెంటనే కొనాలనే ఒత్తిడి కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్ చెల్లింపులకు వర్చువల్ కార్డులు ఉపయోగించడం, బ్యాంక్, UPI యాప్‌లలో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్ చేయడం కూడా మంచిదే. చిన్న నిర్లక్ష్యం వల్ల వ్యక్తిగత వివరాలతో పాటు డబ్బు కూడా పోయే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి.

Also Read: క్యాబ్ బుక్ చేసేటప్పుడు లొకేషన్ తప్పుగా చూపిస్తోందా? ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే సరి!

Tags

Related News

రూ.999కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..రూ.949కే జెబ్రోనిక్స్ 20W స్పీకర్

రూ.1000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్..కొంటే ఇలాంటి వాచ్ కొనాలి!

అమెజాన్ సేల్..రూ.50వేలలోపు టాప్ 5 స్మార్ట్ టీవీలు ఇవే!

టెక్ వరల్డ్‌లో సెన్సేషన్..‘కింగ్ద్రా’ కోడ్‌తో నథింగ్ ఇయర్ 3 ప్రో గ్రాండ్ ఎంట్రీ

అమెజాన్ సేల్‌లో 3-స్టార్ Vs 5-స్టార్ రిఫ్రిజిరేటర్లు,ఏది కొంటే బెటర్?

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

Big Stories

Advertisement
×