E-Paper
Advertisement

Android AirPods: ఆండ్రాయిడ్ లో ఐఫోన్ ఫీచర్స్.. 15 ఏళ్ల ఇండియన్ కుర్రాడి అద్భుత సృష్టి

Android AirPods: ఆండ్రాయిడ్ లో ఐఫోన్ ఫీచర్స్.. 15 ఏళ్ల ఇండియన్ కుర్రాడి అద్భుత సృష్టి
Advertisement

Android AirPods| ఒక 15 ఏళ్ల భారతీయ విద్యార్థి అద్భుతం చేసి చూపించాడు. గురుగ్రామ్‌ కు చెందిన 15 ఏళ్ల విద్యార్థి కవిష్ దేవర్ ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో పూర్తి ఐఫోన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఒక యాప్ తయారు చేశాడు. దీని పేరు లైబర్ పాడ్స్ (LibrePods). మరో విశేషమేమిటంటే ఈ యాప్ పూర్తిగా ఫ్రీ. పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేయలేని పని ఈ టీనేజర్ విద్యార్థి చేసి ఇండియన్ టెకీల సత్తా చాటాడు.

ఎయిర్‌పాడ్స్ ఆండ్రాయిడ్‌లో ఎలా పని చేస్తాయి?
ఎయిర్‌పాడ్స్ ఐఫోన్ లేదా ఆపిల్ డివైజ్‌లలో అద్భుత ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఒకవేళ ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌కు ఎయిర్‌పాడ్స్ కనెక్ట్ అయినా కేవలం సామాన్య ఇయర్‌ఫోన్స్‌లా మాత్రమే పని చేస్తాయి. ఐఫోన్‌లో లభించే స్పెషల్ ఫీచర్స్ అన్నీ మిస్ అవుతాయి. ఈ లోటునే కవిష్ పూర్తి చేశాడు.

Advertisement

ఆపిల్ యొక్క సీక్రెట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ని రివర్స్ ఇంజినీరింగ్ చేసి ఆ లాక్ తెరిచాడు. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు ఎయిర్‌పాడ్స్ ఫుల్ పవర్‌ని చవిచూడవచ్చు.

ఆండ్రాయిడ్‌ తో కనెక్ట్ చేస్తే లైబర్ పాడ్స్ ఇచ్చే ఫీచర్స్ ఇవే..

LibrePods యాప్ వల్ల ఐఫోన్ లో ఉండే ఈ ఎక్స్క్లూసివ్ ఫీచర్స్ ఆండ్రాయిడ్‌లో వస్తాయి:

  • చెవిలో పెట్టగానే ఆటో పాజ్, తీస్తే ఆటో ప్లే
  • నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్ మార్చుకోవడం
  • తల ఊపితే చాలు పాట మారుతుంది
  • రియల్ టైమ్ బ్యాటరీ శాతం చూపిస్తుంది
  • ఫోన్ కాల్‌లో మాట్లాడితే వాల్యూమ్ ఆటోమాటిక్‌గా తగ్గిపోతుంది
  • బయట సౌండ్స్ వినిపించే ట్రాన్స్‌పరెన్సీ మోడ్
  • వినికిడి శక్తి తక్కువగా ఉన్నవారికి హియరింగ్ ఎయిడ్ మోడ్
  • ఒకేసారి ఎక్కువ డివైస్‌లకు కనెక్ట్ అవడం
  • డివైజ్‌లో ఎయిర్‌పాడ్స్ పేరు కూడా మార్చుకోవచ్చు!

ఈ యాప్ ఎక్కడ దొరుకుతుంది?

Advertisement

లైబర్ పాడ్స్ (LibrePods) పూర్తిగా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. GitHubలో ఉచితంగా అందుబాటులో ఉంది. X (ట్విట్టర్)లో ఈ ప్రాజెక్ట్ ట్రెండింగ్ అయింది. పూర్తి ఫీచర్స్ ఉపయోగించాలంటే ఫోన్ రూట్ చేయాల్సి ఉంటుంది.

లైబర్ పాడ్స్ ఎందుకు పెద్ద సంచలనం?

ఆపిల్ ఎప్పుడూ తన టెక్నాలజీని బయటికి ఇవ్వదు. అలాంటిది దీన్ని ఒక 15 ఏళ్ల భారతీయ బాలుడు క్రాక్ చేశాడంటే ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు లక్షలాది ఆండ్రాయిడ్ యూజర్లు ఐఫోన్ లేకుండానే ఎయిర్‌పాడ్స్ పూర్తి ఫీచర్స్ ఎంజాయ్ చేయొచ్చు.

Also Read: సైబర్ దొంగలు మీ డబ్బు దోచుకున్నారా? ఇలా చేస్తే మీ డబ్బు తిరిగి వస్తుంది

భారత్‌లో ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద టెక్ విజయం సాధించిన కవిష్‌ని ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. మన దేశంలో ఇంకా ఎంతో టాలెంట్ ఉందని ఈ ప్రాజెక్ట్ నిరూపించింది. ఇప్పుడే GitHubలో లైబర్ పాడ్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.. ఉచితంగా ఎయిర్‌పాడ్స్ సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×