E-Paper
Advertisement

Chinthakaya pachadi: చింతకాయ పచ్చడి ఇలా ఇంట్లోనే చేస్తే ఎన్నిరోజులైనా నిల్వ ఉంటుంది, రెసిపీ ఇదిగో

Chinthakaya pachadi: చింతకాయ పచ్చడి ఇలా ఇంట్లోనే చేస్తే ఎన్నిరోజులైనా నిల్వ ఉంటుంది, రెసిపీ ఇదిగో
Advertisement

చింతకాయ పచ్చడి తెలుగు ఇంటిల్లిపాదీకి ఇష్టమైనదే. పురాతన కాలం నుంచి దీన్ని తింటూనే ఉన్నాం. కానీ ఎలా చేయాలో మాత్రం చాలా మందికి తెలియదు. అందుకే బయట నుంచి కొని తెచ్చేసుకుంటారు.దీన్ని చాలా సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని అన్నంతో తిన్నా, ఇడ్లి, దోసెతో తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే కొన్ని సింపుల్ పదార్థాలతో చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి తయారీని స్టెప్–బై–స్టెప్‌ ఎలా చేయాలో చూద్దాం.

చింతకాయ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
తాజా చింతకాయ ముక్కలు – అరకిలో
పచ్చి మిరపకాయలు – అయిదు
కొత్తిమీర తరుగు – ఒక కప్పు
జీలకర్ర – ఒక టీ స్పూన్
బెల్లం తురుము– ఒక టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – గుప్పెడు
మెంతులు – ఒక టీ స్పూన్
ఆవాలు – ఒక టీ స్పూన్
మినప్పప్పు – ఒక టీ స్పూన్
ఎండు మిరపకాయలు – ఆరు
కరివేపాకులు – ఒక గుప్పెడు
పసుపు – అర టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – సరిపడినంత

Advertisement

చింతకాయ పచ్చడి రెసిపీ
1. మొదటగా తాజా చింతకాయలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
2. తరువాత మిక్సీలో చింతకాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, బెల్లం, ఉప్పు, వెల్లుల్లి వేసి మెత్తని పేస్టులాగా రుబ్బుకోవాలి.
3. అవసరమైతే రెండు స్పూన్ల నీళ్లు వేసుకోవచ్చు. కానీ ఎక్కువ నీళ్లు వేస్తే పచ్చడి నిల్వ ఉండదు.
4. ఈ పేస్ట్ రుచి చూస్తే పులుపు, కారం, తియ్యతనం, ఉప్పు అన్నీ సమంగా ఉండాలి. అవసరమైతే ఉప్పు లేదా కారం కొద్దిగా పెంచి సర్దుబాటు చేసుకోవచ్చు.
5.ఈ పచ్చడిని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనికి తాలింపు పెట్టుకోవాలి.
6. కళాయిలో కొంచెం నూనె వేసి ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడించాలి. తరువాత మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
7. అందులోనే ఎండు మిరపకాయలు, కరివేపాకులు వేసి వేసుకోవాలి. చివరిగా పసుపు వేయాలి.
8. ఈ తాలింపులోనే రుబ్బుకున్న పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం పచ్చడి రుచికి ఈ తాళింపే ప్రధాన కారణం.
9. స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో లేదా స్టీల్ డబ్బాలో నింపి మూత బిగించి పెట్టాలి. అంటే చింతకాయ పచ్చడి రెడీ అయినట్టే.

దీన్ని ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. తడి తగలకుండా మాత్రం జాగ్రత్త పడాలి. అలాగే అయితే ఇది కొన్ని నెలల పాటూ తాజాగా ఉంటుంది.

Related News

ఆత్మవిశ్వాసం, ఉత్సాహంగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎక్కడికి వెళ్లినా సందడి చేస్తారు

ఇంట్లో తిరిగే బల్లి విషపూరితమా? కరిస్తే ఈ జాగ్రత్తలు పాటించాలి

నిద్రలో చెడు కలలు ఇబ్బంది పెడుతున్నాయా? పడుకునే ముందు ఈ 5 పనులు చేయండి

ప్రతి ఒక్కరు తమ ప్రేమను వ్యక్తపరిచే భాష వేరు.. మీ పార్ట్‌నర్ ప్రేమ భాషను ఇలా తెలుసుకోండి

భోజనం కంటే చాక్‌లెట్స్, ఐస్‌క్రీమ్స్, చిప్స్ ఎక్కువగా తినాలనిపిస్తోందా? ఇందుకు ఇవే కారణాలు

పప్పులో ఉప్పు ఎక్కువైందా? రుచి బ్యాలెన్స్ చేయడానికి సింపుల్ చిట్కాలు

మాత్రలపై ఆ చిన్న గీత ఎందుకుందో తెలుసా? డిజైన్ కాదు… అసలు రహస్యం ఇదీ!

షాపింగ్ సమయంలో అందమైన వస్తువులు చూడగానే కొనాలనిపిస్తుంది.. దీనికి కారణాలు ఇవే

Big Stories

Advertisement
×