E-Paper
Advertisement

Ration Rice: రేషన్ డీలర్ల గుబులు.. లబ్ధిదారులు ఖుషీ ఖుషీ.. ఎండల దెబ్బకు కేంద్రం కీలక నిర్ణయం

Ration Rice: రేషన్ డీలర్ల గుబులు.. లబ్ధిదారులు ఖుషీ ఖుషీ.. ఎండల దెబ్బకు కేంద్రం కీలక నిర్ణయం
Advertisement

Ration Rice: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వేసవిలో ఎండలు మండుతున్నడంతో రేషన్ కార్డుదారులకు మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల కోసం బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే అందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండగా రానున్న రోజుల్లో హెచ్చు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భానుడి ప్రతాపాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రతినెల తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. గత ప్రభుత్వాల హాయంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల సంఖ్య భారీగా పెరిగింది.

డీలర్లకు లేబర్ ఖర్చులు

గత ఏడాది సైతం వర్షాకాలంలో ఓకే నెలలో మూడు నెలల బియ్యం కోటాను పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి.ఈ సమయంలో అటు లబ్ధిదారులతో పాటు రేషన్ డీలర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు నెలలు బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం వల్ల వినియోగదారులకు సమయంతో పాటు రవాణా, డీలర్లకు లేబర్ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా డీలర్లకు కూడా ఒక నెలలో బియ్యం పంపిణీ చేయడం ద్వారా రెండు నెలల సమయం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మూడు నెలల బియ్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం తమ వద్ద లేదని , అదే పెద్ద సమస్యగా మారిందని కొందరు డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక మూడు నెలల రేషన్ పొందాలంటే ఒకేసారి మూడు వేలి ముద్రలు వేయాల్సి ఉంది దీనికి తోడు సర్వర్ సమస్యతో ఒక్కో కార్డుకు దాదాపు 10 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో గతంలో తలెత్తిన ఇలాంటి సమస్యలను అధికారులు అధిగమించాల్సి ఉంది.

Advertisement

Also Read: Tholi Mudda: తెలంగాణలో మరో అద్భుతమైన పథకం.. చిన్నారులకు బంగారు భవిష్యత్తు, అసెంబ్లీలో ప్రారంభించిన సీఎం రేవంత్

పంపిణీకి అధికారుల సమాయత్తం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68 వేలకు పైగా అంత్యోదయ కార్డులు,10.24 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డులోని సభ్యులకు ప్రతినెల 23,600 పైగా మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనుండగా, వచ్చే నెల పంపిణీ కోసం 71 మెట్రిక్ టన్నుల సున్న బియ్యం అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు గోదాముల్లో సన్న బియ్యం నిల్వలు చేపడుతున్నారు. గోడంలలో నిలువలను సమీకరిస్తున్నారు.
ఈ క్రమంలోనే సన్న వడ్ల మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు జిల్లాల సివిల్ సప్లై అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాల వారీగా రేషన్ కార్డుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Advertisement

జిల్లా అంత్యోదయ, ఆహార భద్రత, బియ్యం పంపిణీ
జోగులాంబ 10329 ,178018, 4197
నాగర్ కర్నూల్ 19081,258197, 3103
మహబూబ్ నగర్ 18677, 257199, 5642
నారాయణపేట 9679, 159955, 3956
వనపర్తి 10522, 171189, 3878

Also Read: Logo Misuse: మీరు ట్యాంకర్ నీరు వాడుతున్నారా.. అయితే జలమండలి శాఖ షాకింగ్ కామెంట్స్!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×