Viral Video: ప్రస్తుత రోజుల్లో ప్రీ వెడ్డింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వధూవరులు.. మంచి లోకేషన్ ఎంచుకొని ఫొటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కర్ణాటకు చెందిన ఓ జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఓ గుడిని ఎంచుకుంది. అయితే ఫొటోగ్రాఫర్లు చేసిన ఓ తప్పిదం కారణంగా.. గుడిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ మహాకూట ఆలయ (Mahakuta Temple) ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పురాతన క్షేత్రం. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ బృందంలోని కొందరు ఫోటోగ్రాఫర్లు, సిబ్బంది ఆలయ నిబంధనలను ఉల్లంఘించి.. పవిత్రమైన పుష్కరిణి (ఆలయ కోనేరు) సమీపంలో షూలు, చెప్పులు ధరించి తిరుగుతున్నట్లు స్థానికులు, భక్తులు గమనించారు.
🚨 Photographers attacked during pre-wedding shoot at temple in Karnataka
A shocking incident was reported from Sakleshpur in Hassan district where a group of photographers visiting Bettada Byraveshwara Temple for a pre-wedding photoshoot was allegedly assaulted by local youths.… pic.twitter.com/JsoZ13YtJa
— Genzdigest (@genzdigest) March 27, 2026
ఆలయ పరిసరాల్లో షూలు ధరించడం నిషేధమని చెప్పినప్పటికీ.. ఫొటోగ్రాఫర్లు పట్టించుకోలేదని సమాచారం. ఈ క్రమంలో భక్తులు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీసింది. కోపంతో ఉన్న కొందరు స్థానికులు ఫోటోగ్రాఫర్లపై భౌతిక దాడికి దిగారు. వారి కెమెరాలు, ఇతర ఖరీదైన షూటింగ్ పరికరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో ఇరువర్గాలు తీవ్రంగా ఘర్షణ పడటం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు దాడి దృశ్యాలు వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ పేరుతో గుడిలోకి దూరి ఇష్టారీతిన వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు. అదే సమయంలో భక్తులు, స్థానికులు.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని.. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
Also Read: IndiGo Flight: విశాఖ నుంచి బయల్దేరిన ఫ్లైట్‌లో.. సాంకేతిక సమస్య.. దిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ!