E-Paper
Advertisement

పాత ఫోన్ ఇస్తే రూ.22,000 డిస్కౌంట్.. Oppo Find X9s లాంచ్ ఆఫర్స్ లీక్!

పాత ఫోన్ ఇస్తే రూ.22,000 డిస్కౌంట్.. Oppo Find X9s లాంచ్ ఆఫర్స్ లీక్!
Advertisement

OPPO Find X9 Series: భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న OPPO Find X9 Ultra, OPPO Find X9s మోడల్స్ మే 21న గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. దేశంలోని ప్రీమియం మొబైల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఒప్పో ఈ ఫోన్లను తీసుకొస్తోంది. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్లలో వీటికి సంబంధించిన పేజీలు కూడా లైవ్ అయ్యాయి. దాంతో ఈ ఫోన్లపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అంచనా ధరలు ఇవే:

లీకైన సమాచారం ప్రకారం.. OPPO Find X9 Ultra 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.1,69,999 ఉండొచ్చు. ఇక OPPO Find X9s మోడల్ విషయానికొస్తే.. ఇది రెండు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. ఇందులో 12GB + 256GB వేరియంట్ ధర రూ.79,999 గాను, అలాగే 12GB + 512GB టాప్ వేరియంట్ ధర రూ.89,999 గాను ఉండే ఛాన్స్ ఉంది.

Advertisement

Also Read: పాత డిజైన్‌కు గుడ్‌బై చెప్పిన శాంసంగ్.. సరికొత్త గ్లామరస్ లుక్‌తో వచ్చేస్తోన్న Galaxy A27!

క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు:

కొత్త ఫోన్ కొనాలనుకునే వారి కోసం ఒప్పో అదిరిపోయే లాంచ్ ఆఫర్లను ప్లాన్ చేసింది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ పై ఏకంగా రూ.22,000 వరకు బోనస్ లభించనుంది. దీనితో పాటు ప్రముఖ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే భారీ క్యాష్‌బ్యాక్ కూడా అందుకోవచ్చు. అసలు రూపాయి కూడా ముందస్తుగా చెల్లించకుండా (జీరో డౌన్ పేమెంట్), 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా ఒప్పో కల్పిస్తోంది.

కస్టమర్లకు ప్రత్యేక గ్యారెంటీలు:

Advertisement

ఈ సిరీస్ కొనేవారికి ఒప్పో అదిరిపోయే బైబ్యాక్ అస్యూరెన్స్‌ను ఇస్తోంది. దీని ద్వారా భవిష్యత్తులో ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే 60 శాతం వరకు రిటర్న్ వాల్యూ గ్యారెంటీగా వస్తుంది. అంతేకాదు.. ఫోన్ కొన్న 180 రోజుల్లోపు ఏదైనా హార్డ్‌వేర్ సమస్య వస్తే ఉచితంగా కొత్త డివైజ్ రీప్లేస్‌మెంట్ బెనిఫిట్‌ను కూడా ఇస్తున్నారు.

ఫ్రీ గిఫ్ట్‌లు, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు:

OPPO Find X9 Ultra కొనేవారికి మూడు నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో, స్పాటిఫై ప్రీమియం ఉచితంగా లభిస్తాయి. మరోవైపు Find X9s కొనేవారికి సుమారు రూ.5,000 విలువైన ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రోతో పాటు ఒక ప్రీమియం ప్రొటెక్టివ్ బ్యాక్ కవర్ ఉచితంగా లభించనున్నాయి. పవర్‌ఫుల్ ఫీచర్లు, అదిరిపోయే డిజైన్‌తో రాబోతున్న ఈ ఫోన్ల పూర్తి వివరాలు మే 21న అధికారికంగా తెలియనున్నాయి.

Also Read: ఐఫోన్ క్రేజ్‌కు బ్రేక్ వేసేలా.. Google Pixel 10పై క్రోమా మైండ్ బ్లోయింగ్ డీల్, ఏకంగా రూ.20,000 ఆదా!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×