E-Paper
Advertisement

iQOO Z10 Lite 5G: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.10వేల లోపే 256GB స్టోరేజ్ iQOO 5G ఫోన్, అస్సలు మిస్ కావొద్దు!

iQOO Z10 Lite 5G: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.10వేల లోపే 256GB స్టోరేజ్ iQOO 5G ఫోన్, అస్సలు మిస్ కావొద్దు!
Advertisement

iQOO Z10 Lite 5G: ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరలో శక్తివంతమైన 5G ఫోన్ కోసం చూస్తున్న వారికి iQOO Z10 Lite 5G ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. ప్రైమ్ సభ్యులకు ఇప్పటికే ఈ సేల్ అందుబాటులోకి రాగా.. సాధారణ వినియోగదారులకు కూడా భారీ తగ్గింపులతో స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి.

రూ.10వేల కంటే తక్కువకే:

SBI బ్యాంకు కార్డులను ఉపయోగించే వారికి తక్షణ డిస్కౌంట్ లభిస్తుండటంతో.. ఈ క్రేజీ స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గి రూ.10వేల కంటే తక్కువ ధరకే దక్కుతుంది. ఈ హ్యాండ్ సెట్ సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: నెట్‌వర్క్ లేకపోయినా పనిచేస్తుంది.. భారతీయ భాషల AI అసిస్టెంట్‌తో కొత్త ఫోన్, ధర తెలిస్తే షాకౌతారు!

కిందపడినా పగలదు:

ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం తక్కువ ధరకే కాదు.. అత్యంత పటిష్టమైన నిర్మాణ నాణ్యతతో రూపొందించబడింది. సాధారణంగా ప్రీమియం ఫోన్లలో కనిపించే MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, SGS 5 స్టార్ యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ దీనిలో ఉన్నాయి. దీనివల్ల పొరపాటున ఫోన్ కింద పడినా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు.. IP64 రేటింగ్‌తో దుమ్ము, నీటి చినుకుల నుండి కూడా రక్షణ లభిస్తుంది.

ఆకట్టుకునే డిస్‌ప్లే:

Advertisement

ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. iQOO Z10 Lite 5G ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో మెరుగైన అనుభూతిని ఇస్తుంది. అలాగే దీనిలోని 1000 నిట్స్ బ్రైట్‌నెస్ కారణంగా ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ ఫోన్‌లోని ఐ ప్రొటెక్షన్ ఫీచర్ కళ్లపై ఒత్తిడి పడకుండా చూస్తుంది.

మూడేళ్ల వ్యారెంటీ:

సాఫ్ట్‌వేర్, పెర్ఫార్మెన్స్ పరంగా iQOO Z10 Lite ఎక్కడా రాజీ పడలేదు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. రోజువారీ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహకరిస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పై నడిచే ఈ హ్యాండ్ సెట్‌కు 2 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.

ఏఐ ఎడిట్ ఫీచర్లు:

ఇకపోతే iQOO Z10 Lite మొబైల్లో 50MP సోనీ AI ప్రైమరీ కెమెరా ఉండటం విశేషం. దీంతో ఫొటోలను మరింత క్వాలిటీగా మార్చడానికి AI ఎరేస్, AI డాక్యుమెంట్ మోడ్ వంటి ఫీచర్లు తోడయ్యాయి. వీటన్నింటికీ తోడు 6000mAh భారీ బ్యాటరీ ఉండటంతో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా టెన్షల్ లేకుండా వాడుకోవచ్చు. 5G కనెక్టివిటీతో స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందాలనుకుంటే ఈ సేల్‌ ద్వారా ఐకూ Z10 టైట్‌ను స్మార్ట్‌ఫోన్‌‌ను సొంతం చేసుకోవాల్సిందే.

Also Read: రూ.30,990కే బ్రాండెడ్ ల్యాప్‌టాప్.. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో టాప్ డీల్స్ ఇవే!

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×