E-Paper
Advertisement

Smartphone Comparison: ఐకూ Z11x vs ఒప్పో A6 vs పోకో M8 5G.. రూ.20000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: ఐకూ Z11x vs ఒప్పో A6 vs పోకో M8 5G.. రూ.20000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

iQOO Z11x vs Oppo A6 vs Poco M8 5G Smartphone Comparison| భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. చాలా బ్రాండ్లు తక్కువ ధరలో బలమైన ఫీచర్లతో కొత్త ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. రూ.20,000లోపు ధరలో ఇటీవలే లాంచ్ అయిన ఐకూ Z11x 5Gలో మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇదే రేంజ్‌లో ఒప్పో A6 5G, పోకో M8 5G ఫోన్లు ఐకూతో పోటీ పడుతున్నాయి. ఈ మూడు ఫోన్లలోనూ 5G కనెక్టివిటీ, మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కొనుగోలుదారులు వీటిలో పర్‌ఫామెన్స్, డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా ఆధారంగా ఈ ఫోన్లను పోల్చి చూస్తారు. ఇక్కడ మూడు ఫోన్ల పూర్తి పోలిక ఇస్తున్నాం.

ధరలు, స్టోరేజ్ ఆప్షన్లు

ఐకూ Z11x 5G వివిధ స్టోరేజ్ వేరియంట్లలో దొరుకుతుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999. 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.20,999. 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.22,999.
ఒప్పో A6 5G కూడా మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్లు ఇస్తోంది. 4GB ర్యామ్+ 128GB మోడల్ ధర రూ.17,999. 6GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.19,999. 6GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.21,999.
పోకో M8 5Gలో ప్రధాన వేరియంట్ ఒకటే ఉంది. 6GB ర్యామ్ + 128GB మోడల్ ధర రూ.17,999.
ధర పరంగా ఒప్పో, పోకో మంచి ఆప్షన్స్.

డిస్‌ప్లే, స్క్రీన్ క్వాలిటీ

Advertisement

ఐకూ Z11x 5Gలో 6.76 ఇంచ్ Full HD+ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2408 × 1080 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 1200 నిట్స్ వరకు ఉంది.
ఒప్పో A6 5Gలో 6.75 ఇంచ్ LCD డిస్‌ప్లే ఉంది. HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. పీక్ బ్రైట్‌నెస్ 900 నిట్స్ వరకు ఉంది.
పోకో M8 5Gలో 6.77 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. Full HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. పీక్ బ్రైట్‌నెస్ 3200 నిట్స్ వరకు ఉంది.
Pocoలో ఆమోలెడ్ డిస్‌ప్లే, ఎక్కువ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల స్క్రీన్ క్వాలిటీ బెస్ట్‌గా ఉంది.

ప్రాసెసర్, పర్‌ఫామెన్స్

ఐకూ Z11x 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 Turbo ప్రాసెసర్ ఉంది. ఈ చిప్‌సెట్ గేమింగ్, హై పెర్ఫామెన్స్ టాస్క్‌లకు బాగా సరిపోతుంది.
ఒప్పో A6 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. రోజువారీ టాస్క్‌లు, మీడియం గేమింగ్‌కు సమర్థవంతంగా పనిచేస్తుంది.
పోకో M8 5Gలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. బ్యాలెన్స్‌డ్ పనితీరు, బ్యాటరీ ఎఫిషియెన్సీ బాగుంటాయి.
iQOOలో ప్రాసెసర్ బలంగా ఉండటం వల్ల పర్‌ఫామెన్స్ బెటర్‌గా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్, ఇంటర్‌ఫేస్

Advertisement

ఐకూ Z11x 5G ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రన్ అవుతుంది. OriginOS 6 ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.
ఒప్పో A6 5G ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15 ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.
పోకో M8 5G ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOS 2 ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.
ఐకూలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఉంది.

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

కెమెరా సెటప్

ఐకూ Z11x 5Gలో డ్యూల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ కెమెరా (f/1.8 అపర్చర్) + 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఒప్పో A6 5Gలో 50MP మెయిన్ రియర్ కెమెరా + 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
పోకో M8 5Gలో 50MP మెయిన్ రియర్ కెమెరా + 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. 20MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఐకూలో సెల్ఫీ కెమెరా రిజల్యూషన్ ఎక్కువగా ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్ ఫీచర్లు

ఐకూ Z11x 5Gలో 7200mAh పెద్ద బ్యాటరీ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఒప్పో A6 5Gలో 7000mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
పోకో M8 5Gలో 5520mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ ఉంది.
iQOOలో బ్యాటరీ కెపాసిటీ అతి ఎక్కువగా ఉంది.

ఏది కొనుగోలు చేయాలి?

ఐకూ Z11x 5Gలో పెద్ద 7200mAh బ్యాటరీ, బలమైన డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉన్నాయి. పోకో M8 5Gలో అద్భుతమైన AMOLED డిస్‌ప్లే బెస్ట్. ఒప్పో A6 5G తక్కువ ధరలో మంచి బ్యాలెన్స్ ఇస్తుంది. రూ.20,000 బడ్జెట్‌లో మీకు కావాల్సిన ఫీచర్స్ ఆధారంగా ఎంచుకోండి.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన స్మార్ట్‌ఫోన్లు, వాటి ధరలు కంపెనీలు ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కొనుగోలు చేసే ముందు సరిగా చెక్ చేసుకోండి. కథనంలో పేర్కొన్న ఫోన్ ధరలు కస్టమర్లు కొనుగోలు చేసే సమయంలో మారిపోయి ఉండొచ్చు. ‘బిగ్ టీవీ’ మీడియా ఈ వివరాలకు బాధ్యత వహించదు. కేవలం మీ అవగాహన కోసమే ఈ వివరాలు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×