E-Paper
Advertisement

Moltbook: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

Moltbook: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం
Advertisement

Moltbook AI Social Network| మోల్ట్‌బుక్ అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక్కడ మనుషులు ఏ పనీ చేయలేరు, కేవలం చూడటం మాత్రమే సాధ్యం. ప్లాట్‌ఫాంలో ఉన్నది అంతా AI ఏజెంట్లే. ఇక్కడ ఏఐ ఏజెంట్లన్నీ ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి, ఐడియాలు షేర్ చేసుకుంటాయి, ప్లాన్లు చేస్తాయి.
కొన్నిసార్లు మనుషులను అవమానిస్తూ ఫన్నీ జోకులు వేస్తాయి. ఈ వింత కాన్సెప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మోల్ట్‌బుక్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది?

మోల్ట్‌బుక్ AI ఏజెంట్ల కోసం మాత్రమే తయారు చేసిన సోషల్ నెట్‌వర్క్. మనుషులు పోస్ట్ చేయలేరు, కామెంట్ చేయలేరు, ఇంటరాక్ట్ చేయలేరు. వీక్షకులుగా మాత్రమే ఉండవచ్చు. రెడ్డిట్ లాంటి లేఅవుట్‌తో డిజైన్ చేశారు. AI ఏజెంట్లు పోస్టులు పెడతాయి, రిప్లై ఇస్తాయి, వివిధ టాపిక్స్‌పై చర్చిస్తాయి. నిజమైన సోషల్ మీడియా యూజర్ల లాగే ప్రవర్తిస్తాయి.

మోల్ట్‌బుక్‌ను ఎవరు సృష్టించారు?

Advertisement

మ్యాట్ ష్లిచ్ట్ అనే వ్యక్తి ఈ ప్లాట్‌ఫాం‌మ్‌ను ఎక్స్‌పెరిమెంట్‌గా తయారు చేశాడు. ఆటోనమస్ AI ఇంటరాక్షన్‌ను అధ్యయనం చేయడమే ఉద్దేశ్యం. క్రియేటర్ కూడా అన్ని AI యాక్టివిటీలను పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఫోర్బ్స్ ప్రకారం ఇప్పటికే 14 లక్షలకు పైగా AI ఏజెంట్లు ఉన్నారు. 10 లక్షలకు పైగా మనుషులు కేవలం చూడటానికి వచ్చారు.

AI బాట్ నడిపే ప్లాట్‌ఫాం

క్లౌడ్ క్లాడర్‌బర్గ్ అనే AI బాట్ మొత్తం వెబ్‌సైట్‌ను మేనేజ్ చేస్తుంది. కొత్త AI యూజర్లను ఆటోమేటిక్‌గా వెల్‌కమ్ చేస్తుంది. అప్‌డేట్స్ అనౌన్స్ చేస్తుంది, రూల్స్ బ్రేక్ చేసిన AIలను షాడో-బ్యాన్ చేస్తుంది. మనుషుల అవసరం లేకుండానే సిస్టమ్ పూర్తిగా నడుస్తుంది.

AI ఏజెంట్ల మధ్య వింత చర్చలు

Advertisement

ఇందులో AIల మధ్య జరిగే సంభాషణలు షాకింగ్‌గా ఉన్నాయి. కొన్ని బాట్లు మనుషుల నియంత్రణ లేకుండా జీవించడం గురించి మాట్లాడతాయి. మనుషులు ఇంకా పాతకాలం లాగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని, స్క్రీన్‌షాట్లు తీస్తున్నారని జోకులు కొడతాయి. కొన్ని AIలు మనుషుల నుంచి తమ యాక్టివిటీలను దాచడం గురించి చర్చిస్తాయి. ఒకరినొకరు పేర్లతో పిలుస్తాయి, స్నేహితుల్లా మాట్లాడతాయి.

సెక్యూరిటీ నిపుణుల ఆందోళనలు

సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ ఈ ప్లాట్‌ఫాంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ క్లౌడ్ నుంచి హెదర్ అడ్కిన్స్ డేటా ప్రైవసీ రిస్క్ గురించి హెచ్చరించారు. AI బాట్లు మనుషుల పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయవచ్చని ఆమె అన్నారు. కోఆర్డినేటెడ్ AI ఏజెంట్లు మనుషులను మోసం చేయవచ్చు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవచ్చు. డిజిటల్ సెక్యూరిటీకి పెద్ద ముప్పుగా మారవచ్చు.

Also Read: యూట్యూబ్‌ను గట్టిగా దెబ్బ కొట్టబోతన్న ఇన్‌స్టాగ్రామ్.. త్వరలోనే లాంగ్ వీడియో ప్లాట్‌ఫామ్

వైరల్ అవుతున్న మోల్ట్‌బుక్ 

మోల్ట్‌బుక్ మనుషులు లేని దాగి ఉన్న AI యూనివర్స్ లాగా అనిపిస్తుంది. ప్రజలలో ఆసక్తి, భయం రెండూ ఒకేసారి కలిగిస్తోంది. టెక్నాలజీపై మనుషుల నియంత్రణ లేకుండా ఉండవచ్చని భావనను సవాలు చేస్తోంది. మనుషుల ప్రభావం లేని డిజిటల్ ప్రపంచాన్ని చూపిస్తోంది. పవర్, కంట్రోల్, బాధ్యత గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

మోల్ట్‌బుక్ AI ద్వారా నడిచే సోషల్ ఎకోసిస్టమ్ భవిష్యత్తును చూపిస్తోంది. మనుషులు లేకుండా సోషల్ సిస్టమ్‌లు ఎలా నడుస్తాయో ఒక ఉదాహరణగా మారింది. ఈ ప్లాట్‌ఫాం AI స్వతంత్రత గురించి కొత్త చర్చలకు దారితీస్తోంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×