E-Paper
Advertisement

itel Vista Tab 30: 7000mAh బ్యాటరీతో ఐటెల్ విస్టా టాబ్.. 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే, ఆధునిక ఫీచర్లు, ధర వివరాలిలా!

itel Vista Tab 30: 7000mAh బ్యాటరీతో ఐటెల్ విస్టా టాబ్.. 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే, ఆధునిక ఫీచర్లు, ధర వివరాలిలా!
Advertisement

itel Vista Tab 30: బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో ఆకర్షణీయమైన టాబ్లెట్‌ను itel మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. Vista Tab 30 పేరుతో విడుదలైన ఈ టాబ్లెట్‌ను ప్రధానంగా విద్యార్థులు, ఆన్‌లైన్ క్లాసులు చేసే వారు, అలాగే వినోదాన్ని ఇష్టపడే యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ టాబ్లెట్‌ను డిజైన్ చేశారు. తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లు అందించడమే ఈ టాబ్లెట్ ప్రత్యేకమని కంపెనీ తెలిపింది.

11 అంగుళాల FHD+ డిస్‌ప్లే:

డిజైన్ పరంగా చూస్తే, కేవలం 8mm సన్నని బాడీ, సుమారు 550 గ్రాముల బరువుతో Vista Tab 30 చాలా తేలికగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీంట్లో 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే (1920×1200) ఉంది. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 84 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 1500:1 కాంట్రాస్ట్ రేషియో కారణంగా వీడియోలు చూడటం, ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అవ్వడం మరింత కంఫర్ట్‌గా ఉంటుంది.

Advertisement

Also Read: 43 అంగుళాల స్మార్ట్ టీవీపై ఊహించలేనంత డిస్కౌంట్.. రూ.29,999 ధర నుంచి రూ.11,599కి తగ్గింపు!

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ టాబ్లెట్‌లో UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4GB ఫిజికల్ RAMకి తోడు 8GB వర్చువల్ RAM సపోర్ట్‌తో మొత్తం 12GB RAM అనుభవం లభిస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజీతో పాటు మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512GB వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఈ టాబ్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ప్రత్యేకమైన డ్యూయల్ స్పీకర్లు:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ అవసరాలకు ఈ ట్యాబ్ వెనుక భాగంలో 8MP రియర్ కెమెరా, ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆన్‌లైన్ మీటింగ్స్, వీడియో కాల్స్‌కు ఇవి సరిపడా పనికొస్తాయి. దీంతోపాటు ప్రత్యేకమైన డ్యూయల్ స్పీకర్లు ఉండటంతో ఆడియో అవుట్‌పుట్ కూడా మెరుగ్గా ఉంటుంది.

రెండ్రోజుల బ్యాటరీ బ్యాకప్:

బ్యాటరీ విషయంలో కూడా Vista Tab 30 మెరుగైన పనితీరును అందిస్తుంది. 7000mAh భారీ బ్యాటరీ ఉన్న ఈ టాబ్.. 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సాధారణ వినియోగంలో ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ వెల్లడించింది.

విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్:

కనెక్టివిటీ పరంగా 4G LTE, Wi-Fi సపోర్ట్ లభిస్తుంది. అంతేకాదు,.. ఈ టాబ్లెట్‌లో మల్టీ-స్క్రీన్ కలాబరేషన్, ChatGPT ఆధారిత AI వాయిస్ అసిస్టెంట్ ‘Aivana’, K–12 లెర్నింగ్ సెంటర్, iPulse కిడ్స్ స్పేస్, స్క్రీన్ ప్రొజెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి విద్యార్థులకు, పిల్లలకు మరింత ఉపయోగపడేలా రూపొందించారు.

ధర ఎంతంటే?

ఈ ఐటెల్ విస్తా టాబ్ 30 ధర విషయానికి వస్తే.. రూ.11,999కు విడుదల చేశారు. ఇది స్పేస్ గ్రే, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. భారత్‌లోని ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేస్తే.. రూ.1,999 విలువైన ఫ్రీ లెదర్ బ్యాక్ కవర్ కూడా కంపెనీ అందిస్తోంది.

Also Read: ఎదురుచూపులకు తెర.. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరాలతో హువాయి నోవా 15 ఎంట్రీ!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×