E-Paper
Advertisement

Jio vs Airtel vs Vodafone: జియో vs ఎయిర్‌టెల్ vs వొడాఫోన్.. 2026 న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్స్‌లో ఏది బెస్ట్

Jio vs Airtel vs Vodafone: జియో vs ఎయిర్‌టెల్ vs వొడాఫోన్.. 2026 న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్స్‌లో ఏది బెస్ట్
Advertisement

Jio vs Airtel vs Vodafone| నూతన సంవత్సరం 2026 సందర్భంగా భారతదేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (విఐ) ఆకర్షణీయమైన రీఛార్జ్ ఆఫర్లు ప్రవేశపెట్టాయి. ఈ ఆఫర్లలో అన్‌లిమిటెడ్ 5G డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, ఏఐ టూల్స్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. డేటా ఎక్కువ వినియోగించేవారు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులు, బడ్జెట్ యూజర్లకు ఈ ఆఫర్స్ లో మంచి వాల్యూ లభిస్తుంది. కొత్త రీఛార్జ్ చేయాలనుకునేవారు ఈ ఆఫర్లను తప్పక పరిశీలించండి.

కస్టమర్ బేస్ పెంచుకోవడానికి న్యూ ఇయర్ బెస్ట్ టైమ్

టెలికాం కంపెనీలకు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి న్యూ ఇయర్ బెస్ట్ టైమ్. జియో, ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలు పోటీ పడి ఆకర్షణీయమైన ప్లాన్లు ఇస్తాయి. ఈ ఆఫర్ల ద్వారా కస్టమర్లు రీఛార్జ్ చేయడం లేదా నెట్‌వర్క్ మారడం పెరుగుతుంది. డేటా, ఓటీటీ, ప్రీమియం సర్వీసెస్ బండిల్ చేసి మంచి వాల్యూ ఇస్తాయి. మూడు టెలికాం కంపెనీల ఆఫర్లలో ఏది బెస్ట్ అని తెలుసుకునేందుకు వాటి బెనిఫిట్స్ పోల్చి చూద్దాం.

జియో న్యూ ఇయర్ 2026 ఆఫర్ వివరాలు

Advertisement

జియో “హ్యాపీ న్యూ ఇయర్ 2026” పేరుతో ఆఫర్లు లాంచ్ చేసింది. రూ.500 మంత్లీ ప్లాన్‌లో 28 రోజుల వాలిడిటీ, రోజుకు 2GB డేటా (మొత్తం 56GB), అన్‌లిమిటెడ్ 5G డేటా ఉన్నాయి. 13 ఓటీటీ యాప్స్ (యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్, జియోహాట్‌స్టార్, సోనీలివ్ మొదలైనవి), 18 నెలల గూగుల్ జెమినీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్, 50GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. యాన్యువల్ ప్లాన్ రూ.3599లో 365 రోజులు వాలిడిటీ తో రోజుకు 2.5GB డేటా + అన్‌లిమిటెడ్ 5G బెనఫిట్స్ ఉన్నాి.

ఎయిర్‌టెల్ న్యూ ఇయర్ 2026 ఆఫర్

ఎయిర్‌టెల్ యాన్యువల్ ప్లాన్లపై దృష్టి పెట్టింది. కొన్ని ప్లాన్లలో పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ (12 నెలలు, రూ.17,000 వాల్యూ), జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. నెట్‌వర్క్ క్వాలిటీ, స్టేబుల్ కనెక్టివిటీపై ఫోకస్. ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.

Advertisement

Also Read: ఎయిర్‌టెల్ vs జియో.. రీచార్జ్ ఫ్లాన్స్‌, స్పీడ్, నెట్‌వర్క్ పరంగా ఏది బెస్ట్?

వొడాఫోన్ న్యూ ఇయర్ 2026 ఆఫర్

వొడాఫోన్ “హీరో అన్‌లిమిటెడ్” బెనిఫిట్స్‌పై దృష్టి పెట్టింది. నైట్ అన్‌లిమిటెడ్ డేటా, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ యూజర్లకు సరిపడే బ్యాలెన్స్‌డ్ ప్లాన్లు. డేటా, కాలింగ్, SMS + సెలెక్ట్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నాయి. చౌక ధరలో మంచి వాల్యూ ప్లాన్ ఇది.

జియో, వొడాఫోన్, విఐ ఆఫర్లలో ఏది బెస్ట్?

జియోలో బలమైన ఓటీటీ, అన్‌లిమిటెడ్ 5G, ఏఐ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎయిర్‌టెల్ ప్రీమియం నెట్‌వర్క్, ఏఐ టూల్స్‌తో ఆకర్షిస్తుంది. వొడాఫోన్‌లో నైట్ డేటా, వీకెండ్ రోల్‌ఓవర్, చౌక ధరలు. ఎక్కువ డేటా ఉపయోగించేవారికి జియో, స్టేబుల్ నెట్‌వర్క్ కావాల్సినవారికి ఎయిర్‌టెల్, బడ్జెట్ యూజర్లకు వొడాఫోన్ బాగుంటాయి.

రీఛార్జ్ చేసేముందు ఇవి చెక్ చేయండి

మీ ప్రాంతంలో నెట్‌వర్క్ అందుబాటు చెక్ చేయండి. ప్లాన్‌లో ఏ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నాయో చూడండి. రోజువారీ డేటా లిమిట్, వాలిడిటీ గమనించండి. 5G బెనిఫిట్ మీ డివైస్‌కు అప్లై అవుతుందా చూడండి. టర్మ్స్ జాగ్రత్తగా చదవండి. మీ ఉపయోగం మేరకు ప్లాన్ ఎంచుకోండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×