E-Paper
Advertisement

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!
Advertisement

Jio Amazon Prime: ప్రస్తుత రోజుల్లో వినోదానికి కేరాఫ్ గా ఓటీటీలు మారాయి. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం చాలామంది అమెజాన్ ప్రైమ్ వీడియోను ఇష్టపడుతున్నారు. అయితే దీని సబ్ స్క్రిప్షన్ కోసం ప్రతీ నెల, సంవత్సరం కొద్దిమేర డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ జియో తన యూజర్ల కోసం ఉచితంగా అమెజాన్ ప్రైమ్ ను అందించే ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైమ్ తో పాటు మరికొన్ని ఓటీటీలు, అదనపు బెనిఫిట్స్ ను సైతం ఆ ప్లాన్లు అందిస్తున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 200 ప్లాన్

తక్కువ ధరలో ఓటీటీ బెనిఫిట్స్ కోరుకునేవారి కోసం జియో ఈ రూ.200 ప్లాన్ తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో అమెజాన్ ప్రైమ్ తో పాటు హాట్ స్టార్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. అలాగే 1000 కంటే ఛానెళ్లను ఉచితంగా వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ కింద మొత్తం 30 జీబీ 4జీ/5జీ డేటా లభిస్తుంది. అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా సౌకర్యం కూడా ఇందులో ఉంది.

రూ. 500 ప్లాన్

Advertisement

ఓటీటీ బెనిఫిట్స్ తో పాటు కాలింగ్ సౌకర్యం కోరుకునేవారికి ఈ ప్లాన్ సరిపోతుంది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. 5జీ నెట్‌వర్క్ పరిధిలోని వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. అటు ఓటీటీల విషయానికొస్తే అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్ మొబైల్ సహా దాదాపు 15 రకాల ప్రముఖ ఓటీటీ యాప్‌లకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. వీటితో పాటు రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్, జియో గేమింగ్, 5,000 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ

Advertisement

రూ. 550 ప్లాన్

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో యూజర్లకు 90 GB డేటా లభిస్తుంది. అర్హులైన వినియోగదారులు అపరిమిత 5జీ డేటా సైతం పొందొచ్చు. అయితే ఇందులో ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు లేవు. వినోదం కోసం అమెజాన్ ప్రైమ్ లైట్, యూట్యూబ్ ప్రీమియం, సోనీ లివ్, జీ5, జియో హాట్‌స్టార్ సహా 15 ఓటీటీలను జియో ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఈ ప్లాన్ ద్వారా 1,000కి పైగా టీవీ ఛానెళ్లను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

Also Read: వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

Tags

Related News

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

మీ ఐఫోన్ స్పీడ్ పెంచే సూపర్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి!

భారీ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ ఫీచర్‌తో Oppo A7 Pro లాంచ్.. ధర ఎంతంటే?

వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

ఇక ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు.. లైవ్ ట్రాన్స్‌లేషన్, 50% ఎక్కువ ఏఎన్‌సీతో Apple AirPods 5 లాంచ్!

యాపిల్ బిజినెస్ స్ట్రాటజీ.. iPhone 18 రాకతో పాత ఫోన్ల రేట్లను రూ.65,000 వరకు పెంచేసింది!

Big Stories

Advertisement
×