E-Paper
Advertisement

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్
Advertisement

Amaravati: ఏపీలో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు మాజీ సీఎం జగన్. కేవలం డీఎస్సీ అంశం పట్టుకుని ప్రచారం తీవ్రతరం చేస్తున్నారు. దీనిపై అధికారులు వివరణ ఇచ్చినా సరే, పదే పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మంత్రి లోకేష్ సవాల్ విసిరితే మాత్రం.. ఆయన నోరు పెదపలేదు. తాజాగా గురువారం మీడియా ముందుకొచ్చిన జగన్, మళ్లీ అదే డీఎస్పీపై మాట్లాడే ప్రయత్నం చేశారు.

డీఎస్సీ అంశంపై మరోసారి మీడియా ముందుకు జగన్

గురువారం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. డీఎస్సీ వ్యవహారంపై మళ్లీ ఆరోపణలు గుప్పించారు. మెగా కాదని, దగా డీఎస్సీ అని ఆరోపించారు. ఎవరైనా ఆధారాలు చూపిస్తే జైల్లో పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. డీఎస్సీలో అక్రమాలు బయటకు వస్తున్న కొద్దీ సీఎం చంద్రబాబులో బీపీ పెరుగుతోందన్నారు.

Advertisement

ఈ వ్యవహారంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయని, వాస్తవాలు వెలికి తీస్తే సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. నా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేదని, ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్న పత్రం తయారీపై విమర్శలు గుప్పించారు. ప్రశ్నించిన జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

స్కామ్ జరిగిందని ఆధారాలున్నా, విచారణ చేయించలేదు-జగన్

కొడుకును కాపాడుకునే ఆరాటంలో నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుతున్నారని విమర్శించారు మాజీ సీఎం. డీఎస్సీ స్కామ్‌తో వ్యవస్థలపై ప్రజలకు, నిరుద్యోగులకు నమ్మకం పోతుందన్నారు. ఇలాంటి స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. నాలాంటి వాళ్లు కాక్రోచ్లుగా మారతారని సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

APPSC‌లో స్పోర్ట్ కోటా కింద 40 ఉద్యోగాలని ఇవ్వాలని చూశారని, Dsc పై ఆరోపణలు రావడంతో ఏపీపీఎస్సీని నిలిపి వేశారని దుయ్యబట్టారు. ఫలితంగా Appsc లో 774 పోస్టులను నిలిపివేశారని అన్నారు. డీఎస్సీ కుంభకోణం లో పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించారు. దొంగ సర్టిఫికెట్లపై ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, డీఎస్సీ కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటని ప్రశ్నించారు.

ALSO READ: మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

సీఎం చంద్రబాబును వెన్నుపోటు పార్టీ నాయకుడుగా జగన్ సంభోదించారు. కొడుకును కాపాడుకోవాలనుకునే తండ్రికి తప్పు చేస్తున్నారని, దానివల్ల లక్షల మంది జీవితాలతో చలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. అయినా వారికి పశ్చాతాప్పం లేదన్నారు. గతంలో మీడియాలో వచ్చిన విషయాలను ఆయన బయటపెట్టారు.

 

Related News

కంటతడి పెట్టిన వైసీపీ సీనియర్ బొత్స.. రాజకీయాల కోసం ఈ స్థాయికి దిగజారాలా?

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×