Airtel Recharge Plans: దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్ టెల్.. తక్కువ బడ్జెట్ లో రెండు ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులో ఉంచింది. రూ. 349, రూ. 379 ధరలతో వీటిని అందిస్తోంది. అయితే ధర పరంగా రెండింటికి మధ్య పెద్దగా తేడా లేనప్పటికీ.. బెనిఫిట్స్ పరంగా చూస్తే చాలా వ్యత్యాసమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్లాన్ల వివరాలు, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్, రెండింటిలో ఏ ప్లాన్ వల్ల ఎక్కువ లాభం అనే అంశాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఎయిర్‌టెల్ ఈ రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లకు ప్రతీరోజూ 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొంది. అయితే 5G డేటాను 300GB వరకే ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. ఇక అదనపు ఆఫర్ల విషయానికొస్తే.. ఈ ప్లాన్‌లో ఉచితంగా అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి.
మరోవైపు రూ. 379 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా నెల రోజుల వ్యాలడిటీ కలిగి ఉంది. అయితే ఇందులో ప్రతిరోజూ 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అదనంగా అపరిమిత 5జీ డేటా బెనిఫిట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ ద్వారా గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్, ఆపిల్ మ్యూజిక్, అలాగే 12 నెలల పాటు ఉచిత అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియమ్ యాక్సెస్ లభిస్తాయి.
Also Read: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!
ఈ రెండింటినీ పరిశీలిస్తే రూ. 349 ప్లాన్ కంటే రూ. 379 ప్లాన్ ఎంతో బెస్ట్ గా కనిపిస్తోంది. కేవలం రూ. 30 అదనంగా చెల్లించడం ద్వారా.. ప్రతిరోజూ అదనంగా 0.5 జీబీ డేటా పొందొచ్చు. ఒకవేళ మీరు రూ. 349 ప్లాన్ తీసుకుని డేటా సరిపోక నెలలో ఒకటి రెండు సార్లు డేటా వోచర్లు రీఛార్జ్ చేసుకున్నా కూడా రూ. 379 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఎయిర్ టెల్ యూజర్లు రూ. 379 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడమే మంచిదని చెప్పవచ్చు.
Also Read: వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!