E-Paper
Advertisement

పుట్టినరోజు నిరసనదినం.. నల్ల చొక్కా ప్రశంస‌ల పర్వం!

పుట్టినరోజు నిరసనదినం.. నల్ల చొక్కా ప్రశంస‌ల పర్వం!
Advertisement

కేటీఆర్ యాభ‌యో పుట్టిన రోజు ఇవాళ. వేడుకుల‌కు దూరంగా ఉన్నాడు.  జెన్‌-జీ విద్యార్ధుల పై జ‌రిగిన ద‌మ‌న‌కాండ‌కు నిర‌స‌న‌గా చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌కు హాజ‌ర‌య్యాడు. పుట్టిన‌రోజునే నిర‌స‌న‌దినంలో పాల్గొనడం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అందులోనూ న‌ల్ల‌చొక్కా తొడుక్కొని మ‌రీ.

న‌ల్లచొక్కా అంటే.. హిందూ సంప్ర‌దాయంలో శ‌నిదేవుడికి ఇష్ట‌మైన రంగుగా న‌లుపు రంగును భావిస్తారు. సంతాపానికి చిహ్నంగా కూడా ప్ర‌ద‌ర్శిస్తారు. త‌న పుట్టిన రోజులే న‌ల్ల‌చొక్కా ధ‌రించి మ‌రీ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు కేటీఆర్. ఇది కూడా రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆ వేదిక‌గా మాట్లాడిన ఆయ‌న‌.. దీన్ని రాజ‌కీయం చేయొద్ద‌ని, ఏ పార్టీ జెండా, అజెండా కింద జెన్‌-జీ న‌డొవ‌ద్ద‌ని కూడా కోరాడు.

Advertisement

కావాలంటే మేము ఉడ‌తాభ‌క్తిగా సాయంగా ఉంటామే త‌ప్ప‌.. పార్టీ రంగు పులమ‌డం ద్వారా కేంద్రంలోని బీజేపీకి అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌వుతుంద‌ని, వీరంతా ఫ‌లానా రాజకీయ పార్టీ స‌పోర్టుతో చేస్తున్నార‌నే ముద్ర జెన్‌-జీ మీద ప‌డొద్ద‌నేదే త‌న భావ‌న అని మాట్లాడ‌టం కూడా ఆక‌ట్టుకున్న‌ది. అందుకే త‌ను ఢిల్లీ జంత‌ర్‌మంత‌ర్‌కు రాలేద‌ని, చాలా మంది త‌న‌ను ఢిల్లీ వెళ్లి అక్క‌డి యువ‌త‌కు సంఘీభావంగా ఉండాల‌ని కోరార‌ని అన్నాడు. అయితే తాను వెళ్తే.. త‌న పాటు పార్టీ లీడ‌ర్లు, క్యాడ‌ర్ వ‌స్తుంద‌ని, అందుకే రాలేద‌న్నాడు.

మ‌న‌కు కావాల్సింది న్యాయం.. మీరు మీ న్యాయ‌మైన డిమాండ్ కోసం ఏ నాయ‌క‌త్వం లేక‌పోయినా.. ఒంట‌రిగా పోరాటం చేశారో.. దీనికి అంతిమంగా స‌రైన న్యాయం దొరికేంత వ‌ర‌కు పోరాటం ఆపొద్ద‌ని ఆయ‌న ఆకాంక్షించారు. జెన్‌-జీ అంశాన్ని త‌మ పార్టీ ముందే గ్ర‌హించింద‌ని, యువ‌త శ‌క్తిని మేమెప్పుడూ త‌క్కువ అంచ‌నా వేయ‌లేద‌ని, గ‌తంలో కేసీఆర్‌, త‌ను ఉటంకించిన సంద‌ర్భాల‌ను గుర్తు చేయ‌డం ద్వారా వారిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు కేటీఆర్‌.

Advertisement

కేటీఆర్ ప్ర‌సంగానికి ముందు యువ‌త చాలా మంది మాట్లాడారు. అంద‌రి నోటా .. కేటీఆర్ బ‌ర్త్ డే ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. త‌న పుట్టిన రోజున‌ ..త‌మ ఆందోళ‌న‌కు సంఘీభావంగా రావ‌డం ప‌ట్ల వారు కితాబిచ్చారు. ప్రశంస‌లు కురిపించారు. కేటీఆర్‌కు ప‌నిలోప‌నిగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు కూడా తెలిపారు.

ఇద్ద‌రి పిల్ల‌ల తండ్రిగా త‌న‌ను ఢిల్లీ ఘ‌ట‌న క‌లిచివేసింద‌ని , కంట‌నీరు పెట్టించింద‌ని అన‌డం అక్క‌డి యువ‌త‌ను కదిలించింది. అందుకే ఓ తండ్రిగా యువ‌త‌కు సంఘీభావం తెల‌పాల‌నుకున్నాను… పార్టీతో ప్ర‌మేయం లేకుండా…! అన‌డం మ‌న‌సుల‌ను ట‌చ్ చేసింది. దీన్ని రాజ‌కీయాల‌కు అతీతంగానే చూడాల‌ని, యువ‌త కూడా త‌మ సొంత‌శ‌క్తిని న‌మ్ముకునే ముందుకు పోవాల‌ని ఆయ‌న కోరారు.

రాజ‌కీయాలు చివ‌రి ఏడాదిలో చేసుకుందామ‌ని అన్న కేటీఆర్‌.. అప్పుడు జెన్‌-జీ ఎవ‌రి ప‌క్షముంటుందో తేలుతుంద‌ని, ఇప్ప‌ట్నుంచే త‌మ రాజ‌కీయ మైలేజీ కోసం వారి స్వ‌చ్చ‌మైన ఉద్య‌మాన్ని మ‌లినం చేయొద్ద‌ని కేటీఆర్ ఆకాంక్షించారు. కేటీఆర్ ప్ర‌సంగం అక్క‌డి యువ‌త‌లో ఉత్తేజాన్ని నింపింది. జెన్‌-జీ ఉద్య‌మానికి కొత్త ఊపునిచ్చింద‌నే చెప్పాలి.

Related News

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

అసెంబ్లీ వద్ద రచ్చకెక్కిన 22ఏ భూ దందా వివాదం..!

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

కేసీఆర్ డైరెక్షన్‌లోనే స్పీకర్‌పై బూతుల పర్వం.. అసలు మ్యాటర్ అదేనా..?

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

గ్రాండ్ సక్సెస్ సాధించిన టీపీసీసీ చీఫ్.. మహేష్ కుమార్ గౌడ్ ప్రయాణంలో నిలిచిన టాప్ ప్రోగ్రామ్స్ ఇవే!

Big Stories

Advertisement
×