E-Paper
Advertisement

బెంగాల్ సీఎంకి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది.. అలా చేస్తే కంగారు పడరా మరి?

బెంగాల్ సీఎంకి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది.. అలా చేస్తే కంగారు పడరా మరి?
Advertisement

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న‌ సమయంలో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ప్రచారంలో ఉండగా, ఒక యువకుడు అకస్మాత్తుగా ఆమె పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించాడు. అయితే, ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామంతో ఆమె ఒక్కసారిగా బిత్తరపోయారు.వెంటనే ఆమె భద్రతా సిబ్బంది ఆ యువకుడిని పక్కకు లాగేసి పరిస్థితిని చక్కదిద్దారు.

ఆ యువకుడు ముందుకు దూసుకురావడంతో ఆమె రక్షణ కోసం తన చేతులను పైకి ఎత్తి, భయాందోళనతో వెనక్కి తగ్గారు. ఆమె ముఖంలో కనిపించిన ఆ కంగారు, అభద్రతా భావం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌ చర్చకు దారితీసింది.

Advertisement

ఈ వీడియోపై ఎక్స్‌ (X) లో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగాల్ రాజకీయాల్లో హింస, బాంబు దాడులు తరచుగా వింటుంటాం కాబట్టి, ఎవరైనా ఒక్కసారిగా ముందుకు వస్తే ఆమె అలా స్పందించడం సహజమని కొందరు అంటున్నారు. “బెంగాల్‌లో ఎటు నుంచి బాంబు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది.. అందుకే ఆమె అంతలా భయపడ్డారు.” అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఆమెను నటనలో రారాజు అని, సానుభూతి కోసమే ఇలా డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. “ఈడీ (ED) వచ్చిందేమో అని భయపడ్డారు.” వంటి కామెంట్లతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

మరికొందరు మమతా బెనర్జీకి మద్దతుగా నిలుస్తున్నారు. “ఆమె స్థానంలో ఎవరున్నా, అకస్మాత్తుగా ఎవరైనా కాళ్ల మీద పడితే భయం కలగదా” అని వారు వాదిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి దీదీ పడుతున్న ఆరాటం ఇదని కొందరు అంటుంటే, ఆమె ఎనర్జీ లెవెల్స్ చూసి మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Read Also: మహిళా బిల్లుపై చ‌ర్చ‌.. ప్రధాని మోదీ జాదూగర్ అంటూ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

 

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×