E-Paper
Advertisement

Jio Free OTT: జియో సూపర్ వ్యాల్యూ ప్లాన్.. 10+ ఓటీటీ యాప్స్ ఫ్రీ, అన్‌లిమిటెడ్ కాల్స్

Jio Free OTT: జియో సూపర్ వ్యాల్యూ ప్లాన్.. 10+ ఓటీటీ యాప్స్ ఫ్రీ, అన్‌లిమిటెడ్ కాల్స్

Jio Free OTT| రిలయన్స్ జియో తన యూజర్ల కోసం వాల్యూ ప్యాక్డ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్స్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్లు వెతుకుతున్నవాళ్లకు చాలా ఒక మంచి ఆప్షన్ ఉంది. రూ.450 కంటే తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ఒక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ఓటీటీ యాక్సెస్, డేటా, కాలింగ్ అన్నీ బెనిఫిట్స్ ఇస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్, కనెక్టివిటీ కోసం జియో ఈ ప్లాన్ డిజైన్ చేసింది. ఈ రీఛార్జ్ ధర చాలా మంది యూజర్లకు సూట్ అవుతుంది. ఈ ప్లాన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

ప్లాన్ ధర, వాలిడిటీ వివరాలు

జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ₹445కు ఆఫర్ చేస్తోంది. ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. రీఛార్జ్ పీరియడ్ అంతా పూర్తి బెనిఫిట్స్ లభిస్తాయి. నెలవారీ వాల్యూ కావాలనుకునేవాళ్లకు ఇది సూటెబుల్. ఎంటర్‌టైన్‌మెంట్, డేటా, కాలింగ్ ఫీచర్లు బ్యాలెన్స్‌గా ఉంటాయి.

రోజువారీ డేటా, అనలిమిటెడ్ 5G యాక్సెస్

జియో ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా ఇస్తోంది. అంటే 28 రోజులకు మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ డేటాతో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ సులభం. రోజువారీ లిమిట్ అయిపోయాక స్పీడ్ తగ్గుతుంది. అర్హత ఉన్న యూజర్లకు అనలిమిటెడ్ 5G డేటా ఉంది. 5G ఏరియాల్లో మాత్రమే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. ఇది ఇంటర్నెట్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది.

అనలిమిటెడ్ కాలింగ్ ఫ్రీ, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఏమిటి

జియో ఈ ప్లాన్‌లో అనలిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఇస్తోంది. ఇండియా మొత్తం అన్ని నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయవచ్చు. రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి. ఇది యూజర్లను సులభంగా కనెక్ట్ చేస్తుంది.

10 కంటే ఎక్కువ ఓటీటీ యాప్స్‌కు ఫ్రీ యాక్సెస్

జియో 10 కంటే ఎక్కువ ఓటీటీ యాప్స్‌కు ఫ్రీ యాక్సెస్ ఇస్తోంది. మూవీస్, షోస్, లైవ్ కంటెంట్ ఎంజాయ్ చేయవచ్చు. సోనీ లివ్, ZEE5 ప్లాట్‌ఫామ్స్‌కు యాక్సెస్ ఉంది. లయన్స్‌గేట్ ప్లే కంటెంట్ కూడా లభిస్తుంది. జియో హాట్‌స్టార్ యాక్సెస్ బండిల్ చేసింది. మల్టిపుల్ సబ్‌స్క్రిప్షన్లపై డబ్బు ఆదా అవుతుంది. ఇది ప్లాన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ ఫోకస్డ్‌గా చేస్తుంది.

గూగల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

జియో గూగల్ జెమిని ప్రో యాక్సెస్ ఇస్తోంది. సబ్‌స్క్రిప్షన్ 18 నెలలు ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన యూజర్లకు ఇది వర్తిస్తుంది. జెమిని ప్రో సాధారణంగా రూ.35,100 ధర ఉంటుంది. జియో ఈ ప్రీమియం సర్వీస్‌ను పూర్తి ఫ్రీగా ఇస్తోంది. అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ లో ఇదే అత్యంత సూపర్ బెనిఫిట్.

Also Read: బటన్ నొక్కగానే శరీరమంతా వెచ్చదనం.. చలికాలంలో ఎలక్ట్రిక్ జాకెట్లు

జియో ఫైనాన్స్, ఏఐ క్లౌడ్ బెనిఫిట్స్

జియో కొన్ని సెలెక్టెడ్ రిఛార్జ్ ఫ్లాన్స్‌లో ఫైనాన్స్ బెనిఫిట్స్ జోడించింది. ఉదాహరణకు జియో గోల్డ్‌పై 1 శాతం ఎక్స్‌ట్రా లభిస్తుంది. మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ 50GB ఫ్రీగా ఇస్తోంది. బ్యాకప్స్, ఫైల్స్ స్టోర్ చేయవచ్చు.

జియో హోమ్ ఫ్రీ ట్రయల్ ఆఫర్

జియో హోమ్ సర్వీస్ స్పెషల్ ఆఫర్ ఇస్తోంది. కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ ట్రయల్ ఉంది. ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా జియో హోమ్ సర్వీసెస్ ట్రై చేయవచ్చు.

ఈ జియో ప్లాన్ ఎందుకు ప్రత్యేకం

ఈ ప్లాన్ డేటా, ఓటీటీ, ఏఐ బెనిఫిట్స్ కలిపి ఇస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చే ఈ ప్లాన్ తక్కువ ధరలో చాలా మందికి అందుబాటులో ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులకు ఇది మాక్సిమమ్ బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్. రోజువారీ ఇంటర్నెట్ యూజర్లకు సూటెబుల్. స్ట్రీమింగ్, కాలింగ్, ప్రొడక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. రూ.450 కంటే తక్కువలో ఇంత వాల్యూ ఇచ్చే ప్లాన్లు అరుదు.

 

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×