E-Paper
Advertisement

Two Autos Collided: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ.. స్పాట్‌లో ఎనిమిది మంది, ఇంతకీ ఎక్కడ?

Two Autos Collided: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ.. స్పాట్‌లో ఎనిమిది మంది, ఇంతకీ ఎక్కడ?
Advertisement

Two Autos Collided: అసలే చలికాలం.. ఎదురుగా ఎవరు వస్తున్నారో తెలియని పరిస్థితి. అతి వేగం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా అలాంటి ఘటన రాజాంలో చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఏం జరిగింది?

రాజాంలో ఢీ కొన్న రెండు ఆటోలు

Advertisement

విజయనగరం జిల్లా రాజాం మండల పరిధిలో ఈ ఘటన జరిగింది. కొత్తపేట జంక్షన్‌ వద్ద శనివారం అర్థరాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో అందులోని ప్రయాణిస్తున్న ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెర్లాం నుంచి ఐదుగురు ప్రయాణికులతో రాజాం వైపు ఓ ఆటో వస్తోంది. రాజాం నుంచి తెర్లాం వైపు మరో ఆటో వెళ్తోంది. ఈ రెండు కొత్తపేట జంక్షన్‌ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటో‌లు బలంగా ఢీ కొన్నాయి. ఆటోడ్రైవర్‌ గణేష్‌తో‌పాటు ఆయన వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలపాలయ్యారు.

Advertisement

ఎనిమిది మందికి తీవ్రగాయాలు, ఆసుపత్రిలో చికిత్స

మరో ఆటోలో ముగ్గురు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అలాగే అంబులెన్సులో రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నారాయణరావు, దివ్య, లక్ష్మణ రావులను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.

ఆటోడ్రైవర్ గణేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు బాధితుల నుంచి ఘటనకు సంబందించి వివరాలు తెలుసుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సివుంది.

ALSO READ: కళ్లలో కారం చల్లి.. ఆ వ్యక్తిని లేపేసిన అక్కాచెల్లెళ్లు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×