E-Paper
Advertisement

Jio Premium 5G: జియో ప్రీమియం 5G సేవలకు సర్వసిద్ధం.. కానీ ఇంకా వెయిటింగ్ దశలోనే.. కారణం ఏంటంటే?

Jio Premium 5G: జియో ప్రీమియం 5G సేవలకు సర్వసిద్ధం.. కానీ ఇంకా వెయిటింగ్ దశలోనే.. కారణం ఏంటంటే?
Advertisement

Jio Premium 5G: దేశంలోని అతిపెద్ద టెలికాం రంగ సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. ప్రస్తుతం భారత్ లో 5G స్టాండ్ అలోన్ ఆర్కిటెక్చర్ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థ కూడా ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే ప్రీమియం 5G సేవలను సైతం దేశంలో తీసుకొచ్చేందుకు గత కొద్ది కాలంగా జియో తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ సేవలను అందించడానికి సాంకేతికంగా జియో సిద్ధంగా ఉన్నప్పటికీ.. రెగ్యులేటరి సంస్థల అనుమతి కోసం ఎదురుచూడాల్సి వస్తోందని జియో ముఖ్య అధికారి తాజాగా తెలిపారు.

‘ప్రీమియం 5G సేవలకు సిద్ధమే’

రియలన్స్ ఇండస్ట్రీస్ పోస్ట్ ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ లో జియో ఇన్ఫోకామ్ వ్యూహ విభాగాధిపతి అన్షుమాన్ థాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీమియం నెట్ వర్క్ మార్కెట్లోకి రావడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న వనరులతో దేశంలో 5G ప్రీమియం సేవలను అందించగలమని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

నెట్‌వర్క్ స్లైసింగ్

Advertisement

రిలయన్స్ జియో తన స్వదేశీ సాంకేతికత ‘నెట్‌వర్క్ స్లైసింగ్’ను ఉపయోగించి ప్రీమియం 5జీ సేవలను అందించాలని భావిస్తోంది. దీని ద్వారా క్లౌడ్ గేమింగ్ వంటి హై ఎండ్ సేవల కోసం ప్రత్యేకమైన, వేగవంతమైన నెట్‌వర్క్‌ను అందించేందుకు వీలు కలుగుతుంది. అయితే సాధారణ వినియోగదారులకు ఈ తరహా సేవలు అందించే విషయంలో నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. ఎలాంటి వివక్ష లేకుండా సేవలు అందించాలనే నిబంధనల దృష్ట్యా.. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం జియో జాగ్రత్త పడుతోంది.

Also Read: ఏసీ గ్యాస్ లీక్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. నెక్ట్స్ టార్గెట్ మీరే కావొచ్చు!

దీనివల్ల ఏంటి ప్రయోజనం?

Advertisement

సామాన్యులకు ప్రీమియం 5G సేవలు అందుబాటులోకి వస్తే.. అనేక రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. గేమింగ్, హై-క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్ చేసే వారికి ఈ ప్రీమియం ప్లాన్లు అద్భుతమైన వేగాన్ని అందిస్తాయి. అయితే ఈ ప్రీమియం సేవలను పొందాలనుకేవారు సాధారణ ప్లాన్ల కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి రావొచ్చు. దీనివల్ల కంపెనీ సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

Also Read: రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Related News

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

10నిమిషాల ఛార్జింగ్‌తో..200 నిమిషాల ప్లేటైమ్ ఇయర్ బడ్స్

ఇంతకీ ఈ LTPO డిస్‌ప్లే కథేంటి? స్మార్ట్‌ఫోన్లలో ఇది ఉంటే బ్యాటరీ లైఫ్ డబుల్ అవుతుందా?

రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్

మార్కెట్‌లోకి కొత్త మోడల్.. రచ్చ చేస్తున్న ఈ టీవీ మోడల్ గురించి మీకు తెలుసా?

రూ.1648కే 3 వస్తువుల కాంబో..ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూసుండరు

Big Stories

Advertisement
×