E-Paper
Advertisement

ఏసీ గ్యాస్ లీక్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. నెక్ట్స్ టార్గెట్ మీరే కావొచ్చు!

ఏసీ గ్యాస్ లీక్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. నెక్ట్స్ టార్గెట్ మీరే కావొచ్చు!
Advertisement

Air Conditioner Tips: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రస్తుతం చాలా మంది ఏసీలను వినియోగిస్తున్నారు. గంటల తరబడి ఏసీ గదులకు పరిమితం అవుతున్నారు. అయితే దీనిని అదునుగా తీసుకొని కొందరు ఏసీ టెక్నిషియన్లు గ్యాస్ రీఫిల్ పేరుతో తరుచూ మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్యాస్ రీఫిల్లింగ్ పేరిట అధిక మెుత్తంలో వసూలు చేస్తున్నట్లు కొందరు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏసీ గ్యాస్ ధరలు, ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న మోసాలు, వాటి నుంచి బయటపడే చిట్కాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఏసీ గ్యాస్ రీఫిల్లింగ్ ఖర్చులు

సాధారణంగా గ్యాస్ రకం, ఏసీ సామర్థ్యాన్ని బట్టి రీఫిల్లింగ్ ఖర్చులు మారుతుంటాయి. ప్రస్తుతం వచ్చిన కొత్త మోడల్స్ లో ఎక్కువగా ఆర్-32 గ్యాస్ నింపుతున్నారు. దీని విలువ మార్కెట్ లో రూ.2,500-4000 మధ్య ఉంది. కొన్నింట్లో ఆర్-410ఏ గ్యాస్ నింపుతుండగా అది కూడా రూ.2500-4000 వరకూ పలుకుతోంది. ఇక పాత మోడల్స్ లో ఆర్-22 గ్యాస్ వాడుతున్నారు. ఇది అయితే రూ.1500 నుంచి రూ.2500 వరకూ ఛార్జ్ చేస్తారు. ఇది కాకుండా లీకేజీ గుర్తించి ఫిక్స్ చేసినందుకు రూ.500-1500 వరకూ సర్వీసు ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది.

గ్యాస్ పేరుతో జరిగే మోసాలు..

Advertisement

అయితే ఏసీల్లోని గ్యాస్.. వాహనంలోని పెట్రోల్ లాగా వాడకాన్ని బట్టి ఖాళీ కాదు. అది ఒక క్లోజ్డ్ లూప్ లో తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడైనా లీక్స్ ఉంటే తప్ప.. గ్యాస్ అయిపోవడం జరగదు. ఒకవేళ గ్యాస్ తగ్గిందని టెక్నీషియన్ చెప్తే.. లీక్ సరిచేసి గ్యాస్ ను నింపమని చెప్పండి. లేదంటే కొద్దిరోజుల్లోనే గ్యాస్ ఖాళీ మళ్లీ ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది.

ప్రెజర్ గేజ్ రీడింగ్‌లో మోసం

కొందరు టెక్నీషియన్లు ఏసీలో గ్యాస్ సరిపడినంత ఉన్నప్పటికీ.. గేజ్ రీడింగ్‌ను తప్పుగా చూపించి గ్యాస్ లేదని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి 1.5 టన్ ఏసీకి రన్నింగ్ ప్రెజర్ ఎంత ఉండాలో ముందే తెలుసుకుంటే బెటర్. సాధారణంగా ఆర్32 గ్యాస్ కి 120 – 150 పీఎస్ఐ రీడింగ్ ఉంటుంది. మరోవైపు చిన్న కెపాసిటర్ పోతే, కంప్రెసర్ పోయిందని చెప్పి వేలల్లో వసూలు చేసే టెక్నిషియన్లు కూడా ఉన్నారు. కాబట్టి ఏసీ స్పేర్ స్పార్ట్స్ అవసరమని చెప్పినప్పుడు అది ఎందుకు వేయాలో టెక్నిషియన్ ను ప్రశ్నించండి.

గ్యాస్ తగ్గిందని ఎలా తెలుస్తుంది?

Advertisement

గ్యాస్ అయిపోయిందని చెప్పేందుకు ఏసీ కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది. ఏసీని ఆన్ చేసిన తర్వాత ఏమాత్రం చల్లగా లేకుంటే గ్యాస్ అయిపోయిందని గుర్తించాలి. అలాగే ఇండోర్ యూనిట్ కాయిల్స్, అవుట్ డోర్ యూనిట్ వద్ద ఉన్న రాగి పైపులపై మంచి పేరుకుపోతే గ్యాస్ తగ్గిందని అర్థం చేసుకోవాలి. అలాగే ఏసీ రన్నింగ్ సమయంలో అవుట్ డోర్ యూనిట్ నుంచి పెద్ద శబ్దం వస్తుంటే.. గ్యాస్ లేదని నిర్ధారించుకోవాలి.

Also Read: రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

ఈ చిట్కాలతో సమస్యకు చెక్..

కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా.. ఏసీలో సమస్యలు రాకుండా ముందుగానే నియంత్రించవచ్చు. తద్వారా టెక్నిషియన్ల మోసాల నుంచి బయటపడొచ్చు. ఇందులో భాగంగా నెలకు కనీసం రెండుసార్లు ఏసీ ఫిల్టర్లను తీసి వాటర్ తో క్లీన్ చేస్తే మంచిది. దీనివల్ల ఏసీ నుంచి వచ్చే గాలి ప్రవాహం మెరుగుపడి కూలింగ్ పెరుగుతుంది. అదే విధంగా ఏడాదికి ఒకసారి ముఖ్యంగా సమ్మర్ ప్రారంభానికి ముందే ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయిస్తే బెటర్. అలాగే ఏసీని ఎప్పుడూ 24-26 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఉంచితే కంప్రెసర్ పై ఒత్తిడి తగ్గి ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

Also Read: అమ్మబాబోయ్, 10,200mAh బ్యాటరీతో.. Vivo Y600 Pro లాంచ్.. ధర కూడా చాలా తక్కువే!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×