BigTV English
Advertisement

JioMart Mobile Offer: అంబానీ మామ బిగ్ గిఫ్ట్.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏంటి అన్నయ్య ఇది!

JioMart Mobile Offer: అంబానీ మామ బిగ్ గిఫ్ట్.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏంటి అన్నయ్య ఇది!

JioMart Mobile Offer: OnePlus లవర్స్‌కు జియోమార్ట్ కళ్లుచెదిరే డీల్‌ను తీసుకొచ్చింది. OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. దీంతో 108MP కెమెరాతో  OnePlus నుండి చీపెస్ట్ 5G ఫోన్‌గా మారింది. ఈ స్మార్ట్‌ఫోన్‌‌లో 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు కె స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. ఇది కాకుండా ఫోన్‌లో 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. వన్‌ప్లస్ మిడ్-రేంజ్ నార్డ్ లైనప్ కింద ఈ ఫోన్ ఆగస్ట్ 2023లో విడుదలైంది. ఇప్పుడు ఇది చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.


OnePlus Nord CE 3 Lite 5G లాంచ్ సమయంలో ఫోన్ ప్రారంభ ధర రూ. 19,999 అయినప్పటికీ ఇది ప్రస్తుతం జియోమార్ట్‌లో దాని అతి తక్కువ ధర రూ. 16,549లగా ఉంది. ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని 8GB + 128GB వేరియంట్ JioMartలో రూ. 16,549. 8GB + 256GB వేరియంట్ రూ. 19,249. ఇది ప్రారంభించినప్పటి నుండి ఫోన్ అతి తక్కువ ధర.

Also Read: ఇటువంటి ఛాన్స్ మళ్లీ రాదు.. సామ్‌సంగ్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ చూస్తే!


ఈ ఫోన్ JioMart ఆన్‌లైన్ స్టోర్‌లో పైన పేర్కొన్న ధరలకు అందుబాటులో ఉంది. అమెజాన్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ అధికారిక సైట్‌లలో ఫోన్ ఇప్పటికీ అధిక ధరకు అందుబాటులో ఉంది. JioMart HDFC, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 500 రూపాయల అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. OnePlus Nord CE 3 Lite 5G ధర కేవలం రూ. 15,749. మీరు పాస్టెల్ లైట్, క్రోమాటిక్ గ్రే కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.

OnePlus Nord CE 3 Lite 5G ఫీచర్ల విషయానికి వస్తే ఫోన్ 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పూర్తి HD ప్లస్ (2400×1080 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఫోన్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ స్టోరేజ్ ప్రకారం ఇది 128GB +256GB రెండు వేర్వేరు వేరియంట్‌లలో వస్తుంది.

Also Read: అదుర్స్.. వన్‌ప్లస్ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు.. ఏది వదలకండి!

OnePlus Nord CE 3 Lite 5G‌లో ఫోటోగ్రఫీ కోసం ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ లెన్స్ ఉన్నాయి. ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. SuperVOOC ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్‌తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు కూడా ఉన్నాయి.

Tags

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×