Paruvu Trailer: ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా వెబ్ సిరీస్ లకే ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. ఓటిటీలలో స్ట్రీమింగ్ అవ్వడంతో కుటుంబం మొత్తం కూర్చొని ఇంట్లోనే చూడగలుగుతున్నారు. అందుకే డైరెక్టర్స్ సైతం సినిమాల మీద కంటే ఓటిటీ కంటెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరో, హీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్ లకు సై అంటున్నారు.
కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల అభిరుచిని బట్టి వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్స్. తాజాగా ఒక కొత్త వెబ్ సిరీస్ ఓటిటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. అదే పరువు. కోలీవుడ్ బ్యూటీ నివేతా పేరురాజ్.. ఈ మధ్య కారు డిక్కీలో శవాన్ని పెట్టుకొని వెళ్తుందని పోలీసులు ఆపి చెక్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. అయితే అదంతా ఈ సిరీస్ ప్రమోషన్ కోసమే అని ఈ ట్రైలర్ రిలీజ్ తరువాత తెలిసింది.
కుర్ర హీరో నగేష్ అగస్త్య, నివేతా పేతురాజ్ జంటగా నటించిన ఈ సిరీస్ కు సిద్దార్థ్, రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. గోల్డెన్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజగా ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పరువు కోసం ఏదైనా చేయడానికి సిద్దపడే పెద్ద మనిషిగా నాగబాబు కనిపించాడు.
నగేష్ అగస్త్య, నివేతా పేతురాజ్ ప్రేమించుకుంటారు. ఇంట్లో ఒప్పుకోరని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకొంటారు. ఇక వారిని చంపడానికి నాగబాబు ఒకపక్క, పోలీసులు ఇంకోపక్క తిరుగుతూ ఉంటారు. ఈలోపు ఒక హత్య కేసులో ఈ జంట ఇరుక్కుంటారు. ఆ శవాన్ని కనిపించకుండా చేయడానికి ఆ జంట ఏం చేసింది. నాగబాబు పరువు ఎలా పోయింది.. ? అసలు చనిపోయింది ఎవరు.. ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. జీ5 లో జూన్ 14 నుంచి పరువు స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.