E-Paper
Advertisement

కరెంట్ బిల్లు షాక్ కొడుతోందా? కిచెన్‌లో మీరు చేసే ఈ చిన్న పొరపాటే కారణం!

కరెంట్ బిల్లు షాక్ కొడుతోందా? కిచెన్‌లో మీరు చేసే ఈ చిన్న పొరపాటే కారణం!
Advertisement

Kitchen Appliances safety Tips: ప్రస్తుతం చాలా మంది ఇళ్లలొ మిక్సీ, గ్రైండర్, కుక్కర్ ఇలా చాలా ఎలక్ట్రిక్ పరికరాలు వాడుతున్నారు. ఇవి మన పనిని ఈజీ చేస్తాయి. కానీ వీటి వాడకం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే భారీ ప్రమాదాలకు కారణం అవుతాయి. ఎలాగంటే అనేక మంది వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పూర్తయ్యాక స్విచ్ ఆఫ్ చేసి అలాగే వదిలేస్తుంటారు. అయితే.. ప్లగ్ పాయింట్ నుంచి వైర్ తీయకపోవడం వల్ల అనేక నష్టాలు ఉంటాయి. దీని వల్ల కరెంట్ వృధా అవుతుంది.అంతే కాకుండా కొన్ని సార్లు అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.

వంటగదిని సురక్షితంగా ఉంచుకోవాలంటే.. ?

1. మైక్రోవేవ్ ఓవెన్ (Microwave Oven):
మైక్రోవేవ్ ఓవెన్ స్విచ్ ఆఫ్ చేసినా, అందులోని డిజిటల్ క్లాక్, సెన్సార్ల కోసం నిరంతరం కరెంట్ గ్రహిస్తూనే ఉంటుంది. దీనిని ‘ఫాంటమ్ పవర్’అంటారు. అంతేకాకుండా.. వోల్టేజ్ హెచ్చుతగ్గులు జరిగినప్పుడు ఓవెన్ లోపలి సర్క్యూట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి వాడనప్పుడు ప్లగ్ తీసేయడం బెస్ట్.

Advertisement

2. బ్లెండర్స్, మిక్సీలు (Blenders & Mixers):
మిక్సీ లేదా బ్లెండర్ల ప్లగ్ పాయింట్ ఎప్పుడూ ఆన్ లో ఉంచకూడదు. పొరపాటున ఎవరైనా బటన్ నొక్కినా లేదా షార్ట్ సర్క్యూట్ జరిగినా లోపలి మోటార్ కాలిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారు ఆడుకుంటూ బటన్ నొక్కితే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది.

3. ఎలక్ట్రిక్ కెటిల్, కాఫీ మేకర్ (Electric Kettle & Coffee Maker):
నీటిని వేడి చేసే కెటిల్స్ లేదా కాఫీ మేకర్లలో హీటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి చాలా వేగంగా వేడెక్కుతాయి. ప్లగ్ లోనే ఉంచడం వల్ల కొన్నిసార్లు సెన్సార్ విఫలమై నీరు లేకపోయినా వేడెక్కి మంటలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి కరెంట్ ను కూడా ఎక్కువగా ఖర్చు చేస్తాయి.

Advertisement

4. టోస్టర్లు (Toasters):
టోస్టర్లలో బ్రెడ్ ముక్కలు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. అవి హీటింగ్ ఎలిమెంట్‌కు తగిలి ఉన్నప్పుడు ప్లగ్ ఆన్ లో ఉంటే.. లోపల నిప్పురవ్వలు వచ్చి అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కిచెన్ ఫైర్ యాక్సిడెంట్లలో టోస్టర్ల పాత్ర ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

5. ఎయిర్ ఫ్రైయర్స్ (Air Fryers):
ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో ఎయిర్ ఫ్రైయర్స్ వాడుతున్నారు. ఇవి కూడా మైక్రోవేవ్ లాగే కరెంట్ ను తీసుకుంటాయి. వంట పూర్తయ్యాక వెంటనే అన్‌ప్లగ్ చేయడం వల్ల మెషిన్ లైఫ్ పెరగడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.

Also Read: మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ 4 వస్తువులు పెడితే బాంబులా పేలడం ఖాయం!

అన్‌ప్లగ్ చేయడం వల్ల కలిగే లాభాలు:
కరెంట్ ఆదా : నివేదికల ప్రకారం, వాడనప్పుడు ప్లగ్ లోనే ఉంచే పరికరాల వల్ల ఏడాదికి మీ కరెంట్ బిల్లులో సుమారు 10% వరకు అదనపు భారం పడుతోంది.

ఫైర్ సేఫ్టీ : కిచెన్‌లో నీటి వాడకం ఎక్కువ కాబట్టి.. ప్లగ్‌లు ఆన్ లో ఉంటే తేమ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది.

లైఫ్ స్పాన్ : వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ నుంచి మీ ఖరీదైన గ్యాడ్జెట్లను కాపాడుకోవచ్చు.

గమనిక:
ఈ సమాచారం గృహిణులు, సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే. ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఎప్పుడూ ఐఎస్ఐ (ISI) మార్క్ ఉన్న వస్తువులనే వాడండి.

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×