E-Paper
Advertisement

సంచలన కేసు.. భర్తపై భార్య లైంగికదాడి.. మరో మహిళతోనూ కలవమని బలవంతం!

సంచలన కేసు.. భర్తపై భార్య లైంగికదాడి.. మరో మహిళతోనూ కలవమని బలవంతం!
Advertisement

Bengaluru Case: కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన భార్య క్షోభకు గురిచేస్తోందంటూ ఓ భర్త.. పోలీసులను ఆశ్రయించారు. లైంగికదాడి చేయడంతో పాటు.. ఆమె స్నేహితురాలితో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తోందని అతడు ఆరోపించారు. అంతేకాకుండా అత్త, మామ పైకూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలేం జరిగిందంటే?

బాధితుడి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం.. బెంగళూరులోని నాగరభావి ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల బాధితుడు.. 31 ఏళ్ల శిల్పను వివాహం చేసుకున్నాడు. వారు జక్కూరులోని ఓ విల్లాలో నివసిస్తున్నారు. అయితే తన అత్త ఆశ.. ఇంట్లోకి రానివ్వడం లేదని కూతురికి ఇంకో పెళ్లి చేయడం కోసం విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మామ అయిన మాధవ్ కృష్ణ.. ఈ విషయమై తనను బెదిరించడానికి మనుషులను సైతం పంపిస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయారు.

మద్యం సేవిస్తూ పార్టీలు..

Advertisement

ఈ క్రమంలో తన భార్య శిల్పపై బాధితుడు సంచలన ఆరోపణలు చేశారు. తన ఆర్థిక స్థితిగతులను ఎగతాళి చేస్తూ మానసిక క్షోభకు గురిచేసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. లగ్జరీగా చూసుకోవడం లేదంటూ నిత్యం సూటిపోటి మాటలతో మానసికంగా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అంతేకాకుండా తన డబ్బున్న స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ, మద్యపానం తాగుతూ రోజులు గడుపుతోందని అన్నారు.

లైంగిక వేధింపులు

అంతటితో ఆగకుండా తన భార్య లైంగికంగా తనను చిత్రహింసలకు గురిచేస్తోందంటూ బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ.. అందులో ఉన్నట్లు తనతో చేయమని ఒత్తిడి చేసేదని ఆరోపించారు. అంతేకాకుండా ఆమె స్నేహితురాలితోనూ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఆమె తన మాజీ లవర్స్ తో వివాహేత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు స్వయంగా ఒప్పుకున్నట్లు కూడా భర్త చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా.. తననే ఇంటి నుంచి బయటకు గెంటేశారని వాపోయాడు.

Advertisement

Also Read: Fuel Hike: వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన ప్రీమియం పెట్రోల్.. లీటర్‌పై ఎంతంటే?

భర్తపై భార్య ఫిర్యాదు

తన డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు, పాస్ పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంకా విల్లాలోనే ఉండిపోయాయని బాధితుడు పోలీసులకు తెలియజేశాడు. తన భార్యకు పెళ్లి కానుకలుగా ఇచ్చిన వస్తువులు సైతం.. విల్లాలోనే ఉండిపోయాయని అన్నారు. మరోవైపు భార్య సైతం.. తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. భర్త ఫిర్యాదును స్వీకరించిన బెంగళూరు పోలీసులు.. ఇందులోని నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Bank Holidays April 2026: అమ్మబాబోయ్.. ఏప్రిల్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల హాలీడేస్ లిస్ట్ ఇదే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×