E-Paper
Advertisement

తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్.. 2029 నాటికి రాష్ట్రంలో కొత్త రాజ్యాలు..?

తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్.. 2029 నాటికి రాష్ట్రంలో కొత్త రాజ్యాలు..?
Advertisement

Delimitation: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పునర్విభజన పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్ సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. దీంతో 2011 జనాభా ప్రాతిపదికన కొత్త స్థానాలు పెంచేందుకు ప్రణాళికల అమలులో అధికారులు నిమగ్నమయ్యారు..నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ స్థానాలకు మరో 60 స్థానాలు పెరిగే అవకాశం ఉంది.

జిల్లా యూనిట్‌గా..

ప్రస్తుతం కొన్ని నియోజక వర్గాలు రెండు మూడు జిల్లాలు విస్తరించి ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునవిభజనకు జిల్లాలే ప్రాతిపదికగా కేంద్రం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లా యూనిట్ గా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది.జిల్లాలోని మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సరిహద్దులుగా ఏర్పాటు చేయనున్నారు.

ఓటర్ జాబితా ప్రకారం

Advertisement

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నియోజకవర్గాల పునర్విభజనపై ప్రజల్లో ఊహగానాలను రెక్కెత్తిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని నూతన అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు ఏర్పాటు కానున్నాయనే అంశాలపై రాజకీయ నాయకులు చర్చోపచర్చలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సవరించిన ఓటర్ జాబితా ప్రకారం 32,13299 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 16,21300, పురుషులు 15,89,718 ట్రాన్స్ జెండర్లు 76, సర్వీస్ ఓటర్లు 2,205 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.అదేవిధంగా 13 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అదనంగా మరో లోక్ సభ స్థానంతో పాటు మూడు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాలు సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడెక్కడ నూతన అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నాయనే చర్చ నడుస్తోంది.

Also Read: పక్కన కూర్చుంటే తప్పేంటి.. ప్రోటోకాల్ ఉల్లంఘనా.. మేయర్ మమత ఫైర్..?

నూతన అసెంబ్లీ స్థానం

Advertisement

మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్ పరిధిలో దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉండగా ఇక్కడ మహబూబ్ నగర్ రూరల్ హన్వాడ మండలంతో పాటు సమీపంలోని మరో మండలాన్ని కలిపిసాధ్యసాధ్యాలు అనుసరించి నియోజకవర్గ ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలు ఉండగా ఐజ కేంద్రంగా నూతన అసెంబ్లీ స్థానం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వనపర్తి జిల్లాలో సైతం పెబ్బేరు కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆత్మకూర్ మండలానికి సమీపంలోని అమరచింత నియోజకవర్గం సైతం ఏర్పడే అవకాశం ఉంది.

రిజర్వేషన్ల లో మార్పులు

మహిళలకు 33% రిజర్వేషన్లు అమలులో నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల రిజర్వేషన్లు సైతం మారే అవకాశాలు ఉన్నాయి కనీసం నాలుగు నుంచి ఆరు స్థానాలు మహిళలకు రిజర్వుతాయి ఏ స్థానంలో రిజర్వేషన్లు మారుతాయి అంశంలో నేతలు తర్జనభజన పడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలోని ఆమనగల్లు మండలం సైతం నియోజకవర్గంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి కొన్ని మండలాలను కలుపుకొని బిజినేపల్లి కేంద్రంగా అసెంబ్లీ స్థానం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎం నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో సైతం కోస్గి కేంద్రంగా మరో స్థానం పెరిగే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.ఇందులో కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండు మాల్ తో పాటు గండేడ్ మండలాన్ని కలిపే అవకాశం ఉంది

గద్వాల కేంద్రంగా లోక్ సభ స్థానం

ఇప్పటికే మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాలు ఉండగా నూతనంగా గద్వాల జిల్లా కేంద్రంగా మరో స్థానం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలంపూర్ , గద్వాల , నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు కొత్త స్థానాలు కలిపి ఒక లోక్ సభ స్థానం పెరిగే అవకాశాలు ఉన్నాయి .

Also Read: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు రాత్రి నగరంలో వర్షం కురిసే ఛాన్స్!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×