E-Paper
Advertisement

Yamaha Nmax 155: యమహా నుంచి క్రేజీ స్కూటర్,ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా!

Yamaha Nmax 155: యమహా నుంచి క్రేజీ స్కూటర్,ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా!
Advertisement

Yamaha Nmax 155 Scooter 2026: యమహా NMAX 155 ఇండియన్ మార్కెట్ లోకి త్వరలో అడుగు పెట్టబోతోంది. మార్చి 2026 నాటికి విడుదల కానుంది. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 1.60 లక్షల నుంచి రూ. 1.70 లక్షలకు వరకు ఉంటుంది. ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ గా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో 155cc, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ తో ఉంటుంది. రైడింగ్ మోడ్‌ లతో కూడిన కొత్త యమహా ఎలక్ట్రిక్ CVT, 4.2 అంగుళాల TFT డిస్‌ ప్లే, ABS,  ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

యమహా NMAX 155 గురించి..   

⦿ ఇంజిన్, పెర్ఫార్మెన్స్: 155cc, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఇంజిన్ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్(VVA)తో వస్తుంది. సుమారు 15 HP పవర్, 14 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోల్ తో 45 నుంచి 50 కి.మీ మైలేజ్ లభిస్తుంది.

Advertisement

⦿ ఫీచర్లు:  ఈచర్ల విషయానికి వస్తే 4.2-అంగుళాల TFT డిస్‌ ప్లే, స్మార్ట్ కీ సిస్టమ్, స్టార్ట్ స్టాప్ సిస్టమ్, USB ఛార్జర్,  LED హెడ్‌ లైట్లు ఉంటాయి. మైరైడ్ యాప్ తో స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో కూడిన కలర్ TFT ఉంటుంది.

⦿ బ్రేకింగ్, సస్పెన్షన్: ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ రియర్ షాక్స్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ ఫ్యూయెల్ ట్యాంక్: సుమారు 7.1 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

⦿ డిజైన్: మ్యాక్సీ స్కూటర్ స్టైల్, సౌకర్యవంతమైన సీటింగ్,  విండ్‌ స్క్రీన్ ఉంటాయి. 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. చక్కగా హెల్మెట్ పెట్టుకోవచ్చు.

⦿ టెక్నాలజీ: YECVT.. కొన్ని మోడళ్లకు, సిమ్యులేటెడ్ గేర్ షిఫ్ట్‌లతో ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), డ్యూయల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ కలర్స్: యమహా Nmax 155 స్కూటర్ క్రిస్టల్ గ్రాఫైట్, మిడ్‌ నైట్ బ్లాక్‌ లలో అందుబాటులో ఉంటుంది.

ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

సిటీ ట్రాఫిక్‌లో సులభంగా దూసుకుపోవడానికి, మంచి మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ కు అనుకూలంగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ రైడ్స్‌ కు, హైవే ప్రయాణాలకు బాగా సరిపోతుంది. ఇందులో ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లాంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్ ఆసియా, యూరప్ మార్కెట్లలో బాగా పాపులర్ అయ్యింది.

Read Also: టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా vs మారుతి సుజుకి ఇ విటారా, వీటిలో ఏది బెస్ట్ అంటే?

యమహా Nmax 155 లాంచ్, ధర

యమహా Nmax 155 స్కూటర్ భారత్ లో మార్చి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 1,60,000 నుంచి రూ. 1,70,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నసింపుల్ ఎనర్జీ వన్ జెన్ 2, వెస్పా S 150, వెస్పా 150 మాదిరిగానే Nmax 155 ఉంటుంది.

Read Also: రేంజ్ రోవర్ ను మక్కికి మక్కి దింపేసిన చైనా, మరీ ఇంత ఘోరమా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×