E-Paper
Advertisement

Laptop Wifi Connectivity: మీ ల్యాప్‌టాప్‌లో వైఫై కనెక్షన్ కావడం లేదా? ఈజీగా ఇలా సెట్టింగ్స్ చేయండి

Laptop Wifi Connectivity: మీ ల్యాప్‌టాప్‌లో వైఫై కనెక్షన్ కావడం లేదా? ఈజీగా ఇలా సెట్టింగ్స్ చేయండి

Laptop Wifi Connectivity| ఈ రోజుల్లో ఆఫీసు, ఇలు అన్ని చోట్ల విద్య, వృత్తి పరంగా ల్యాప్‌టాప్ చాలా అవసరం. దాంతో పాటు రోజువారీ పని, ఈమెయిల్స్, బ్రౌజింగ్, ఆన్‌లైన్ మీటింగ్స్ కోసం స్థిరమైన ఇంటర్నెట్ అవసరం. కానీ కొన్నిసార్లు ల్యాప్‌టాప్.. వైఫైకి కనెక్షన్‌లో సమస్య వస్తుంది.

ఈ కారణంగా ఎంతో ముఖ్యమైన పని ఆగిపోతుంది. ఇదంతా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అయితే చాలా వైఫై సమస్యలకు సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. కొన్ని సాధారణ స్టెప్స్ అనుసరిస్తే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. విండోస్ ల్యాప్‌టాప్‌లో వైఫై కనెక్ట్ కాకపోతే ఈ ట్రబుల్‌షూటింగ్ మెథడ్స్ ట్రై చేయండి.

వైఫై కనెక్షన్ స్టేటస్ చెక్ చేయండి

ముందుగా టాస్క్‌బార్‌లో వైఫై ఐకాన్ చూడండి. ఇది కనెక్షన్ స్టేటస్ చూపిస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయితే ఐకాన్ యాక్టివ్‌గా కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు వైఫై కనెక్ట్ అయినా ఇంటర్నెట్ పనిచేయదు. ఫైర్‌వాల్ లేదా ఏదైనా యాప్ బ్లాక్ చేసి ఉండవచ్చు. VPN ఉపయోగిస్తే చిన్న షీల్డ్ ఐకాన్ కనిపిస్తుంది. “No Internet” స్టేటస్ వస్తే వివిధ నెట్‌వర్క్ సమస్యలు ఉండవచ్చు.

విండోస్ నెట్‌వర్క్ ట్రబుల్‌షూటర్ ఉపయోగించండి

విండోస్ 11లో “Get Help” యాప్‌లో నెట్‌వర్క్ ట్రబుల్‌షూటర్ ఉంది. ఇది ఆటోమేటిక్‌గా నెట్‌వర్క్, ఇంటర్నెట్ సమస్యలను చెక్ చేసి ఫిక్స్ చేస్తుంది. పాత విండోస్ వెర్షన్లలో మాన్యువల్‌గా ట్రబుల్‌షూట్ చేయవచ్చు. ఈ స్టెప్స్ అనుసరిస్తే చాలా సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.

నెట్‌వర్క్ కనెక్షన్ స్టేటస్ చెక్ చేయండి

టాస్క్‌బార్‌లో నెట్‌వర్క్ ఐకాన్ క్లిక్ చేయండి. వైఫై ఆన్‌లో ఉందా లేదా చెక్ చేసుకోండి. నెట్‌వర్క్ “Connected”గా కనిపిస్తుందో చూడండి. లేకపోతే మళ్లీ కనెక్ట్ చేయండి. అందుబాటులో ఉన్న వైఫై లిస్ట్ నుంచి మీ నెట్‌వర్క్ సెలెక్ట్ చేసి కనెక్ట్ చేయండి. పాస్‌వర్డ్ అడిగితే ఎంటర్ చేయండి.

ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆఫ్ చేయండి

సెట్టింగ్స్ మెనూని ఓపెన్ చేయండి. Network and Internet సెక్షన్‌కి వెళ్లండి. Airplane Mode ఆప్షన్ చూడండి. దీన్ని ఆఫ్ చేయాలి. ఆన్‌లో ఉంటే అన్ని వైర్‌లెస్ కనెక్షన్లు పనిచేయవు.

వైఫై నెట్‌వర్క్‌ను ఫర్గెట్ చేసి మళ్లీ కనెక్ట్ చేయండి

సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి. Network and Internet సెట్టింగ్స్‌కి వెళ్లండి. WiFi.. Manage Known Networks ఓపెన్ చేయండి. మీ నెట్‌వర్క్ సెలెక్ట్ చేసి “Forget” ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మళ్లీ కనెక్ట్ చేసి సరైన పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.

రౌటర్, మోడెమ్‌ను రీస్టార్ట్ చేయండి

సమస్య రౌటర్ వైపు ఉండవచ్చు. మోడెమ్ లేదా వైఫై రౌటర్ ఆఫ్ చేయండి. కొన్ని సెకన్ల పాటు వేచి ఉండి.. మళ్లీ ఆన్ చేయండి. ఇది ఇంటర్నెట్ ప్రొవైడర్‌తో ఫ్రెష్ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది.

వైఫై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ మార్చండి

ఆధునిక రౌటర్లు 2.4GHz, 5GHz రెండు బ్యాండ్లు బ్రాడ్‌కాస్ట్ చేస్తాయి. రెండూ వైఫై లిస్ట్‌లో వేర్వేరుగా కనిపిస్తాయి. మరో బ్యాండ్‌కు కనెక్ట్ అవ్వడం ద్వారా కనెక్షన్ స్టెబిలిటీ మెరుగుపడవచ్చు.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

మరో డివైస్‌తో నెట్‌వర్క్ టెస్ట్ చేయండి

మరో స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో అదే నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వండి. ఇది సమస్య ల్యాప్‌టాప్‌లోనా లేక నెట్‌వర్క్‌లోనా అని తెలుస్తుంది. మరో డివైస్‌లో పనిచేస్తే సమస్య మీ ల్యాప్‌టాప్‌లోనే ఉంది.

ల్యాప్‌టాప్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేయండి

కమాండ్ ప్రాంప్ట్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా ఓపెన్ చేయండి. ఈ కమాండ్స్ ఒక్కొక్కటిగా రన్ చేయండి:
netsh winsock reset
netsh int ip reset
ipconfig /release
ipconfig /renew
ipconfig /flushdns
ఈ సెట్టింగ్స్ మార్చి కంప్యూటర్ రీస్టార్ట్ చేయండి.

ఫైర్‌వాల్ లేదా యాంటీవైరస్ టెంపరరీగా డిసేబుల్ చేయండి

కొన్ని యాంటీవైరస్ లేదా ఫైర్‌వాల్ ప్రోగ్రామ్స్ ఇంటర్నెట్ బ్లాక్ చేస్తాయి. వీటిని టెంపరరీగా ఆఫ్ చేసి టెస్ట్ చేయండి. ఇంటర్నెట్ పనిచేస్తే సాఫ్ట్‌వేర్ వల్ల సమస్య వచ్చింది. టెస్ట్ తర్వాత ఫైర్‌వాల్ మళ్లీ ఆన్ చేయండి.

నెట్‌వర్క్ డ్రైవర్లను అప్‌డేట్ లేదా రీఇన్‌స్టాల్ చేయండి

పాత డ్రైవర్ల వల్ల వైఫై సమస్యలు వస్తాయి. Device Manager ఓపెన్ చేయండి. Network Adapters సెక్షన్ ఎక్స్‌పాండ్ చేయండి. వైర్‌లెస్ అడాప్టర్‌పై రైట్ క్లిక్ చేసి “Update Driver” సెలెక్ట్ చేయండి. లేదా అన్‌ఇన్‌స్టాల్ చేసి రీస్టార్ట్ చేస్తే విండోస్ ఆటోమేటిక్‌గా రీఇన్‌స్టాల్ చేస్తుంది.

ల్యాప్‌టాప్‌లలో వైఫై సమస్యలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. సెట్టింగ్స్ చెక్ చేయడం, డివైస్‌లు రీస్టార్ట్ చేయడం, డ్రైవర్లు అప్‌డేట్ చేయడం వంటి సాధారణ స్టెప్స్‌తో చాలా సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఈ మెథడ్స్ అనుసరిస్తే విండోస్ ల్యాప్‌టాప్‌లో స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ పొందవచ్చు.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×