E-Paper
Advertisement

ఒరాకిల్ బాస్‌కు భారీ షాక్: రూ. 16 లక్షల కోట్లు గాల్లోనే.. ప్రపంచ కుబేరుల జాబితాలో లారీ ఎల్లిసన్ ‘పతనం’!

ఒరాకిల్ బాస్‌కు భారీ షాక్: రూ. 16 లక్షల కోట్లు గాల్లోనే.. ప్రపంచ కుబేరుల జాబితాలో లారీ ఎల్లిసన్ ‘పతనం’!
Advertisement

Larry Ellison: టెక్ వరల్డ్ లో అడ్డే లేదన్నట్టుగా దూసుకుపోతున్న ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation) సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్‌ కి పెద్ద దెబ్బే తగిలింది.అవును ..నిన్న మొన్నటి వరకు అపర కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్‌కు దీటుగా కాంపిటీషన్ ఇస్తూ సెకండ్ ప్లేసులో నిలిచిన లారీ ఎల్లిసన్‌ లారీ ఎల్లిసన్ సంపద ఊహించని రీతిలో ఆవిరైపోయింది. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఆయన నికర విలువ ఏకంగా 193 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 16.10 లక్షల కోట్లు) ఆవిరైపోవడం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌ గా నిలుస్తుంది.ఈ మొత్తం కొన్ని చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం

రెండో స్థానం నుండి ఏకంగా ఆరో స్థానానికి

Advertisement

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో లారీ ఎల్లిసన్ ఆస్తి విలువ 388 బిలియన్ డాలర్లు. కానీ, సరిగ్గా ఆరు నెలలు తిరిగేసరికి ఏప్రిల్ 3, 2026 నాటికి అది 195 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ ధనవంతుల ర్యాంకింగ్స్‌లో ఆయన రెండో స్థానం నుండి ఏకంగా ఆరో స్థానానికి పడిపోయారు.ఎల్లిసన్ ఆస్తి ఈ స్థాయిలో కరిగిపోవడానికి ప్రధాన కారణం ఒరాకిల్ షేర్లు మార్కెట్‌లో దారుణంగా పతనం కావడమేనట.సెప్టెంబర్ 2025 345.72 డాలర్లు గా ఉన్న ఒరాకిల్ షేర్ ధర ఏప్రిల్ 2, 2026 కి వచ్చేసరికి 146.38 డాలర్లకు పడిపోయింది.అంటే కేవలం ఆరు నెలల్లోనే దాదాపు 58% మేర పతనం అయిందన్న మాట. ఇక ఒరాకిల్‌లో ఎల్లిసన్‌కు 41% వాటా ఉండటంతో, షేర్ల పతనం కాస్తా లారీ ఎల్లిసన్ వ్యక్తిగత సంపదను ముంచేసింది.

also read:మందు బాబులూ … ఒక పెగ్గే కదా అని లైట్ తీసుకుంటున్నారా?

Advertisement

30,000 మంది ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్ 

ఇక ఒకవైపు సంపద ఆవిరి అవుతుంటే ఇంకో వైపు వైపు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది ఒరాకిల్..అందులో భాగంగా మార్చి 31న వరల్డ్ వైడ్ గా సుమారు 30,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 18%) తొలగించడం గమనార్హం.ముఖ్యంగా ఈ లేఆఫ్స్ ఎఫెక్ట్ భారత్‌పై కూడా గట్టిగానే ఉంది.ఇప్పటికే దేశంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 12,000 మంది ఉద్యోగులను వ్యాపార అవసరాల దృష్ట్యా మీ రోల్ తొలగిస్తున్నాం” అంటూ తెల్లవారుజామునే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపి పెద్ద షాకే ఇచ్చింది.తీసేసిన వారిలో అత్యధికంగా భారతదేశం (India) నుంచే ఉండటం గమనార్హం. ఇక ఈ రకంగా ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం ఐటీ వర్గాల్లో పెను సంచలనం రేకెత్తిస్తుంది.

సంపద శాశ్వతం కాదనడానికి లారీ ఎల్లిసన్ పతనం నిదర్శనం

అయితే ఏఐ (AI)& క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో గట్టి పోటీ, మార్కెట్ సరిగ్గా లేకపోవడం,బిజినెస్ లో ప్రెజర్స్ మరియు అప్పుల భారం పెరగడం వల్లే ఒరాకిల్ ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుందని భావిస్తున్నారు టెక్ పండిట్స్.ఏది ఏమైనా సంపద శాశ్వతం కాదు అనడానికి లారీ ఎల్లిసన్ పతనం ఒక నిదర్శనం.మొత్తానికి టెక్ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని ఒరాకిల్ ఉదంతం మరోసారి నిరూపించిందన్న మాట.

also read:‘సువర్ణ’ మూవీ రివ్యూ.. రీల్స్ పిచ్చితో భవిష్యత్తును బలి చేసుకుంటున్నారా?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×