E-Paper
Advertisement

మందు బాబులూ … ఒక పెగ్గే కదా అని లైట్ తీసుకుంటున్నారా?

మందు బాబులూ … ఒక పెగ్గే కదా అని లైట్ తీసుకుంటున్నారా?
Advertisement

Alcohol Effects: పార్టీ ..ఇప్పుడీ పదం కామన్ అయిపొయింది, బర్త్ డే అయినా, సాలరీ వచ్చినా, గుడ్ న్యూస్ విన్నా మామా పార్టీ చేసుకుందాంరా అనే మాట చాలా సార్లు వింటూనే ఉంటాం.ముఖ్యంగా ఈ డ్రింకింగ్ అనేది సోషల్ స్టేటస్ కి సింబల్ లా మారిపోయింది.ఇక మనసు వద్దు వద్దు అని చెబుతున్నా ఏం కాదులే బ్రో జస్ట్ ఒక్క పెగ్గే అంటూ సర్ది చెప్పుకుంటు పీపాల కొద్ది లాగిస్తున్న వారందరికీ గట్టి వార్నింగ్ ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్. మరి బాడీకి ఈ డ్రింక్ అనేది ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఓసారి చూసేద్దాం.

ఆల్కహాల్ మైండ్ పై తన ప్రతాపం చూపిస్తుంది

Advertisement

మొదటగా పెగ్గు లేపిన కొన్ని నిమిషాలలోనే ఆల్కహాల్ మైండ్ పై తన ప్రతాపం చూపడం మొదలెడుతుంది . మొదట్లో ప్రెజర్ తగ్గి ,కాస్త బాడీలో జోష్ వచ్చినట్టు అనిపించినా అది జస్ట్ మీ భ్రమ అన్న సంగతి మరవకండి.రోజుకు ఒక్క డ్రింక్ తాగినా సరే, మిడిల్ ఏజ్ ఉన్నవాళ్ళలో మెదడు సైజ్ తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలింది. అంటే, మీరు ఎంత ఎక్కువగా తాగితే మెదడు అంత కుంచించుకుపోతుందన్నమాట! ఇక మెల్లిగా న్యూరో సిస్టం ని దెబ్బతీసి ఇన్​ఫ్లమేషన్​కు దారితీస్తుంది. ఫలితంగా థింకింగ్ పవర్ ని కోల్పోతాము.

also read:విడాకులు నిజమేనా శర్వా…? ఇన్‌స్టా నుంచి ఫ్యామిలీ ఫోటోలు అవుట్..!

Advertisement

నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 50 శాతం

ఇక నోట్లో పెగ్గు పోయాగానే అందులోని ఆల్కహాల్ డైరెక్ట్ గా నోరు, గొంతు కణజాలాలతో స్పర్శలోకి వస్తుంది.అంటే కొంచెం తాగినా నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 50 శాతం పెరుగుతుందన్న మాట . అదే నాటుసారా లాంటివి తాగితే మాత్రం ఆ చాన్స్ 87 శాతానికి చేరుతుందట.ఇక తీసుకున్న మద్యం డైజెస్ట్ కావాలంటే ‘అసిటలహైడ్’ అనే పదార్ధం పుడుతుంది.ఇది ఒక రకంగా పాయిజన్ లాంటిది. ఇది DNAను దెబ్బతీసి స్వరపేటిక, అన్నవాహిక క్యాన్సర్లకు దారితీస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట.

అదే పనిగా రోజుకు రెండు మూడు పెగ్గులు

ఇక ఒకప్పుడు మద్యం తీసుకుంటే హార్ట్ కి మంచిదని కొందరు నమ్మేవారు, కానీ అందుకు సరైన ఆధారాలు ఏమీ లేవట , ఇక అదే పనిగా రోజుకు రెండు మూడు పెగ్గులు వేసేవారికి గుండెపోటు (Heart Attack), స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.మద్యం వల్ల బీపీ పెరగడమే కాకుండా, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె లయ తప్పి (Arrhythmia) అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.

అల్సర్లు, వాంతులు, వికారానికి కారణం 

ఇక మద్యం లోనికి పోగానే జీర్ణాశయం, పేగుల గోడలపై డైరెక్ట్ ఎటాక్ చేస్తుంది.ఇది అల్సర్లు, వాంతులు, వికారానికి కారణమవుతుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను చంపేయడం వల్ల మోషన్స్ కి దారి తీస్తాయి. అంతేకాదు,పేగుల పొర దెబ్బతినడం వల్ల శరీరంలోకి పాయిజన్ తో కూడిన పదార్థాలు బ్లడ్ ప్యూరిటీ కోల్పోతుంది.అన్నింటి కన్నా ముఖ్యంగా రోజుకు రెండు డ్రింకులు తాగే వారికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్న మాట .

ఫిల్టర్ చేసే బాధ్యత కాలేయానిదే

ఇక మనం తీసుకున్న మద్యాన్ని ఫిల్టర్ చేసే బాధ్యత కాలేయానిదే (Liver). ఈ ప్రాసెస్ లో కొన్ని కాలేయ కణాలు చనిపోతుంటాయి. కాలేయం కొత్త కణాలను సృష్టించుకున్నప్పటికీ, అది లోడ్ పడనంత వరకే! ఇక అతిగా తాగేవారిలో 90 శాతం మందికి ‘ఫ్యాటీ లివర్’ (కాలేయంలో కొవ్వు) సమస్య ఉంటుంది. ఇది గనుక ముదిరితే
హెపటైటిస్, ఆ పైన సిరోసిస్ (కాలేయం గట్టిపడటం) వస్తుంది. ఇది గనుక ఒక్కసారి వస్తే ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే. సో ఇప్పటి కైనా మద్యానికి దూరంగా ఉండండి, మీ ఆరోగ్యంతో పాటు డబ్బునీ ఆదా చేసుకోండి !

also read:కిడ్నీలో రాళ్లా? బీరు తాగితే కరిగిపోతాయా?

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×