E-Paper
Advertisement

Dual Screen Phone: రెండు స్క్రీన్‌లుగల 5G ఫోన్ కేవలం రూ.15999.. అమెజాన్‌లో ఫుల్ డిమాండ్..

Dual Screen Phone: రెండు స్క్రీన్‌లుగల 5G ఫోన్ కేవలం రూ.15999.. అమెజాన్‌లో ఫుల్ డిమాండ్..
Advertisement

Budget Dual Screen Phone| డ్యుయల్ స్క్రీన్ ఫోన్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ రెండు డిస్‌ప్లేల 5G స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్ అమెజాన్‌లో ఉంది. ఈ ఫోన్ రేర్ డిజైన్‌లో ఉన్నా.. చౌక ధరలో లభిస్తుండడంతో ప్రత్యేక ఆకర్షణ మారింది. బడ్జెట్‌లో స్పెషల్ లుక్, మంచి ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది గొప్ప ఆప్షన్. ఇండియన్ బ్రాండ్ లావాలో లావా బ్లేజ్ డ్యూయో 5G బలమైన స్పెసిఫికేషన్స్, స్టైలిష్ లుక్ తక్కువ ధరలో ఇస్తోంది. అమెజాన్ ప్రస్తుతం ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు అమ్ముతోంది.

లావా బ్లేజ్ డ్యుయో 5G ధర, డిస్కౌంట్ వివరాలు

భారత మార్కెట్‌లో లావా బ్లేజ్ డ్యుయో 5G మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ.18,999. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ.20,499. ఫోన్ ఆర్కిటిక్ వైట్, సెలెస్టియల్ బ్లూ కలర్లలో వచ్చింది. ఇప్పుడు అమెజాన్‌లో 6GB RAM వేరియంట్ రూ.16,999కి లభిస్తోంది. అర్హత ఉన్న బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.1,000 డిస్కౌంట్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్ తర్వాత ఫైనల్ ధర రూ.15,999కి దిగుతుంది. అంటే లాంచ్ ధర కంటే రూ.3,000 చౌకగా దొరుకుతోంది.

డ్యుయల్ డిస్‌ప్లే డిజైన్ ఈ ఫోన్‌లో ప్రత్యేకం

Advertisement

లావా బ్లేజ్ డ్యూయో 5Gలో రేర్ డ్యూయల్ డిస్‌ప్లే డిజైన్ ఉంది. ముందు భాగంలో పెద్ద కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 6.67 ఇంచ్ సైజు, ఫుల్ HD+ రెజల్యూషన్ ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 394 PPI పిక్సెల్ డెన్సిటీతో షార్ప్ విజువల్స్ ఉంటాయి. వెనుక భాగంలో 1.58 ఇంచ్ సెకండరీ AMOLED స్క్రీన్ ఉంది. నోటిఫికేషన్స్, అలర్ట్స్, క్విక్ ఇన్ఫో ఫోన్ అన్‌లాక్ చేయకుండానే చూడవచ్చు.

పెర్ఫామెన్స్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

ఫోన్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. అయితే ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ సపోర్ట్ లావా కన్ఫర్మ్ చేసింది. 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ ఉంది. ఆక్టా-కోర్ చిప్‌సెట్ రోజువారీ పనులు స్మూత్‌గా జరిగేలా చేస్తుంది. మల్టీటాస్కింగ్, స్ట్రీమింగ్, క్యాజువల్ గేమింగ్ సులభంగా జరుగుతాయి. గరిష్టంగా 8GB LPDDR5 RAM ఉంది. 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ విస్తరణ సపోర్ట్ లేదు.

కెమెరా సెటప్, ఫోటోగ్రఫీ

Advertisement

డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 64MP ప్రైమరీ కెమెరాతో స్పష్టమైన ఫోటోలు తీయవచ్చు. 2MP సెకండరీ సెన్సార్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డేలైట్ కండిషన్స్‌లో మంచి పెర్ఫామెన్స్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. సోషల్ మీడియా ఉపయోగానికి సరిపడే క్లారిటీ ఇస్తుంది.

Also Read: రూ.10000 అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఫ్రీ.. శాంసంగ్ ఆఫర్.. ఆ చిన్న పని చేస్తేనే

బ్యాటరీ, ఛార్జింగ్, కనెక్టివిటీ

5000mAh బ్యాటరీ ఉంది. రెగ్యులర్ యూజ్‌లో పూర్తి రోజు సులభంగా ఉంటుంది. 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఛార్జింగ్ సమయం త్వరగా తగ్గుతుంది. 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2 సపోర్ట్ ఉన్నాయి. GPS, USB టైప్-C పోర్ట్ కూడా ఉన్నాయి. IP64 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంది.

లావా బ్లేజ్ డ్యూయో 5G ఎందుకు కొనాలి?

డ్యుయల్ డిస్‌ప్లే డిజైన్ ఈ ఫోన్‌ను యూనిక్ చేస్తుంది. స్మూత్ పెర్ఫామెన్స్, మోడర్న్ AMOLED స్క్రీన్ ఉన్నాయి. డిస్కౌంట్ ధరతో గొప్ప విలువ ఇస్తోంది. స్టైల్, ఫీచర్లు, చౌక ధర కలిగిన ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×