E-Paper
Advertisement

Ind vs NZ 3rd T20I: మూడో మ్యాచ్‌లో చిత్తైన కివీస్.. టీ20 సిరీస్ టీమిండియా వ‌శం, అభిషేక్ కొత్త రికార్డు

Ind vs NZ 3rd T20I:  మూడో మ్యాచ్‌లో చిత్తైన కివీస్.. టీ20 సిరీస్ టీమిండియా వ‌శం, అభిషేక్ కొత్త రికార్డు
Advertisement

Ind vs NZ 3rd T20I: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడవ టి20లో సూర్య కుమార్ యాదవ్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఊచకోత కోశారు. ఈ దెబ్బకు 10 ఓవర్లలోనే మ్యాచ్ ఫినీష్‌ అయింది. దీంతో మూడవ టి20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. న్యూజిలాండ్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు నష్టపోయి టీమ్ ఇండియా చేదించింది. ఈ దెబ్బకు 5 T20 ల సిరీస్ ను 3-0 తేడాతో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్ టీమిండియా దక్కించుకున్న నేపథ్యంలో, న్యూజిలాండ్ పై ప్రతి కారం తీర్చుకున్నట్లయింది.

Also Read: Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

10 ఓవ‌ర్ల‌లోనూ మ్యాచ్ ఫినీష్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు టీమిండియా అద్భుతం చేసింది. సూర్య కుమార్ యాదవ్ సేన ఆధ్వర్యంలోని టీమిండియా జట్టు, న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ గెలుచుకుంది. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య గౌహతి వేదికగా ఆదివారం రోజున మూడవ టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొదట బ్యాటింగ్ చేసింది న్యూజిలాండ్. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ జట్టులో గ్లైన్ ఫిలిప్స్ ఒక్కడే 48 పరుగులు సాధించగా, మార్క్ చాప్ మన్ 32 పరుగులు చేశాడు. కెప్టెన్ సాంటన్నర్ మరోసారి 27 పరుగులతో రాణించాడు.

ఇక న్యూజిలాండ్ ఫిక్స్ చేసిన 154 పరుగుల లక్ష్యాన్ని భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా అవలీలగా చేదించింది. కేవలం 10 ఓవర్లు వాడిన టీమిండియా లక్ష్యాన్ని చేదించేసింది. 10 ఓవర్లు ఆడిన టీమిండియా రెండు వికెట్ల నష్టానికి మ్యాచ్ గెలిచింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది టీమ్ ఇండియా. ఈ విజయంతో 5 T20 ల సిరీస్ కూడా కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలుచుకోగా.. ఇప్పుడు టి20 సిరీస్ టీమిండియా వశం అయింది.

14 బంతుల్లో అభిషేక్ శర్మ అర్థ సెంచరీ..

Advertisement

న్యూజిలాండ్ తో జరిగిన మూడవ టి20 లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma) చరిత్ర సృష్టించాడు. టి20 అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసిన రెండవ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. తన గురువు యువరాజు సింగ్ 12 బంతుల్లో ఇంగ్లాండ్ పై అర్థ సెంచరీ సాధించాడు. ఇప్పుడు న్యూజిలాండ్ పైన 14 బంతుల్లోనే అభిషేక్ శర్మ అర్థ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన రికార్డు ఉంది.

Also Read:  Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×