E-Paper
Advertisement

TCL X11L Mini-LED TV: రూ.8 లక్షల టీవీ చూశారా? సోనీ బ్రావియా రేంజ్ ఫీచర్లతో TCL సంచలనం!

TCL X11L Mini-LED TV: రూ.8 లక్షల టీవీ చూశారా? సోనీ బ్రావియా రేంజ్ ఫీచర్లతో TCL సంచలనం!
Advertisement

TCL X11L Mini-LED TV: ఒకప్పుడు బడ్జెట్ ధరలో టీవీలను అందించే బ్రాండ్‌గా గుర్తింపు పొందిన TCL, ఇప్పుడు ప్రీమియం మార్కెట్లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా సోనీ బ్రావియా లాంటి పెద్ద కంపెనీతో చేతులు కలిపినప్పటి నుంచి, TCL తన క్వాలిటీని మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. దీనికి నిదర్శనమే తాజాగా మార్కెట్లోకి వచ్చిన TCL X11L మినీ ఎల్‌ఈడీ టీవీ. భవిష్యత్తులో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉండబోతోందో చూపించనున్న ఈ టీవీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..

అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ:

నిజానికి మనలో చాలామంది OLED టీవీల్లోనే కలర్స్ బాగా కనిపిస్తాయి అనుకుంటాం. కానీ, ఈ అంచనాను TCL తన మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీతో పూర్తిగా మార్చేసింది. ల్యాబ్ టెస్టుల్లో కలర్ అక్యూరసీ విషయంలో ఈ టీవీ దాదాపు 100 శాతం స్కోరు సాధించిందంటే నమ్మండి. టీవీని బాక్సులో నుంచి తీసి స్విచ్ ఆన్ చేయగానే.. ఎలాంటి సెట్టింగ్స్ మార్చకపోయినా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ కనిపిస్తుంది. ఇక మూవీ లవర్స్ కోసం ఈ టీవీలో ఉన్న ఫిలిం మేకర్ మోడ్ అయితే, సినిమాను డైరెక్టర్ ఎలా చూపించాలి అనుకున్నారో అలాగే సహజంగా చూపిస్తుంది.

Advertisement

Also Read: అరచేతిలో పట్టేసే పోర్టబుల్ ప్రొజెక్టర్స్.. ఎక్కడైనా సినిమా చూసేయొచ్చు!

10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్:

ఈ టీవీలో మనం మెచ్చుకోవాల్సిన ఇంకో మెయిన్ పాయింట్ దీని బ్రైట్‌నెస్. 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల, గదిలో కిటికీల నుంచి వెలుతురు ఎక్కువగా వస్తున్నా సరే బొమ్మ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 20,000 లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఉండటంతో నైట్ సీన్లలో కూడా నలుపు రంగు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే.. వరల్డ్ ఫేమస్ బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ స్పీకరను ఇందులో వాడారు వాడారు. తద్వారా ఇంట్లోనే థియేటర్‌లో సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది.

ధర ఎంతంటే?

Advertisement

మరి ఇన్ని ఫీచర్లు ఉన్నప్పుడు రేటు కూడా అదే రేంజ్‌లో ఉంటుంది కదా. 85 ఇంచుల మోడల్ దాదాపు రూ.6.6 లక్షలు. ఇక 98 ఇంచుల మోడల్ అయితే రూ.8 లక్షల వరకు ఉంటుంది. ఇందులో చిన్న సైజులు రాకపోవడం కొంచెం నిరాశ కలిగించే విషయమే అయినా.. బెస్ట్ క్వాలిటీ టీవీయే కావాలి, బడ్జెట్ అస్సలు ప్రాబ్లం కాదు.. అనుకునే వాళ్లకి మాత్రం ఈ TCL X11L మినీ ఎల్‌ఈడీ టీవీ బెస్ట్ ఆప్షన్.

Also Read: ప్రతినెలా కరెంట్ బిల్లు షాకిస్తోందా? ఈ 6 పొరపాట్లే మీ కొంప ముంచుతున్నాయి!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×