E-Paper
Advertisement

చైనా ఫోన్లకు పోటీగా దేశీ బ్రాండ్ హవా.. జస్ట్ రూ.12 వేలకే 6GB ర్యామ్ 5G ఫోన్ తెచ్చిన లావా!

చైనా ఫోన్లకు పోటీగా దేశీ బ్రాండ్ హవా.. జస్ట్ రూ.12 వేలకే 6GB ర్యామ్ 5G ఫోన్ తెచ్చిన లావా!
Advertisement

Lava Bold N1 5G: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేశీయ బ్రాండ్ లావా. ఇప్పుడు Bold N1 5G సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ ఫోన్ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతుండగా.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు ఎక్కువ RAM, స్టోరేజ్‌తో కూడిన సరికొత్త మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లలో తక్కువ ర్యామ్ ఉండటం వల్ల ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ లావా ఈ కొత్త వేరియంట్‌తో ఆ సమస్యకు చెక్ పెట్టింది.

గతంలో 4GB RAM ఆప్షన్లలో మాత్రమే దొరికే ఈ ఫోన్.. ఇప్పుడు 6GB RAM, 128GB స్టోరేజ్‌తో లభించనుంది. దీని ధరను రూ.12,999గా నిర్ణయించగా.. లాంచ్ ఆఫర్ కింద ప్రారంభంలో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. మే 1వ తేదీ నుంచి అమెజాన్ ద్వారా ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి. రోజువారీ మల్టీ టాస్కింగ్ చేసేవారికి, ఎక్కువ యాప్స్ వాడేవారికి ఈ అదనపు ర్యామ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా.. లావా కంపెనీ అందించే ఉచిత అట్ హోమ్ సర్వీస్ కస్టమర్లకు మరింత భరోసాను ఇస్తుంది.

Advertisement

Also Read: ఏంది మామా ఈ అరాచకం.. 8,000mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లే‌తో iQOO కొత్త ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి.. స్క్రోలింగ్, వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఈ ఫోన్ యూనిసోక్ T765 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది హెవీ గేమింగ్ కోసం కాకపోయినప్పటికీ, రోజువారీ పనులు, సోషల్ మీడియా వాడకం, 5G ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం దీనికి IP54 రేటింగ్ కూడా ఇచ్చారు.

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 వెర్షన్‌తో వస్తోంది. దీనికి రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఇకపోతే బ్యాటరీ విషయానికి వస్తే.. 5000mAh సామర్థ్యం గల బ్యాటరీతో పాటు 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా పరంగా చూసుకుంటే.. వెనుక వైపు 13MP కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కెమెరా క్వాలిటీ యావరేజ్‌గా ఉన్నప్పటికీ, బడ్జెట్ ధరలో 5G వేగాన్ని అనుభవించాలనుకునే వారికి ఇదొక మంచి ఎంపిక అవుతుంది.

Also Read: ఈ ట్రిక్ తెలిస్తే.. WhatsAppలో ప్రతి చాట్‌ను ఓపెన్ చేయక్కర్లేదు.. అన్ని మెసేజ్‌లను ఒకేసారి చదివేయండిలా!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×