E-Paper
Advertisement

ఏంది మామా ఈ అరాచకం.. 8,000mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లే‌తో iQOO కొత్త ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?

ఏంది మామా ఈ అరాచకం.. 8,000mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లే‌తో iQOO కొత్త ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

iQOO Smartphone: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు iQOO బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్లను లాంచ్ చేయడంలో ఈ కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు ఐకూ 16 సిరీస్‌పై ఇప్పటికే మార్కెట్లో మంచి హైప్ ఉంది. అయితే అందరూ దీని కోసమే వెయిట్ చేస్తుంటే.. ఐకూ సైలెంట్‌గా మరో పవర్‌ఫుల్ ఫోన్‌ను రెడీ చేస్తోంది. దీనికి సంబంధించిన లీకులు చూస్తుంటే వినియోగదారుల మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఫోన్ బ్యాటరీ, ప్రాసెసర్ చూసి టెక్ నిపుణులు కూడా షాక్ అవుతున్నారు.

ఈ కొత్త ఐకూ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది. దీనిలో 6.83 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఇది ఫ్లాట్ స్క్రీన్ కాబట్టి.. గేమింగ్ ఆడేవారికి, సినిమాలు చూసేవారికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. 2K రిజల్యూషన్ వల్ల స్క్రీన్ మీద బొమ్మలు చాలా షార్ప్‌గా, రియలిస్టిక్‌గా కనిపిస్తాయి.

Advertisement

ఇక సెక్యూరిటీ కోసం స్క్రీన్ లోపలే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండబోతోంది. మెటల్ ఫ్రేమ్‌తో వస్తోంది కాబట్టి.. ఫోన్ చేతిలో పట్టుకుంటే మంచి ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అంతేకాదు.. వానలో తడిసినా, దుమ్ముతో నిండిపోయినా ఏమీ కాకుండా దీనికి వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇస్తున్నారు.

Also Read: iPhone 17 Pro కొనాలనుకుంటున్నారా? భారీగా ధర తగ్గింది, ఇలా కొట్టేయండి బాస్!

Advertisement

ఫోన్ స్పీడ్ విషయంలో ఐకూ ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు. అందుకే దీనిలో మీడియాటెక్ నుంచి వస్తున్న టాప్ ఎండ్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను వాడుతున్నారు. దీంతో ఎన్ని యాప్స్ వాడినా, ఎంత పెద్ద గేమ్స్ ఆడినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదన్నమాట. ఇక ఫొటొల కోసం ఈ ఫోన్‌లో ఏకంగా 200MP మెయిన్ కెమెరా ఉండొచ్చని టాక్. అదే కనుక నిజమైతే.. ఫొటోలు కెమెరా క్వాలిటీతో రావడం ఖాయం.

ఈ ఫోన్ గురించి అందరూ మాట్లాడుకోవడానికి మెయిన్ రీజన్ దీని బ్యాటరీనే. దీనిలో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని పెడుతున్నారు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రెండు మూడు రోజుల వరకు వాడుకోవచ్చు. అయితే ఈ ఫోన్ మే నెలలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో విడుదల గురించి కంపెనీ నుంచి ఇంకా అఫీషియల్ అప్‌డేట్ రాలేదు.

Also Read: ఏసీ వాడకపోయినా కరెంటు బిల్లు అమాంతం పెరుగుతోందా? అసలు కారణం ఈ 6 వస్తువులే!

Related News

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

రూ.1,004కే 750W పవర్‌ఫుల్ మిక్సర్ గ్రైండర్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×