RTC Crisis: ఆర్టీసీ ఏ రాష్ట్రంలోనైనా నష్టాల్లోనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మెయింటేన్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఉంటుంది. రూపాయి రాక, రూపాయి పోక అక్కడికక్కడే ఉంటుంది. ఎందుకంటే రకరకాల వర్గాలకు రాయితీలు ఇస్తుంటారు. అదే సమయంలో ఎక్కువ లాభాలు లేని పల్లెటూర్లకు తిప్పాల్సి వస్తుంది. ప్రభుత్వాలు చేస్తానన్న సహాయాలు చేయవు. బస్సు చుట్టూ సవాలక్ష సమస్యలు ఉంటాయ్. ఆర్టీసీ ఉనికే లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయ్. అవేంటో చూద్దాం.
బెంగాల్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సుల కంటే ప్రైవేట్ బస్సుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కారణం.. అక్కడ ఆర్టీసీ చాలా వరకు మనుగడ కోల్పోయింది. చాలా వరకు సమ్మెలు, యూనియన్ల వ్యవహారాలతో ఈ పరిస్థితి వచ్చింది. లాభాల్లో ఉన్న బెంగాల్ ఆర్టీసీ ఇప్పుడు నామ్ కే వాస్తే అన్నట్లుగా నడుస్తోంది. వెస్ట్ బెంగాల్, సౌత్ బెంగాల్, నార్త్ బెంగాల్ అని మూడు కార్పొరేషన్లుగా ఉన్నా ప్రైవేట్ బస్సుల కంటే తక్కువ ఆపరేటింగ్ చేస్తాయి. బెంగాల్ లో అసలు ఆర్టీసీకి ఈ సమస్య ఎందుకు వచ్చిందో 2019 అక్టోబర్ లో నాడు సీఎం హోదాలో కేసీఆర్ ఏం చెప్పారో చూడండి.
ఇక బిహార్ సంగతి చూద్దాం. అక్కడ కూడా ప్రభుత్వ రవాణా సంస్థ ఉంది. అయితే ఇది లిమిటెడ్ గానే పనిచేస్తోంది. అక్కడంతా ప్రైవేట్ దే ఆధిపత్యం. 90 శాతం బస్సులు ప్రైవేట్ వారి చేతుల్లోనే ఉంది. బిహార్‌లో అత్యధిక ప్రజా రవాణా ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల ఆధీనంలోనే ఉంటుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తిరిగే వాళ్లు ఎక్కువగా ప్రైవేట్ వాహనాలపైనే ఆధారపడతారు. అదో రకం సమస్యలు. ఫిట్ నెస్ అయిపోయినవి, కాలం చెల్లిన వాటిని కూడా తిప్పుతారు. దీంతో ప్రయాణికుల ప్రయాణం దినదిన గండం అన్నట్లుగా ఉంటుంది.
Also Read: కేసీఆర్ వారసత్వం వద్దు.. కవిత నయా రాజకీయం వెనుక అసలు ప్లాన్ ఇదే..!
ఇప్పుడు మధ్యప్రదేశ్ ఆర్టీసీ స్టోరీ చూద్దాం.. ఇక్కడ పరిస్థితి మిగిలిన రాష్ట్రాల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. 2005లో ఏకంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ -MPSRTC కార్యకలాపాలు మొత్తానికే ఆపేసింది. MPSRTCని మూసేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రజా రవాణా దాదాపు పూర్తిగా ప్రైవేట్ ఆపరేటర్ల చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం కేవలం లైసెన్సులు, పర్మిట్లు, రూట్లను కంట్రోల్ చేస్తుంటుంది. అయితే ఇటీవలే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సుగం పరివహన్ సేవ వంటి పథకాల ద్వారా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది. అటు మధ్యప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత ఛత్తీస్ గఢ్ లోనూ సొంతంగా ఆర్టీసీని ఏర్పాటు చేయలేదు. రవాణా అంతా ప్రైవేట్ బస్సుల ద్వారానే సాగుతుంది.
ఇక ఆర్టీసీ నామమాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. ఇక్కడ ఉన్న మణిపూర్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ దాదాపు దశాబ్దం కాలం మూతపడింది. అయితే, 2017లో మళ్లీ కొద్దిపాటి బస్సులతో పునరుద్ధరించారు. కానీ ఇది చాలా పరిమితం. దాదాపు చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీలు నష్టాల్లోనే నడుస్తుంటాయి. ఈ కొద్ది రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వాలు ఈ నష్టాలను భరించలేక సంస్థలను మూసివేసి, రవాణా బాధ్యతను ప్రైవేట్ రంగానికి వదిలేశాయి. నిర్వహణ భారం, అంటే బస్సుల కొనుగోలు, డీజిల్ ఖర్చులు, వేల సంఖ్యలో సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు ఇలాంటి భారంగా మారడంతో ఈ రాష్ట్రాల్లో ఆర్టీసీ పాత్ర పరిమితం అయిపోయింది.
Also Read: చిప్స్ ప్యాకేట్ల పై కస్టమ్స్ డ్యూటీ.. నేపాల్ ప్రధానీ నిర్ణయం పై ఎగిసిపడుతున్న నిరసనలు!
ప్రైవేట్ ఆపరేటర్లు తక్కువ ఖర్చుతో, ఎక్కువ రూట్లలో బస్సులు నడపడం వల్ల ప్రభుత్వ బస్సులకు ఆదరణ తగ్గింది. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వం కేవలం రూట్లను నిర్ణయించి, పర్మిట్లు ఇచ్చి పన్నులు వసూలు చేసుకుంటే సరిపోతుందని భావించాయి. అలాగే నడిపిస్తున్నాయ్ కూడా. గుజరాత్ లో కూడా ఆర్టీసీకి నష్టాలే ఉన్నాయి. కేరళ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, యూపీ లాంటి చోట్ల కొంత మెరుగ్గా సిచ్యువేషన్ ఉంది.
Storey By: Appa Rao Bug Tv