Lava New Earbuds: మన స్వదేశీ బ్రాండ్ అయినా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి సరికొత్త ఆడియో ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసింది. తమ ప్రో సిరీస్‌ను విస్తరిస్తూ.. Probuds T51 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, అలాగే Xscape 13° నెక్ బ్యాండ్‌ను పరిచయం చేసింది. వీటితో పాటు Provat Air 10K పవర్ బ్యాంక్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. విభిన్న రకాల వినియోగదారులను ఆకట్టుకునేలా లావా వీటిని డిజైన్ చేసింది.
బడ్జెట్ ధరలోనే లభించే Lava Probuds T51 ధరను రూ.1,999గా నిర్ణయించారు. ఇది మోచా క్రీమ్, బ్లూ ఫ్రాస్ట్, ఎస్ప్రెస్సో బ్లాక్ రంగుల్లో దొరుకుతుంది. ఇక Xscape 13° నెక్ బ్యాండ్ ధర కేవలం రూ.699 మాత్రమే. ఇది బ్లాక్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇవి రిటైల్ స్టోర్లలో దొరుకుతున్నాయి. త్వరలోనే అమెజాన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. వీటిపై ఏడాది వారంటీతో పాటు అదనంగా మరో రెండు నెలల వారంటీ లభిస్తుంది.
Also Read: 14 రోజుల బ్యాటరీ లైఫ్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్.. భారత్‌లోకి వచ్చేసిన Huawei Band 11 సిరీస్!
ఈ ఇయర్‌బడ్స్‌లో 12.4mm డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. ఇవి 50dB వరకు బయటి శబ్దాలను తగ్గించే హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో వస్తాయి. చెవిలో నుంచి తీయగానే పాటలు ఆగిపోయే ఇన్-ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రోస్పాట్ యాప్ ద్వారా వీటి ఆడియోను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX4 రేటింగ్‌తో వస్తుంది.
ఈ నెక్ బ్యాండ్‌లో 10mm డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. ప్రో బాస్, ప్రో రాక్, ప్రో బ్యాలెన్స్ అనే మూడు రకాల ఈక్యూ మోడ్స్ దీనిలో లభిస్తాయి. గేమింగ్ ప్రియుల కోసం 40ms లో-లేటెన్సీ మోడ్‌ను ఇచ్చారు. బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైజ్ పేరింగ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ దీని సొంతం. కేవలం 30 గ్రాముల బరువుండే ఈ నెక్ బ్యాండ్‌కు కూడా IPX4 రేటింగ్ ఉంది.
లావా ప్రోబడ్స్ T51 కేస్ మొత్తమ్మీద 60 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 3 గంటల పాటు వాడుకోవచ్చు. మరోవైపు ఎక్స్‌స్కేప్ 13° నెక్ బ్యాండ్ ఏకంగా 70 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీనికి 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2.5 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. క్వాలిటీ ఆడియోను కోరుకునే వారికి ఇవి మంచి ఆప్షన్లుగా నిలుస్తాయి.
Also Read: యాపిల్ AirDrop ఇప్పుడు మోటోరోలా ఫోన్లలో కూడా.. ఎలా పనిచేస్తుందంటే?