E-Paper
Advertisement

14 రోజుల బ్యాటరీ లైఫ్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్.. భారత్‌లోకి వచ్చేసిన Huawei Band 11 సిరీస్!

14 రోజుల బ్యాటరీ లైఫ్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్.. భారత్‌లోకి వచ్చేసిన Huawei Band 11 సిరీస్!
Advertisement

Huawei Band 11: హువావే కంపెనీ నుంచి సరికొత్త ఫిట్‌నెస్ ట్రాకర్లు ‘హువావే బ్యాండ్ 11’ సిరీస్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సిరీస్‌లో.. బ్యాండ్ 11, బ్యాండ్ 11 ప్రో అనే రెండు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మోడల్‌లో అల్యూమినియం కేస్‌తో వచ్చే ‘మెటల్’ వేరియంట్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ బ్యాండ్‌లు ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

భారతదేశంలో హువావే బ్యాండ్ 11 బేస్ మోడల్ అసలు ధర రూ.6,499 కాగా, మెటల్ ఆప్షన్ ధర రూ.7,999గా ఉంది. ఇక ప్రీమియం ఫీచర్లతో కూడిన హువావే బ్యాండ్ 11 ప్రో ధర రూ.8,999గా నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బేస్ మోడల్ కేవలం రూ.3,999కే లభిస్తుండటం విశేషం. కలర్స్ విషయానికొస్తే.. స్టాండర్డ్ మోడల్ బ్లాక్, బేజ్, గ్రీన్, పర్పుల్, వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతుండగా, ప్రో మోడల్ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్స్‌లో లభిస్తోంది.

Advertisement

Also Read: యాపిల్ AirDrop ఇప్పుడు మోటోరోలా ఫోన్లలో కూడా.. ఎలా పనిచేస్తుందంటే?

ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లు ఆండ్రాయిడ్ 9, ఆపై వెర్షన్లపై పనిచేసే ఫోన్లకు సపోర్ట్ చేస్తాయి. ఇందులో 1.62-ఇంచుల అమోలెడ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇది ఆల్వేస్-ఆన్-డిస్‌ప్లే ఫీచర్‌తో వస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ప్రో మోడల్‌లో 2000 నిట్స్, సాధారణ మోడల్‌లో 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. అంతేకాకుండా.. ఇవి 5 ATM వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉండి, నీటిలో 50 మీటర్ల లోతు వరకు తట్టుకోగలవు.

Advertisement

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారి కోసం ఇందులో అద్భుతమైన సెన్సార్లు ఉన్నాయి. గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవడానికి ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కొలిచేందుకు SpO2 సెన్సార్‌లను అమర్చారు. వీటితో పాటు స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ వేరియబిలిటీ, మానసిక ఒత్తిడిని గమనించే స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వ్యాయామం చేసే వారి కోసం ఇందులో 100 కంటే ఎక్కువ వర్కౌట్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ బ్యాండ్‌లలో బ్యాటరీ లైఫ్ చాలా కీలకం. ఈ విషయంలో హువావే బ్యాండ్ 11 సిరీస్ నిరాశపరచదు. ఈ బ్యాండ్‌లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో 8 రోజుల వరకు, అలాగే సేవింగ్ మోడ్‌లో గరిష్టంగా 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. స్టైల్, హెల్త్ ట్రాకింగ్, మంచి బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తున్న ఈ హువావే సరికొత్త సిరీస్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: WhatsApp, Telegram, Signal: యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. స్పందించిన వాట్సప్.. అసలేం జరిగింది?

Related News

ఐఫోన్ vs ఆండ్రాయిడ్: డిస్‌ప్లే పగిలినా, బ్యాటరీ పోయినా.. దేనికి రిపేర్ ఖర్చు ఎక్కువ?

రూ.1,999కే రియల్‌మీ 20000mAh పవర్ బ్యాంక్..ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ అదిరిపోయాయి!

రూ.6,599కే బెస్ట్ టీవీ..ఆఫర్ పూర్తవకముందే కొనేయండి!

వేల రూపాయల ఫీచర్లు రూ.999కే..ఆఫర్ మాములుగా లేదుగా!

అమెజాన్ సేల్‌లో సగం ధరకే..బ్రాండెడ్ ఫ్రిజ్‌లు, వెంటనే కొనేయండి

రూ.1,500లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్..బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ సౌండ్

బ్రాండెడ్ ల్యాప్ టాప్‌పై భారీ డిస్కౌంట్..ఇంతకంటే బెస్ట్ మోడల్ ఉండదు!

తక్కువ కరెంట్ బిల్లుతో అద్భుతమైన కూలింగ్..హయర్ ఫ్రిజ్‌పై భారీ డిస్కౌంట్

Big Stories

Advertisement
×