E-Paper
Advertisement

UPI పేమెంట్స్‌పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?

UPI పేమెంట్స్‌పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?
Advertisement

MDR Charges on UPI: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రూపురేఖలను మార్చేసిన UPI లావాదేవీలకు సంబంధించి ఒక కీలకమైన వార్త చక్కర్లు కొడుతోంది. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే యూపీఐ పేమెంట్స్‌పై తిరిగి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలపై వ్యాపారులు 0.5 శాతం వరకు ఫీజు చెల్లించాల్సి రావచ్చు. వచ్చే నెలలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చిన్న వ్యాపారులకు ఊరట..

ఈ కొత్త ప్రతిపాదన వల్ల చిన్న దుకాణదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఏడాదికి రూ.1.5 కోట్ల లోపు టర్నోవర్ ఉండే చిన్న వ్యాపారస్తులకు ఈ ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వనున్నారు. అంటే.. కేవలం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మాత్రమే ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది.

అసలు ఏమిటీ ఎండీఆర్?

Advertisement

సాధారణంగా డిజిటల్ పేమెంట్స్ స్వీకరించినందుకు గానూ వ్యాపారులు బ్యాంకులు లేదా పేమెంట్ యాప్స్ సంస్థలకు చెల్లించే రుసుమునే ‘ఎండీఆర్’ అంటారు. నెట్‌వర్క్ నిర్వహణ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, లావాదేవీల ప్రాసెసింగ్ ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వాడుకుంటారు. ప్రస్తుతానికి ఈ భారం నేరుగా కస్టమర్లపై పడకపోయినా.. వ్యాపారులు తమ వస్తువుల ధరలను కొద్దిగా పెంచే ప్రమాదం లేకపోలేదు.

Also Read: సింగిల్ ఛార్జ్‌తో 38 గంటల బ్యాటరీ.. హువావే నుంచి బెస్ట్ ప్రీమియం ఇయర్‌బడ్స్ విడుదల!

సాధారణ ప్రజలపై ప్రభావం ఎంత?

Advertisement

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మెజారిటీ యూపీఐ లావాదేవీలపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే.. దేశంలో జరిగే వ్యాపార లావాదేవీలలో 86% పేమెంట్స్ రూ.500 లోపే ఉంటున్నాయి. మరో 10% లావాదేవీలు రూ.501 నుండి రూ.2,000 మధ్య జరుగుతున్నాయి. కేవలం 4% లావాదేవీలు మాత్రమే రూ.2,000 మార్కును దాటుతున్నాయి. కాబట్టి.. కేవలం ఆ 4 శాతం పెద్ద పేమెంట్స్‌పైనే ఈ ప్రభావం ఉంటుంది.

ఈ నిర్ణయానికి గల కారణాలేమిటి?

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి 2020లో ప్రభుత్వం ఎండీఆర్ ఛార్జీలను రద్దు చేసింది. కానీ, యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో బ్యాంకులు, పేమెంట్ కంపెనీలపై నిర్వహణ భారం భారీగా పెరిగింది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఈ ఖర్చులకు సరిపోవడం లేదని బ్యాంకులు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే, వ్యవస్థను సజావుగా నడపడానికి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also Read: 45W ఫాస్ట్ ఛార్జింగ్, 8000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి Realme C100x ఎంట్రీ.. టెక్ లవర్స్ ఫుల్ హ్యాపీ!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×