E-Paper
Advertisement

Yuva Star 3: రూ.7500 కంటే తక్కువ ధరలో 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ.. లావా కొత్త ఫోన్ లాంచ్

Yuva Star 3: రూ.7500 కంటే తక్కువ ధరలో 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ.. లావా కొత్త ఫోన్ లాంచ్
Advertisement

Lava Yuva Star 3| దేశీయ మొబైన్ ఫోన్ కంపెనీ లావా ఇండియాలో కొత్తగా యువ స్టార్ 3 స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వినియోగదారుల కోసం తయారు చేశారు. గతంలో వచ్చిన యువ స్టార్ 2 మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్. రోజువారీ ఉపయోగానికి, బ్యాటరీ రఫ్ యూసేజ్‌కు సాధారణ పనులకు ఈ ఫోన్ బాగా సరిపోతుంది.

లావా యువ స్టార్ 3 ధర, లభ్యత

ఈ ఫోన్ ధర రూ.7,499 మాత్రమే. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఉంది. ఒక సంవత్సరం వారంటీతో లావా కంపెనీ ఉచిత హోం సర్వీస్ కూడా ఇస్తోంది. మార్చి 2026 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయి. లావా అధికారిక వెబ్‌సైట్, రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. ఇండిగో బ్లాక్, సియాచెన్ వైట్ రంగుల్లో లభిస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్ వివరాలు

Advertisement

లావా యువ స్టార్ 3లో 6.75 ఇంచ్ పెద్ద LCD కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. HD ప్లస్ రెజల్యూషన్‌తో స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది. మ్యాట్ ఫినిష్ డిజైన్ ఉంది కాబట్టి ఫింగర్‌ప్రింట్ అచ్చు సాధారణంగా ఫోన్‌ స్క్రీన్‌పై పడవు. అందుకే పట్టుకోవడం సులభం. వీడియోలు చూడటం, బ్రౌజింగ్, సోషల్ మీడియా ఉపయోగానికి బాగా సరిపోతుంది.

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

ఈ ఫోన్ UNISOC SC9863A చిప్‌సెట్‌తో నడుస్తుంది. 4GB ఫిజికల్ RAMతో పాటు 4GB వర్చువల్ RAM కూడా ఉంది. దీనివల్ల బేసిక్ మల్టీటాస్కింగ్ సాఫీగా జరుగుతుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, మైక్రోSD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 15 Go ఎడిషన్‌తో వస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ తక్కువ హార్డ్‌వేర్‌లో కూడా మంచి పర్‌ఫామెన్స్ ఇస్తుంది.

కెమెరా ఫీచర్లు

Advertisement

వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. LED ఫ్లాష్‌తో తక్కువ లైటింగ్‌లో కూడా ఫోటోలు తీయవచ్చు. ముందు వైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు ఉపయోగపడుతుంది. IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి చిన్న నీటి చుక్కలు, దుమ్ము నుంచి కొంత రక్షణ ఉంటుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

5000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించవచ్చు. 10W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. USB Type-C పోర్ట్ ఉపయోగిస్తారు. ఫోన్ బరువు 193.7 గ్రాములు, పరిమాణం 164.96 × 76.1 × 8.5 mm.

Also Read: పిండి వేస్తే చాలు రోటీ రెడీ.. వేయించాల్సిన అవసరం లేదు.. ఫుల్ ఆటోమెటిక్

కనెక్టివిటీ, సెక్యూరిటీ

డ్యూయల్ 4G VoLTE సపోర్ట్ ఉంది. Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 4.2, GPS కూడా ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ ఎవరికి బెస్ట్?

తక్కువ ధరలో నమ్మకమైన స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారికి ఇది బాగా సరిపోతుంది. కాల్స్, బ్రౌజింగ్, సోషల్ మీడియా వినియోగించే విద్యార్థులు, మొదటిసారి ఫోన్ కొనేవారికి ఉపయోగకరం. ధర, బ్యాటరీ, అవసరమైన ఫీచర్ల మధ్య మంచి బ్యాలెన్స్ ఉంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×