E-Paper
Advertisement

Cybercrime: రిటైర్డ్ ఉద్యోగిపై సైబర్ పంజా.. 10 రోజుల పాటు నరకం చూపించి రూ. 1.23 కోట్లు లూటీ

Cybercrime: రిటైర్డ్ ఉద్యోగిపై సైబర్ పంజా.. 10 రోజుల పాటు నరకం చూపించి రూ. 1.23 కోట్లు లూటీ
Advertisement

Cybercrime: ప్రకాశం జిల్లా అద్దంకిలో వెలుగుచూసిన ఈ భారీ సైబర్ మోసం సమాజంలో పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ నేరాలకు అద్దం పడుతోంది. రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావును లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు..  అత్యాధునిక సాంకేతికతను, మానసిక భయాన్ని ఆయుధంగా చేసుకుని ఏకంగా రూ. 1.23 కోట్లు కాజేశారు.

నిందితులు తొలుత నాగేశ్వరరావుకు ఫోన్ చేసి..  ఆయన ఆధార్ కార్డు ఉపయోగించి ఎవరో డూప్లికేట్ బ్యాంక్ ఖాతా తెరిచారని..  ఆ ఖాతా ద్వారా భారీ ఎత్తున హవాలా లావాదేవీలు (మనీ లాండరింగ్) జరుగుతున్నాయని నమ్మించారు. ఈ కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ ఉందని..  సుప్రీంకోర్టు, సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరుగుతోందని భయపెట్టారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు బయట ఎవరికీ చెప్పకూడదని ‘గోప్యత’ పేరుతో ఒత్తిడి తెచ్చారు.

Advertisement

నేరగాళ్లు నాగేశ్వరరావును, ఆయన భార్యను దాదాపు పది రోజుల పాటు ‘డిజిటల్ అరెస్ట్’ చేశారు. అంటే..  వీడియో కాల్ ద్వారా నిరంతరం వారిపై నిఘా ఉంచారు. వీడియో కాల్‌లోనే వారి ఇంటిని శోధించినట్లు నటించి, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గృహనిర్భంధం చేశారు. వారు యూనిఫాంలో ఉండి, ఆఫీస్ సెటప్‌ను చూపించి నిజమైన పోలీసులమని భ్రమ కలిగించారు. విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేసి..  తన వద్ద ఉన్న పొదుపు మొత్తాన్ని ‘సెక్యూరిటీ డిపాజిట్’ పేరుతో వివిధ విదేశీ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ. 1.23 కోట్లు కాజేశారు.

బాధితుడి వద్ద ఉన్న నగదు మొత్తం అయిపోయిన తర్వాత కూడా నేరగాళ్లు వదల్లేదు. ఉన్న ఇల్లు కూడా అమ్మేసి ఆ డబ్బును జమ చేయాలని ఒత్తిడి చేయడంతో నాగేశ్వరరావుకు అనుమానం వచ్చింది. వెంటనే ఆయన అద్దంకి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అద్దంకి సీఐ సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

ఏ ప్రభుత్వ సంస్థ లేదా పోలీస్ విభాగం వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేయదు లేదా ఇంట్లో నిర్బంధించదు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించండి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×