E-Paper
Advertisement

రూ. 27వేలకే ఏఐ వాషింగ్ మెషీన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!

రూ. 27వేలకే ఏఐ వాషింగ్ మెషీన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!
Advertisement

LG 7 kg front load washing machine: ప్రస్తుత రోజుల్లో బట్టలను కేవలం ఉతకడమే కాదు, వాటిపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా, అలర్జీ కారకాలను పూర్తిగా తొలగించడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. చిన్న , మధ్యతరగతి కుటుంబాల కోసం ఎల్జీ బ్రాండ్ అందిస్తున్న అద్భుతమైన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్, ఇన్-బిల్ట్ స్టీమ్ వాష్ , లేటెస్ట్ ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తున్న ఈ వాషింగ్ మెషిన్ ప్రత్యేకతలు , ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎల్జీ 7 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్: 

1. ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ:

ఈ వాషింగ్ మెషీన్ మెయిన్ హైలైట్ దీని డైరెక్ట్ డ్రైవ్ మోటార్. సాధారణ వాషింగ్ మెషీన్‌లలా బెల్ట్ సహాయంతో కాకుండా.. దీని మోటార్ నేరుగా డ్రమ్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. దీనివ ల్ల మెషీన్ పని చేసేటప్పుడు వచ్చే సౌండ్ , వైబ్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. మోటార్ చాలా రోజులు పాడవకుండా ఉంటుంది కాబట్టి కంపెనీ దీనికి ఎక్కువ రోజుల వారంటీని అందిస్తుంది. ఇది కరెంట్ ఖర్చును కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

2. స్టీమ్ వాష్ & అలర్జీ ఫ్రీ క్లీనింగ్ :

Advertisement

మీ ఇంట్లో చిన్న పిల్లలు లేదా సున్నితమైన చర్మం ఉన్న వారు ఉన్నట్లయితే ఈ వాషింగ్ మెషీన్ మీకు ఫర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఉండే స్టీమ్ ఫీచర్ వేడి నీటి ఆవిరి ద్వారా బట్టలపై ఉండే 99.9% అలర్జీ కారకాలు, బ్యాక్టీరియా , దుమ్ము ధూళిని పూర్తిగా తొలగిస్తుంది.బట్టలను అత్యంత శుభ్రంగా, హైజీనిక్‌గా ఉంచడంలో కూడా ఈ టెక్నాలజీ అద్భుతంగా పని చేస్తుంది.

3.5-స్టార్ ఎనర్జీ రేటింగ్ & వాటర్ సేవింగ్:

కరెంట్ బిల్లు గురించి టెన్షన్ పడేవారికి.. ఈ 5-స్టార్ రేటింగ్ వాషింగ్ మెషీన్ చక్కటి పరిష్కారం. ఇది తక్కువ కరెంట్ ఖర్చు, తక్కువ నీటిని వాడుతూ.. ఇది బెస్ట్ క్లీనింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎకో-ఫ్రెండ్లీ ఫీచర్లతో తయారు చేసిన ఈ మెషీన్ పర్యావరణానికి, మీ బడ్జెట్‌కు ఏమాత్రం భారం కాకుండా చూస్తుంది.

4. AI DD టెక్నాలజీ, బట్టల సేఫ్టీ:

Advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో ఈ మెషిన్ బట్టల బరువును, వాటి క్లాత్ టెక్చర్‌ను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. దానికి తగినట్లుగా డ్రమ్ రొటేషన్ వేగాన్ని మార్చుకుని బట్టలు పాడవకుండా.. ఉతుకుతుంది. కాటన్, సిల్క్, ఉన్ని వంటి రకరకాల బట్టలను ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఇది కాపాడుతుంది.

Also Read: అమెజాన్‌లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్న ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

5. ధర:

అన్ని ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ మోడల్ వాషింగ్ మెషీన్ మార్కెట్లో , అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 27,490 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు , ఎక్స్ఛేంజ్ బోనస్‌లను వాడితే.. ఇది మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

గమనిక:

చిన్న కుటుంబాలకు, హైజీనిక్ క్లీనింగ్ కోరుకునే.. వారికి ఎల్జీ 7 కేజీ ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మెషీన్ ఒక అద్భుతమైన పెట్టుబడి లాంటిది. కొనే ముందు ఆన్‌లైన్ స్టోర్స్‌లోని ప్రత్యేక డిస్కౌంట్లు , డెలివరీ ఆఫర్లను గమనించడం మంచిది. సీజనల్ సేల్స్‌ను బట్టి ధరలలో మార్పులు ఉండొచ్చు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×