E-Paper
Advertisement

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!
Advertisement

Eshwar Sai wife Saranya: ఫోక్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మాధురి రాథోడ్ (Madhuri Rathod), ఈశ్వర్ సాయి(Eshwar Sai) కాంబినేషన్లో ప్రతి పాట కూడా సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ కి, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అలాంటి వీరిద్దరి భవిష్యత్తు బంగారుమయం చేసుకోవాల్సింది పోయి అనూహ్యంగా ఒకే గదిలో ఏకాంతంగా ఈశ్వర్ సాయి భార్య శరణ్యకు పట్టుబడడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. భార్య, కొడుకు ఉండగానే ఈశ్వర్ సాయి తన తోటి ఫోక్ డాన్సర్ అయిన మాధురి రాథోడ్ తో ఎఫైర్ పెట్టుకోవడం, ఇందుకు సంబంధించిన వీడియోలను, ఆయన భార్య బయట పెట్టడం అంతా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

లైవ్ డిబేట్ పెట్టిన ఈశ్వర్ సాయి భార్య శరణ్య..

గత వారం రోజులుగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కి సంబంధించిన పలు విషయాలు, వార్తలు, వీడియోలు, లేఖలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటే.. తాజాగా ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఏకంగా ఒక టీవీ ఛానల్ లో లైవ్ డిబేట్ పెట్టి విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. పైగా ఈ డిబేట్లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆర్ జె శేఖర్ భాషా కూడా ఉండడం గమనార్హం. శరణ్య మాట్లాడుతూ..” డోర్ ఓపెన్ చేయగానే ఈశ్వర్ ఎక్కడ అని నేను మాధురిని అడిగితే.. తను ఇక్కడ లేడు బృందావనంలో ఉన్నాడు అని చెప్పింది. ఇప్పుడే కదా ఇతను చెప్పాడు.. అంతలోపే బృందావన్ కు ఎలా వెళ్లాడు? అని అడిగితే అవునా అంటూ అడిగిందే తప్పా.. అసలు విషయాన్ని బయట పెట్టలేదు. సరే నేను లోపలికి వచ్చి కూర్చుంటాను ఈశ్వర్ సాయి వచ్చాకే మాట్లాడి బయటకు వెళ్తానని చెప్పాను. అప్పటికే అక్కడ గదిలో చీకటిగా ఉంది.

ఆ వస్తువులే ఈశ్వర్ సాయిని పట్టించాయి – శరణ్య

Advertisement

నేను లోపలికి వెళ్లి స్విచ్ ఆన్ చేయగానే.. అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ సెల్ఫ్ లో అక్కడ నా భర్త మొబైల్ చార్జర్ ఉంది. పైగా నేను, నా భర్త ఒకే బ్రాండ్ స్లిప్పర్స్ వాడుతాము. కాకపోతే ఆయన మగవారివి , నేను ఆడవారి స్లిప్పర్స్ వాడతాను. ఇక ఇవన్నీ ఇక్కడే ఉండేసరికి నాకు అప్పటికే అర్థమయిపోయింది. ఆయన ఇక్కడే ఉన్నాడని.. ఒకవేళ ఉంటే మంచం కింద లేక బాత్రూంలో ఉంటాడని ఊహించి వెంటనే బాత్రూం తలుపు తట్టాను. మా ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇంత జరుగుతున్నా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా నా దగ్గర ఎన్నో వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు, టెక్స్ట్ లు ఉన్నాయి. కావాలంటే అవన్నీ కూడా రిలీజ్ చేస్తాను. అంటూ ఎన్నో నిజాలు బయట పెట్టింది శరణ్య.

also read: బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకీపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్!

నాకు, నా కొడుకుకు ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత..

Advertisement

“ముఖ్యంగా మా ఆయన భవిష్యత్తు, కొడుకు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కేసును ఫైల్ చేయలేదు. వేములవాడ పోలీస్ స్టేషన్లో నాకు పోలీసులు ఒక వివరణ ఇచ్చారు. మీ భర్త తన జోలికి వెళ్ళరు. ఏం స్టాండ్ తీసుకుంటున్నారు అని అడిగితే.. నాకు ఒక కొడుకు ఉన్నాడు.. నేనేం చేయగలుగుతాను. మీరే ఒకసారి ఆలోచించండి అని చెప్పాను. ఇక వాళ్ళు కేస్ వరకు వద్దు.. ఒక లెటర్ రాయించేద్దాం అంటూ రాయించారు. బాబుకి గానీ, నీ భార్యకు గానీ ఏదైనా జరిగితే ఆ బాధ్యత నీదే.. ఆ అమ్మాయికి టచ్ లోకి వెళ్లినా కేస్ ఫైల్ చేస్తాం.. అనేటట్టుగా కొన్ని కొన్ని షరతులతో ఆయనతో ఒక లెటర్ రాయించి సైన్ పెట్టించారు” అంటూ తెలిపింది శరణ్య. ప్రస్తుతం ఈ లైవ్ డిబేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×