E-Paper
Advertisement

పేరెంట్స్‌‌‌కి షాకిచ్చిన నూతన దంపతులు.. తమ్ముడితో లేచిపోయిన యువతి, కర్ణాటకలో ఊహించని ఘటన

పేరెంట్స్‌‌‌కి షాకిచ్చిన నూతన దంపతులు.. తమ్ముడితో లేచిపోయిన యువతి, కర్ణాటకలో ఊహించని ఘటన
Advertisement

Karnataka: మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో గానీ కర్ణాటకలో వింత లవ్ స్టోరీ వార్తల్లోకి వచ్చింది. కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు.. వరుసకు తమ్ముడితో లేచిపోయింది. ఆ తర్వాత వివాహం చేసుకోవడమేకాదు, తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.

కర్ణాటకలో వింత ప్రేమ వివాహం.. పేరెంట్స్‌‌‌కి షాకిచ్చిన నూతన దంపతులు

Advertisement

బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లికి చెందిన 29 ఏళ్ల శశికళ లవ్‌లో పడింది. గడిచిన మూడేళ్లుగా హోస్పేట్‌కు చెందిన ప్రవీణ్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. వీరి లవ్ స్టోరీలోకి రెండు ఫ్యామిలీలు ఎంటరయ్యాయి. శశికళ-ప్రవీణ్ తల్లులిద్దరు అక్కాచెల్లెళ్లు. దీంతో వీరిద్దరు అక్క-తమ్ముడు అవుతారు. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు షాకయ్యారు. అంతేకాదు వారి ప్రేమను వ్యతిరేకించారు.

ఇలాంటి వివాహాలు మంచిదికాదని, రిలేషన్ షిప్ వదులుకోవాలని హెచ్చరించారు. పరిస్థితి గమనించిన పేరెంట్స్ శశికళకు మరొక యువకుడితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు, ఆపై పెళ్లి పత్రికలు పంచేశారు. వివాహానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. పెళ్లికి కొన్ని గంటల ముందు శశికళ.. ప్రియమైన తమ్ముడు ప్రవీణ్‌తో ఇంటి నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఓ శివాలయంలో వివాహం చేసుకున్నారు.

Advertisement

తమ్ముడితో లేచిపోయిన యువతి,  రోడ్డు మీదకు పేరెంట్స్

పెళ్లి జరిగిందని కానీ, పెద్దల నుంచి సమస్యలు తప్పవని భావించిన నూతన దంపతులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. వారి రక్షణ కోసం నేరుగా చిక్కబళ్లాపూర్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని జరిగినదంతా చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న శశికళ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. దీంతో స్టేషల్‌లో ఊహించని హైడ్రామా చోటు చేసుకుంది.

సొంత తమ్ముడ్ని ఎలా పెళ్లి చేసుకున్నావా? ఎలా కాపురం చేస్తావ్, పేరెంట్స్ పరువు తీశావంటూ జశశికళ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. ఇంత జరుగుతున్నా శశికల తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. తనకు అంతా ప్రవీణ్ సర్వస్వమని, భర్తతోనే తన జీవితమంటూ పోలీసుల ముందు తెగేసి చెప్పేసింది. ఈ వ్యవహారంపై చివరకు సోషల్ మీడియాకు ఎక్కింది.

ALSO READ: ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం.. వ్యాపారవేత్తను బలి తీసుకున్న కానిస్టేబుల్ దంపతులు

సామాజిక కట్టుబాట్ల, రక్త సంబంధాలు తోసిపుచ్చుతూ జరిగిన ఈ వివాహం కన్నడనాట హాట్ హాట్ టాపిక్‌గా మారింది.అధికారులు ధృవీకరించిన దాని ప్రకారం.. ఇద్దరూ మేజర్లేనని, స్వచ్ఛందంగా వివాహం చేసుకునే చట్టపరమైన హక్కు ఉందని అంటున్నారు. వారిపై చట్టవిరుద్ధ చర్యలు తీసుకోవద్దని కుటుంబ సభ్యులను ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ జంట చిక్కబళ్లాపూర్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారు.

Related News

రైల్వే ట్రాక్‌పై ఎగిసిపడ్డ మంటలు.. భద్రాచలం వెళ్లే ప్రయాణికులకు చుక్కెదురు.. అసలేం జరిగిందంటే?

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి!

కాకినాడలో ఘోరం.. విధులకు వెళ్తున్న కానిస్టేబుల్ దారుణ హత్య! అస‌లేం జ‌రిగిందంటే?

ప్రేమించుకున్నారు.. ఆపై పెళ్లి చేసుకున్నారు, వెంటాడిన భూతం.. కేవలం నెల రోజులకే

సినీ పరిశ్రమలో విషాదం.. హీరో, కెమెరామెన్ దుర్మరణం!

అంతా డూప్లికేట్.. ప్రీమియర్ లిక్కర్‌లో చీప్​ లిక్కర్ మిక్సింగ్..!

పటాన్‌చెరులో ఒక్కసారిగా పేలిన సిలిండర్.. భారీగా ఎగసిపడ్డ మంటలు!

ములుగులో తీవ్ర విషాదం.. లేగదూడ ప్రాణం కాపాడబోయి.. కాలగర్భంలో కలిసిపోయిన తండ్రీకొడుకులు!

Big Stories

Advertisement
×